ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
=== కథాంశం అభివృద్ధి ===
ఏకవీర నవలను సినిమా కథకు స్క్రీన్‌ప్లే పి.చెంగయ్య వ్రాశారు. సినిమాకు మాటలు, చాలా పాటలూ వ్రాసినది డా.సి.నారాయణరెడ్డి. ఈ సినిమా స్క్రిప్టులో నవలలో లేని అనేక చేర్పులు చేర్చడంతో పాటుగా నవలలోని అనేకమైన విషయాలు వదిలివేశారు. ఆ క్రమంలో నవలలోని పాత్రచిత్రణకూ, సినిమాలోని పాత్రచిత్రణకూ సినిమాలో క్లైమాక్సుకూ మొదలుకొని ఎన్నో విషయాల్లో మార్పులు వచ్చాయి. నవలలో పాత్రలకూ, పాఠకులకు కూడా చివరి వరకూ రెండు ప్రేమజంటలూ వివాహం విషయంలో తారుమారైనట్టు తెలియదు. ఈ విషయంలో నవలా రచయిత చాలా జాగ్రత్త తీసుకున్నారు. సినిమా దృశ్యమాధ్యమం కనుక దీనిలో పాత్రలకు తెలియకపోయినా నాయకుల్లో ఒకరు తన ప్రేయసి చిత్రం చిత్రించగా దాన్ని ప్రేక్షకులకు చూపించేయడం మొదలుకొని సినిమా అంతటా ఒకరి ప్రేయసినొకరు పెళ్ళాడారన్న విషయం ప్రేక్షకులకు తెలిసిపోతూనేవుంటుంది. నాయికలను వెనుకనుంచి చూపడమో, మేలిముసుగు వేసి చూపడమో, లేదా నీడలను చూపడమో సినిమాలలో ప్రయత్నించకపోవడాన్ని బట్టి స్క్రిప్టు దశ నుంచే మూలరచయిత కట్టడిగా పాటించిన గూఢతను మార్చివేశారన్న విషయం తెలుస్తోంది.
 
=== తారాగణం ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు