ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
# నవలలో పాత్రలకూ, పాఠకులకు కూడా చివరి వరకూ రెండు ప్రేమజంటలూ వివాహం విషయంలో తారుమారైనట్టు తెలియదు. ఈ విషయంలో నవలా రచయిత చాలా జాగ్రత్త తీసుకున్నారు. సినిమా దృశ్యమాధ్యమం కనుక దీనిలో పాత్రలకు తెలియకపోయినా నాయకుల్లో ఒకరు తన ప్రేయసి చిత్రం చిత్రించగా దాన్ని ప్రేక్షకులకు చూపించేయడం మొదలుకొని సినిమా అంతటా ఒకరి ప్రేయసినొకరు పెళ్ళాడారన్న విషయం ప్రేక్షకులకు తెలిసిపోతూనేవుంటుంది. నాయికలను వెనుకనుంచి చూపడమో, మేలిముసుగు వేసి చూపడమో, లేదా నీడలను చూపడమో సినిమాలలో ప్రయత్నించకపోవడాన్ని బట్టి స్క్రిప్టు దశ నుంచే మూలరచయిత కట్టడిగా పాటించిన గూఢతను మార్చివేశారన్న విషయం తెలుస్తోంది.
# నవలలో కుట్టాన్ సేతుపతి, వీరభూపతిల నడుమ స్నేహం వారి పూర్వప్రణయినులు తిరగబడి వివాహం చేసుకోవడం వంటి దురదృష్టకర విషయాలు విధివశాత్తు జరిగినా చెక్కుచెదరదు. కానీ సినిమాలో చివరి సన్నివేశాలలో వీరభూపతినీ, తన భార్యనీ ఒక ఉద్వేగ స్థితిలో చూసిన కుట్టాన్ సేతుపతి కత్తిదూసి యుద్ధం చేయబోతారు, ఆ తర్వాత వెంటనే కత్తి పారవేసినా దాన్ని తీసుకుని వీరభూపతి తనను తానే హతమార్చకుంటారు. నవలలోని ఆ సన్నివేశంలో కుట్టాన్ ఉండడమే జరగదు. పైగా చివర్లో వీరభూపతి సన్న్యసించడాన్ని చూసిన కుట్టాన్ తనకు, అతని భార్యకూ ఉన్న పూర్వప్రణయాన్ని బట్టి ఇంకా క్షమించలేదనుకుని ''స్థానాపతీ క్షమించలేకపోతివి'' అంటూ బాధపడతారు. ఆయా పాత్రల లక్షణాలను, వాటి మధ్య స్నేహాన్ని సినిమాలో మార్చారు.
# నవలలోని కల్పనకు, నాయకరాజుల కాలం నాటి చారిత్రికాంశాలు ముడిపెట్టారు. నవలలో అత్యంత ముఖ్యమైన సన్నివేశం ఏకవీర, వీరభూపతి ఒక ఉద్వేగ స్థితిలో కౌగిలించుకున్నాకా ఏర్పడిన శూన్యంలో బజారువెంబడి ఏకవీర వెళ్తూంటే దైవీకశక్తి ఆవహించి [[రాబర్ట్ డి నోబిలీ]]తో ఆమె హిందూమతాన్ని గురించి వాదించి గెలుస్తుంది. నవల ప్రకారం ఆ తర్వాత ఆమె భర్త కుట్టాన్ తిరిగిరావడమూ, ఆయన ఏకవీర విజయానికి సంతోషించి ఆమెను కౌగిలించుకోబోతే తనకు మాత్రమే ఉన్న విశిష్టమైన శరీరధర్మం వల్ల మరణించడమూ జరుగుతాయి. అయితే సినిమాలో రాబర్ట్ డి నోబిలీ ప్రస్తావన కూడా ఉండదు. మొత్తంగా ఆ సన్నివేశంతో పాటు నవలలో ఉన్న చారిత్రిక నేపథ్యమంతా దాదాపుగా విడిచిపెట్టారు. కుట్టాన్ నాయకరాజులకు ఎదురుతిరిగిన సైన్యాన్ని జయించిన విధానం నవలలో విపులంగా వ్రాయగా దాన్ని కూడా క్లుప్తంగా ముగించారు.
 
=== తారాగణం ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు