ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
== శీర్షిక ==
సినిమాకు మూలమైన విశ్వనాథ సత్యనారాయణ నవల [[ఏకవీర]] అన్న పేరే నిర్ధారించారు. ఏకవీర అన్న పేరును విశ్వనాథ సత్యనారాయణ ఎందుకు పెట్టారన్న విషయాన్ని సాహిత్య విమర్శకులు పరిశీలించారు. నవలలో ప్రధానమైన పాత్రలు ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతి. వీరిలో ప్రతిపాత్ర విశిష్టమైనవే, ఏ పాత్ర లేకున్నా కథాగమనం మారిపోతుంది. కానీ మీనాక్షి అనో, వీరభూపతి అనో, కుట్టాన్ అనో మరేదో పేరో కాకుండా ఏకవీర అనే పేరు పెట్టడం వెనుక విమర్శకులు కారణాన్ని విశ్లేషించారు. నవల ముగుస్తున్నప్పుడు సుందరేశ్వరుడు ఏకవీరను ఆవహించి ఆమెతో ఒక మహత్కార్యం చేయించాడని, అందుకే వారి కన్నా ఆ పాత్ర కొంత మిన్నయైనదని భావించారు.<ref name="టే.కామేశ్వరరావు విమర్శ">{{cite journal|last1=కామేశ్వరరావు|first1=టే|title=ఏకవీర విమర్శ|journal=గృహలక్ష్మి|date=మార్చి 1934|volume=7|url=https://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%83%E0%B0%B9%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_7|accessdate=6 March 2015}}</ref>
== నిర్మాణం ==
=== మూలకథ నేపథ్యం ===
=== కథాంశం అభివృద్ధి ===
=== తారాగణం ఎంపిక ===
=== చిత్రీకరణ ===
== చిత్రకథ==
[[తమిళనాడు]]లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది. కథాకాలం నాయకరాజుల పరిపాలనా కాలం. కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. కుట్టాన్ సేతుపతి రాచకుటుంబీకుడు కాగా వీరభూపతి సామాన్యమైన మధ్యతరగతి రైతుబిడ్డ. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీరను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు