ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
ఈ సినిమాకు మూలకథ అందించిన [[ఏకవీర]] తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారం పొందిన రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన నవల. నవల విశ్వనాథ సత్యనారాయణ రచనాజీవితంలోకెల్లా విశిష్టమైన రచనల్లో ఒకటిగా నిలిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటుగా నవల విస్తృతంగా పాఠకాదరణ పొందింది. ఆయన రచించిన వందకు మించిన రచనల్లో విశ్వనాథ సత్యనారాయణే స్వయంగా ''నా ఏకవీర, వేయిపడగలు కళాత్మకమైనవి. సంపూర్ణమైన రచనలని నేను భావిస్తాను'' అన్నారు.<ref name="విశ్వనాథ ఒక కల్పవృక్షం">{{cite book|last1=పురాణం|first1=సుబ్రహ్మణ్యశర్మ|title=విశ్వనాథ ఒక కల్పవృక్షం|date=2005|publisher=పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|pages=235, 236|edition=1}}</ref> నవల పలుమార్లు పునర్ముద్రణలు చెందడంతోపాటుగా విద్యాప్రణాళికల్లో పాఠ్యాంశంగా కూడా నిర్దేశింపబడింది. దీన్ని మలయాళంలోకి అనువదించి ప్రచురించారు. ఈ నవల గురించి పలువురు సాహిత్యవేత్తలు అనేకవిధాలుగా మెచ్చుకున్నారు. పోరంకి దక్షిణామూర్తి ఈ నవలను రసవత్తరమైన కావ్యమని మెచ్చుకోగా, మధురాంతకం రాజారాం దీనిలోని కథాకథనకౌశలాన్నెంతగానో ప్రశంసించారు.<ref name="పోరంకి తెలుగు నవల">{{cite book|last1=పోరంకి|first1=దక్షిణామూర్తి|title=తెలుగు నవల|date=1975|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ|page=19|edition=1}}</ref> <ref name="మధురాంతకం విశ్వనాథ భారతి">{{cite book|last1=మధురాంతకం|first1=రాజారాం|title=విశ్వనాథభారతి|date=2002|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|page=154}}</ref> అటువంటి నవలను సినిమాకు మూలకథాంశంగా స్వీకరించారు.
 
=== కథాంశంస్క్రిప్ట్ అభివృద్ధి ===
ఏకవీర నవలను సినిమా కథకు స్క్రీన్‌ప్లే పి.చెంగయ్య వ్రాశారు. సినిమాకు మాటలు, చాలా పాటలూ వ్రాసినది డా.సి.నారాయణరెడ్డి. ఈ సినిమా స్క్రిప్టులో నవలలో లేని అనేక చేర్పులు చేర్చడంతో పాటుగా నవలలోని అనేకమైన విషయాలు వదిలివేశారు. ఆ క్రమంలో నవలలోని పాత్రచిత్రణకూ, సినిమాలోని పాత్రచిత్రణకూ సినిమాలో క్లైమాక్సుకూ మొదలుకొని ఎన్నో విషయాల్లో మార్పులు వచ్చాయి. అటువంటి ప్రధానమైన మార్పుల్లో కొన్ని
# నవలలో పాత్రలకూ, పాఠకులకు కూడా చివరి వరకూ రెండు ప్రేమజంటలూ వివాహం విషయంలో తారుమారైనట్టు తెలియదు. ఈ విషయంలో నవలా రచయిత చాలా జాగ్రత్త తీసుకున్నారు. సినిమా దృశ్యమాధ్యమం కనుక దీనిలో పాత్రలకు తెలియకపోయినా నాయకుల్లో ఒకరు తన ప్రేయసి చిత్రం చిత్రించగా దాన్ని ప్రేక్షకులకు చూపించేయడం మొదలుకొని సినిమా అంతటా ఒకరి ప్రేయసినొకరు పెళ్ళాడారన్న విషయం ప్రేక్షకులకు తెలిసిపోతూనేవుంటుంది. నాయికలను వెనుకనుంచి చూపడమో, మేలిముసుగు వేసి చూపడమో, లేదా నీడలను చూపడమో సినిమాలలో ప్రయత్నించకపోవడాన్ని బట్టి స్క్రిప్టు దశ నుంచే మూలరచయిత కట్టడిగా పాటించిన గూఢతను మార్చివేశారన్న విషయం తెలుస్తోంది.