నర్రా రాఘవ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 9:
నర్రా రాఘవరెడ్డి యాభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రజలకు బహుముఖ సేవల్ని అందించారు. 1950 నుంచి సిపిఐ పార్టీ సభ్యునిగా కార్యకర్తగా కళాకారుడుగా అందరికీ పరిచయస్తులు. అంతరంగిక సమస్యలతో పాటు సైద్ధాంతిక విభేదాలతో కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత సిపిఎం విధానాలను ముందుకు తీసుకుపోవాలని నర్రా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కళాకారుడుగా పార్టీ నిర్మాణ బాధ్యుడుగా ప్రజా సమస్యల్ని అధికారుల వద్ద రిప్రజెంటేషన్‌ చేసేవారు. మళ్లీ 1968లో మొదలైన ఉగ్రవాద చీలికను సైతం ఎదుర్కోవడంలో నర్రా ఎంతో కృషి చేశారు. ఉగ్రవాదం వైపు వెళ్లిన కార్యకర్తల్ని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రభావంతోనే 1972లో పార్టీ ఓటమి పాలైనా నిరాశకు గురికాలేదు. 1973లో బీబీనగర్‌-నడికుడి రైలు మార్గం విస్తరణకు కృషి చేశారు. ఎమర్జెన్సీ తర్వాత ఎమ్మెల్యేగా 1977లో గెలుపొందిన నర్రా శాసన సభలో ప్రజల, పార్టీ వాణిని వినిపించారు. పార్టీ నిర్మాణంలో కృషి చేస్తునే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సాధన కోసం అనేక పోరాటాలు చేశారు. ప్రజా ప్రతినిధిగా పార్టీ నాయకునిగా పనిచేయడంతో పాటు ప్రజా సంఘాల నిర్మాణానికి పాటుపట్టారు. గీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా నర్రా ఎన్నికై ఎక్సైజ్‌ విధానానికి, కాంట్రాక్టు పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి గుర్తింపు తెచ్చారు. గ్రామ సేవకుల సంఘాన్ని జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్ర ఉద్యమంగా తీర్చిదిద్దడంలో నర్రా పాత్ర ఎంతో ఉంది. చేనేత కార్మికుల సమస్యలపై కూడా అనేక పోరాటాలు సాగాయి. వాటికి నర్రా నాయకత్వం వహించి సంఘాన్ని గుర్తింపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. పార్టీ జిల్లా, నకిరేకల్‌ కార్యాలయాల నిర్మాణానికి కృషి చేశారు. గొల్లసుద్దుల-పిట్టల దొర ఇలా అనేక కళారూపాలు ప్రదర్శించి ప్రజల ఆదరణ పొందారు. సులభతరమైన సామెతలు- పొడుపు కథలు చెప్పి ప్రజల్ని అలరింపజేసేవారు.
==ప్రజా ప్రతినిధిగా==
 
1959-67 వరకు వట్టిమర్తి (శివనేనిగూడెం-వట్టిమర్తి) గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అదే కాలంలో నార్కట్‌పల్లి నాన్‌బ్లాక్‌కి జిల్లా పరిషత్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. నర్రా రాఘవరెడ్డి తన రాజకీయ పోరాటంలో 1972లో మినహా ఎప్పుడూ అపజయాన్ని చవిచూడలేదు. 1967, 1978, 1983, 1984, 1989, 1994లలో నకిరేకల్‌ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 1999లో శాసన సభకు పోటీ చేయలేదు. సిపిఎం శాసన సభా పక్ష నేతగా, ఉప నేతగా పలు పర్యాయాలు పనిచేశారు. టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాల పనితీరుపై అనేక విమర్శనాస్త్రాలు సంధించారు.
 
== మరణం ==
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు షుగర్‌ లెవల్స్‌ పెరగడంతో కుటుంబ సభ్యులు [[నార్కట్‌పల్లి]] కామినేని ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.
 
==సూచికలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నర్రా_రాఘవ_రెడ్డి" నుండి వెలికితీశారు