కుముదవల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''కుముదవల్లి''' ([[ఆంగ్లం]]: '''Kumudavalli'''), [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకోడేరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 534 210. ఈ గ్రామానికి మరో పేరు '''కోడవల్లి'''. భీమవరం పట్టణానికి చేరువలో ఉన్న ఈ ఊరిలో బాగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు నూరుకు పైబడి వర్షాలుగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంధాలయం. ప్రముఖ పారిశ్రామిక వేత్త స్వర్గీయ పద్మశ్ర్రీ డాక్టర్ బి.వి రాజు, ఆంధ్ర క్షత్రియులలో మొట్టమొదటి రాజ్యాంగ పదవిని అధిరోహించిన [[భూపతిరాజు రామకృష్ణంరాజు]], విజువల్ సాఫ్ట్ వ్యవస్థాపకులు కలిదిండి కృష్ణంరాజు, భూపతిరాజు తిరుపతిరాజు మొదలగు ప్రముఖులు జన్మించిన ఊరు ఇది.
 
== గ్రంధాలయ ఆచారం ==
కుముదవల్లి, [[పోడూరు]]లలో పెళ్లిళ్లు జరిగే సమయంలో గ్రంథాలయాలకు కట్నం ఇవ్వడం అనేదిఒకప్రత్యేక ఆచారంగా ఉండేది. అప్పట్లో ప్రతి ఒక్కరు దీనిని ఆచరించడం విధిగా ఉండేది. దీని వెనుక దాదాపు గ్రంథాలయ ఉద్యమానికి ఉన్నంత చరిత్ర. అప్పట్లో ఇప్పుడున్నంత స్థాయిలో సమాచార సాధనాలు లేవు. ముద్రణారంగం అంతగా అభివృద్ధి చెందలేదు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలను ఒకచోటకు చేర్చి. గ్రంథాలయాలను నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ సమయంలోనే [[పశ్చిమగోదావరి జిల్లా]] కుముదవల్లివాసులు ఓ వినూత్న ప్రయోగానికి దిగారు. [[కందుకూరి వీరేశలింగం]]తో సంప్రదింపులు జరిపి ఆయన అందించిన ప్రోత్సాహంతో గ్రం«థాలయ నిర్వహణకు స్వయంగా పూనుకున్నారు. అంతేకాదు గ్రామంలో ఎవరింట్లో పెళ్లి జరిగినా- అమ్మాయి వైపు వారైనా, అబ్బాయి వైపు వారైనా గ్రంథాలయానికికి ఎంతోకొంత కట్నంగా ఇవ్వాలనే ఒప్పందానికి వచ్చారు. పెళ్లప్పుడే కాదు, ప్రతి [[దీపావళి]] రోజున ప్రతి ఒక్కరు పదిరూపాయల ఇవ్వాలనే నియమం కూడా పెట్టుకున్నారు గ్రామస్థులు. దీంతో [[రాజమండ్రి]] [[గౌతమీ గ్రంథాలయం]] స్థాపనకు ఒక సంవత్సరం ముందే అన్ని హంగులతో.. కుముదవల్లిలో [[1897]] జూన్ 27న గ్రంథాలయం ఊపిరిపోసుకుంది. తర్వాత.. గ్రంథాలయ నిర్వహణ కోసమే రెండు ఎకరాల భూమి సమకూరింది. ఏటా ఈ భూమిపై వచ్చే ఆదాయాన్ని లైబ్రరీ ఖాతాలో జమ చేస్తారు.
 
==గ్రామ ప్రముఖులు==
ప్రముఖ పారిశ్రామిక వేత్త స్వర్గీయ పద్మశ్ర్రీ డాక్టర్ బి.వి రాజు, ఆంధ్ర క్షత్రియులలో మొట్టమొదటి రాజ్యాంగ పదవిని అధిరోహించిన [[భూపతిరాజు రామకృష్ణంరాజు]], విజువల్ సాఫ్ట్ వ్యవస్థాపకులు కలిదిండి కృష్ణంరాజు, భూపతిరాజు తిరుపతిరాజు మొదలగు ప్రముఖులు జన్మించిన ఊరు ఇది.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/కుముదవల్లి" నుండి వెలికితీశారు