<ref name="విశ్వనాథ కథన కౌశలం డాక్టర్ వై కామేశ్వరి">{{cite book|last1=డా. వై.|first1=కామేశ్వరి|title=ఏకవీర: విశ్వనాథ కథన కౌశలం|date=అక్టోబర్, 2010|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|edition=1}}</ref>
# నవలలో కుట్టాన్ సేతుపతి, వీరభూపతిల నడుమ స్నేహం వారి పూర్వప్రణయినులు తిరగబడి వివాహం చేసుకోవడం వంటి దురదృష్టకర విషయాలు విధివశాత్తు జరిగినా చెక్కుచెదరదు. కానీ సినిమాలో చివరి సన్నివేశాలలో వీరభూపతినీ, తన భార్యనీ ఒక ఉద్వేగ స్థితిలో చూసిన కుట్టాన్ సేతుపతి కత్తిదూసి యుద్ధం చేయబోతారు, ఆ తర్వాత వెంటనే కత్తి పారవేసినా దాన్ని తీసుకుని వీరభూపతి తనను తానే హతమార్చకుంటారు. నవలలోని ఆ సన్నివేశంలో కుట్టాన్ ఉండడమే జరగదు. పైగా చివర్లో వీరభూపతి సన్న్యసించడాన్ని చూసిన కుట్టాన్ తనకు, అతని భార్యకూ ఉన్న పూర్వప్రణయాన్ని బట్టి ఇంకా క్షమించలేదనుకుని ''స్థానాపతీ క్షమించలేకపోతివి'' అంటూ బాధపడతారు. ఆయా పాత్రల లక్షణాలను, వాటి మధ్య స్నేహాన్ని సినిమాలో మార్చారు.<ref name="విశ్వనాథ కథన కౌశలం డాక్టర్ వై కామేశ్వరి" />
# నవలలోని కల్పనకు, నాయకరాజుల కాలం నాటి చారిత్రికాంశాలు ముడిపెట్టారు. నవలలో అత్యంత ముఖ్యమైన సన్నివేశం ఏకవీర, వీరభూపతి ఒక ఉద్వేగ స్థితిలో కౌగిలించుకున్నాకా ఏర్పడిన శూన్యంలో బజారువెంబడి ఏకవీర వెళ్తూంటే దైవీకశక్తి ఆవహించి [[రాబర్ట్ డి నోబిలీ]]తో ఆమె హిందూమతాన్ని గురించి వాదించి గెలుస్తుంది. నవల ప్రకారం ఆ తర్వాత ఆమె భర్త కుట్టాన్ తిరిగిరావడమూ, ఆయన ఏకవీర విజయానికి సంతోషించి ఆమెను కౌగిలించుకోబోతే తనకు మాత్రమే ఉన్న విశిష్టమైన శరీరధర్మం వల్ల మరణించడమూ జరుగుతాయి. అయితే సినిమాలో రాబర్ట్ డి నోబిలీ ప్రస్తావన కూడా ఉండదు. మొత్తంగా ఆ సన్నివేశంతో పాటు నవలలో ఉన్న చారిత్రిక నేపథ్యమంతా దాదాపుగా విడిచిపెట్టారు. కుట్టాన్ నాయకరాజులకు ఎదురుతిరిగిన సైన్యాన్ని జయించిన విధానం నవలలో విపులంగా వ్రాయగా దాన్ని కూడా క్లుప్తంగా ముగించారు.<ref name="విశ్వనాథ కథన కౌశలం డాక్టర్ వై కామేశ్వరి" />
# నవలలో పతాక సన్నివేశంలో వద్దు వద్దన్నా భర్త దరిజేరి కౌగిలించుకోవడంతో తన విశిష్టమైన స్పర్శాగుణం కారణంగా ఒకానొక అతీత స్థితికి చేరి ఏకవీర మరణిస్తుంది. నవలలోని మిగిలిన ముఖ్యపాత్రలలో ఒకరైన వీరభూపతి తాను తన్మయత్వంలో స్నేహితుని భార్యను కౌగిలించుకున్నందుకు సన్న్యసిస్తాడు. కుట్టాన్, వీరభూపతి,మీనాక్షి మరణించరు. సినిమాలో మాత్రం అందుకు విరుద్ధంగా నాలుగు పాత్రలూ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు చూపారు. మరణించడంలోనూ ఆత్మహత్య చేసుకోవడం కారణంగా ఆయా పాత్రల వ్యక్తిత్వాలు కూడా బలహీనమయ్యాయి.<ref name="విశ్వనాథ కథన కౌశలం డాక్టర్ వై కామేశ్వరి" />
ఇటువంటి కీలకమైన మార్పులే కాక అనేకమైన ఇతర మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు