అబ్బూరి వరదరాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
అబ్బూరి వరదరాజేశ్వరరావు 1923లో మద్రాసులో జన్మించాడు. ఇతని స్వగ్రామం [[గుంటూరు జిల్లా]], [[కొల్లిపర]] మండలానికి చెందిన [[జెముడుపాడు]] గ్రామం. ఇతని బాల్యం [[బందరు]],[[బెజవాడ]],[[విశాఖపట్నం]]లలో గడిచింది. స్థానాపతి సత్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృతము, తెలుగు అధ్యయనం చేశాడు. విశాఖపట్నం లోని సి.బి.ఎం.హైస్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి చరిత్ర, రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రాలలో ఎం.ఎ. పట్టాపొందాడు.
==ఉద్యోగం==
ఇతడు [[ఆంధ్రప్రభ]], [[ఇండియన్ ఎక్స్‌ప్రెస్]] దినపత్రికలలోను, మద్రాస్(వార్)రివ్యూ అనే పత్రికలోను సబ్ ఎడిటర్‌గా పనిచేశాడు. మద్రాసు ప్రభుత్వంలో ఆహారశాఖలో ప్రజాసంబంధాల అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాదు నిజాం ప్రభుత్వంలో సమాచారశాఖలో 1946-47లో పనిచేశాడు.తరువాత హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్‌లో పబ్లిసిటీ సెక్రెటరీగా ఉన్నాడు. 1949లో భారత్(బొంబాయి) పత్రికకు హైదరాబాదు విలేఖరిగా పనిచేశాడు. 1953లో బిర్లాబ్రదర్స్‌కు హైదరాబాదులో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా నియమించబడ్డాడు. [[కవిత]] పేరుతో ఒక పత్రికను 1954లో ప్రారంభించాడు.
 
==రచనలు==