"విద్యా ప్రకాశానందగిరి స్వామి" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
'''శ్రీ విద్యా ప్రకాశానందగిరి ''' స్వామి వారు ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు,బహుభాషాకోవిదులు, శ్రీ గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరీ వ్యవస్థాపకులు.
==బాల్యం,విద్యాభ్యాసం==
శ్రీ [[విద్యా ప్రకాశానందగిరి స్వామి]] [[ఆనంద]] నామ సంవత్సర [[చైత్ర బహుళ తదియ]] (13-4-[[1914]]) నాడు బందరులో శ్రీ రామస్వామి, సుశీలా దేవి అనే పుణ్య దంపతులకు మూడవ పుత్రుడుగా జన్మించాడు. తండ్రి గారైన రామస్వామి న్యాయవాది. గొప్ప దేశభక్తి గలవాడు. హైందవ సమాజాన్ని చక్కగా సంస్కరించాలనే దృఢ సంకల్పంతో పనిచేసిన సంఘసంస్కర్త. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలను భాష్యంతో సహా అధ్యయనం చేశాడు. శిష్టాచార సంపన్నులైన ఈ పుణ్య దంపతుల ఇంటికి తరచుగా విద్వాంసులు, సాధు మహాత్ములు వచ్చేవారు. వేదాంత గోష్టులు జరుగుతుండేవి.
 
స్వామి వారి బాల్యనామం "ఆనంద మోహన్". చిన్నతనంలోనే ఎంతో ప్రజ్ఞా ప్రాభవం ప్రదర్శించేవాడు. పసితనం నుంచే ఎంతో దైవ భక్తి ఉండేది. రామస్వామి ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర విరక్తి ఏర్పరచుకున్నాడు. వకీలు వృత్తికి రాజీనామా చేసి చిన్న పర్ణ కుటీరంలో జీవిస్తూ, ధ్యానం, జపం, భజన, పారాయణం, అర్చన, ఆత్మవిచారణ, వేదాంతగోష్టులతో కాలం గడపసాగాడు. ఆదర్శ గృహిణి సుశీలాదేవి భర్తకు అన్ని విధాలా సహకరించేది. సహజంగానే ఆధ్యాత్మిక సంస్కారం గల ఆనంద మోహనుని చిత్త వృత్తి దైవ మార్గంలో పురోగమించటానికి వాతావరణం అనుకూలించింది.
శాస్త్ర విధుల ననుసరించి ఉపనయన సంస్కారం పొందిన ఆనందమోహన్, ఒకసారి వేటపాలెం లోని సారస్వతనికేతనంలో ఆనాటి ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ [[కాశీకృష్ణాచార్యులు|కాశీకృష్ణాచార్యుల]] అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేద ప్రతిపాదితాలైన బ్రహ్మ చర్య ధర్మాల గురించి అనర్గళంగా తన వాక్పటిమతో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉపన్యసించి సభలోని విద్వాంసులను పెద్దలను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. బ్రహ్మశ్రీ కాశీకృష్ణాచార్యులవారు " ఈ బాలబ్రహ్మచారి భవిష్యత్తులో గొప్ప యతీశ్వరుడు కాగలడు. ఇతని కీర్తి నలుదెసలా వ్యాపిస్తుంది." అంటూ ఆశీర్వదించాడు.
 
ఆయన చదువు అందరిలాగే సర్వసాధారణంగానే సాగింది. మెట్రిక్యులేషన్ వరకు [[విజయవాడ]] లోను తర్వాత డిగ్రీ [[మచిలీపట్నం]] లో పూర్తి చేశాడు. 1933 లో బి.ఎ.పట్టా పుచ్చుకొన్న ఆనందుడు కళాశాలలో చదివే రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించాడు. ఉన్నత చదువుల కోసం ఆ రోజుల్లో అందరిలానే [[వారణాసి]] లోని [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్ హిందూ విశ్వవిద్యాలయా]] నికి వెళ్ళాడు. అక్కడే 'కోవిద' పరీక్ష పూర్తి చేశాడు.
 
==ఆధ్యాత్మిక పరిమళం==
ఆయన ఆలోచనా విధానం లౌకిక విద్య నుండి అలౌకిక విద్య వైపు మళ్ళింది. ఒకసారి ఆయన [[గంగానది|గంగానదీ]] తీరంలోని పుణ్యక్షేత్రమైన [[రిషికేశ్]] ను దర్శించి గంగలో స్నానమాచరించాలని వచ్చాడు. నదిలో మూడు మునకలు వేయడానికి నదిలో దిగి రెండు మునకలు పూర్తి చేసి మూడో మునక పూర్తి చేయగానే ఆయన చేతిలోకి తాళపత్రాల్లో లిఖించబడిన [[భగవద్గీత]] ప్రత్యక్షమయింది. అవి [[పూలు]], [[పసుపు]], [[కుంకుమ]]లతో అర్చింపబడి ఉన్నాయి. ఈ సంఘటన ఆయన తన కర్తవ్య దీక్షను గుర్తు చేసిందిగా భావించాడు. గీతా సారాన్ని అందరికీ అందజేయాలని సంకల్పించాడు. వంద గీతా మహాజ్ఞాన యోగాలను చేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1475542" నుండి వెలికితీశారు