ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
# నవలలో కుట్టాన్ సేతుపతి, వీరభూపతిల నడుమ స్నేహం వారి పూర్వప్రణయినులు తిరగబడి వివాహం చేసుకోవడం వంటి దురదృష్టకర విషయాలు విధివశాత్తు జరిగినా చెక్కుచెదరదు. కానీ సినిమాలో చివరి సన్నివేశాలలో వీరభూపతినీ, తన భార్యనీ ఒక ఉద్వేగ స్థితిలో చూసిన కుట్టాన్ సేతుపతి కత్తిదూసి యుద్ధం చేయబోతారు, ఆ తర్వాత వెంటనే కత్తి పారవేసినా దాన్ని తీసుకుని వీరభూపతి తనను తానే హతమార్చకుంటారు. నవలలోని ఆ సన్నివేశంలో కుట్టాన్ ఉండడమే జరగదు. పైగా చివర్లో వీరభూపతి సన్న్యసించడాన్ని చూసిన కుట్టాన్ తనకు, అతని భార్యకూ ఉన్న పూర్వప్రణయాన్ని బట్టి ఇంకా క్షమించలేదనుకుని ''స్థానాపతీ క్షమించలేకపోతివి'' అంటూ బాధపడతారు. ఆయా పాత్రల లక్షణాలను, వాటి మధ్య స్నేహాన్ని సినిమాలో మార్చారు.
# నవలలోని కల్పనకు, నాయకరాజుల కాలం నాటి చారిత్రికాంశాలు ముడిపెట్టారు. నవలలో అత్యంత ముఖ్యమైన సన్నివేశం ఏకవీర, వీరభూపతి ఒక ఉద్వేగ స్థితిలో కౌగిలించుకున్నాకా ఏర్పడిన శూన్యంలో బజారువెంబడి ఏకవీర వెళ్తూంటే దైవీకశక్తి ఆవహించి [[రాబర్ట్ డి నోబిలీ]]తో ఆమె హిందూమతాన్ని గురించి వాదించి గెలుస్తుంది. నవల ప్రకారం ఆ తర్వాత ఆమె భర్త కుట్టాన్ తిరిగిరావడమూ, ఆయన ఏకవీర విజయానికి సంతోషించి ఆమెను కౌగిలించుకోబోతే తనకు మాత్రమే ఉన్న విశిష్టమైన శరీరధర్మం వల్ల మరణించడమూ జరుగుతాయి. అయితే సినిమాలో రాబర్ట్ డి నోబిలీ ప్రస్తావన కూడా ఉండదు. మొత్తంగా ఆ సన్నివేశంతో పాటు నవలలో ఉన్న చారిత్రిక నేపథ్యమంతా దాదాపుగా విడిచిపెట్టారు. కుట్టాన్ నాయకరాజులకు ఎదురుతిరిగిన సైన్యాన్ని జయించిన విధానం నవలలో విపులంగా వ్రాయగా దాన్ని కూడా క్లుప్తంగా ముగించారు.
# నవలలో పతాక సన్నివేశంలో వద్దు వద్దన్నా భర్త దరిజేరి కౌగిలించుకోవడంతో తన విశిష్టమైన స్పర్శాగుణం కారణంగా ఒకానొక అతీత స్థితికి చేరి ఏకవీర మరణిస్తుంది. నవలలోని మిగిలిన ముఖ్యపాత్రలలో ఒకరైన వీరభూపతి తాను తన్మయత్వంలో స్నేహితుని భార్యను కౌగిలించుకున్నందుకు సన్న్యసిస్తాడు. కుట్టాన్, వీరభూపతి,మీనాక్షి మరణించరు. సినిమాలో మాత్రం అందుకు విరుద్ధంగా నాలుగు పాత్రలూ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు చూపారు. మరణించడంలోనూ ఆత్మహత్య చేసుకోవడం కారణంగా ఆయా పాత్రల వ్యక్తిత్వాలు కూడా బలహీనమయ్యాయి.
ఇటువంటి కీలకమైన మార్పులే కాక అనేకమైన ఇతర మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.
 
=== తారాగణం ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు