వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారు, కొద్దికాలంలోనే ఎంతో కార్యదీక్ష, దక్షత మరియు పరిపాలనా అనుభవములు అందిపుచ్చుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదములు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ మనసులోని మాటలు చెప్పారు అందులో తప్పులేదనుకుంటాను. ఎవరూ చింతపడ వలసిన అవసరము అంతగా లేదు. సద్భావనతో సమస్య ఏదైనా ఉన్న, దానిని అలాగే అదే ఆలోచనతో తీసుకుంటే అన్నింటికీ పరిష్కారములు తప్పకుండా దొరుకుతాయి. అందరి వికీ (సీఐఎస్ మరియు ఎ టు కె) లకు విజయోస్తు, శుభమస్తు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 12:25, 31 మార్చి 2015 (UTC)
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారు మీరు పైన కొన్ని అంశాలను ప్రస్తావించారు. వాటికి విపులంగా సమాధానాలు కొన్ని వివరణలు త్వరలోనే ఇక్కడ పొందుపరచగలను. ఈ ఆలస్యానికి క్షంతవ్యుడను.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 03:35, 5 ఏప్రిల్ 2015 (UTC)
[[వాడుకరి:Pavan santhosh.s|పవన్]] గారు కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యంగా స్పందిస్తున్నాను. అదీ కాకుండా మీరు ప్రస్తావించిన అంశాలపై విపులంగా వివరణలు వ్రాయలనుకొన్నాను, కొంత సమయం పట్టింది. ఇక వివరణలో వెళ్లెముందు కొన్ని macro issues గురించి ముందు ప్రస్తుతించదలిచాను. ఇవి మీరడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికే కాకుండా భవిషత్తులో మనం తెవికీ ప్రగతికి కృషి చేయడానికి ఒక framework ని కూడా ఇస్తుందనే నమ్మకంతో ఈ ప్రయత్నం.
*[[:te:|తెవికీ]] లక్ష్యాలు [[meta:India Access To Knowledge| సీ.ఐ.ఎస్-ఏ.2.కె]] లక్ష్యాలు వేరు కాదు: సెంటర్ ఫర్ ఇంటర్నెట్ ఆండ్ సొసైటీ (సీ.ఐ.ఎస్) ఒక స్వఛ్ఛంద సంస్థ దానిలో అంతర్గతంగా ఉన్న ఒక ప్రధాన అంగం ఆక్సెస్ టు నాలెడ్జ్ (ఏ.2.కె). సీ.ఐ.ఎస్. కి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అందులో free and open knowledge ఒక ముఖ్యమైన లక్ష్యం. వికీమీడియా ఫౌండేషన్ వారు భారత దేశంలో వికీమీడియా సముదాయాన్ని భారతీయ భాషా వికీ ప్రాజెక్టుల అభివృధ్ధి కొరకు ప్రత్యేకంగా కృషి జరపాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించి కొందరిని ఈ కార్యక్రమాన్ని నడపటానికిగాను ఉద్యోగులుగా నియమించింది. కాకపోతే అది విఫలం అవడంతో తన స్ట్రాటజీని మారుస్తూ ఇక్కడే ఉన్న ఒక స్వఛ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో భారతీయ భాషా వికీ ప్రాజెక్టుల, ఆయా సముదాయాల పెంపుకు దోహదపడాలనుకుంది. అందులో భాగంగా వికీమీడియా ఫౌండేషన్ వారు ఎన్నో సంస్థలను పరిశీలించిన మీదట సీ.ఐ.ఎస్. ని ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి సంప్రదించారు. ఈ కార్యక్రమం వలన ఇంకా మెరుగ్గా free and open knowledge అనే లక్ష్యాని దోహదపడగలమనే ఆలోచనతో సీ.ఐ.ఎస్. తన ఏ.2.కె ప్రోగ్రాం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టదలచింది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే వికీమీడియా ఫౌండేషన్ సీ.ఐ.ఎస్. ని సంప్రదించింది (ఇంకో విషయం సీ.ఐ.ఎస్. 2008 నాటి నుండే స్వఛ్ఛందంగా భారత దేశంలో జరిగే వికీమీడియా కార్యక్రమాలకు తనవంతుగా సహాయం అందిస్తూ వచ్చింది). తరువాత వికీమీడియా ఫౌండేషను వారు సెప్టెంబరు 2012 లో ఇచ్చిన గ్రాంటు ఆధారంగా భారతీయ భాషా వికీ ప్రాజెక్టుల, సముదాయాల ప్రగతి ఈ ఏ.2.కె ప్రోగ్రాం లక్ష్యాలుగా మారాయి. అంటే సీ.ఐ.ఎస్- ఏ.2.కె. లక్ష్యాలు వికీపీడియాలు లక్ష్యాలు ఒకటయ్యాయీ, కాబట్టి మనందరం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే సీ.ఐ.ఎస్-ఏ.2.కె ఉన్నదే భారతీయ భాష వికీ ప్రాజెక్టుల, సముదాయాల పరిపుష్టత కొరకు.
* సీ.ఐ.ఎస్.-ఏ.2.కె కి గ్రాంటు: సెప్టెంబరు 2012 లో ఇచ్చిన గ్రాంటు కాని తదనంతరం వచ్చిన FDC గ్రాంటు వల్ల కాని సీ.ఐ.ఎస్ కి ప్రత్యక్షంగా (డబ్బు రూపేణా) లాభించింది ఏమి లేదు. అప్పటివరకు సీ.ఐ.ఎస్.లో ఉన్న ఏ ఉద్యోగికి కూడా ఈ ప్రోగ్రాం ద్వారా జీతభత్యాలు ఇవ్వలేదు. ఈ ప్రోగ్రాంకి గాను వికీమీడియా భారతదేశం, వికీమీడియా ఫౌండేషను, భారత వికీమీడియా సముదాయన్ని ఎక్కువగా సంప్రదిస్తూ వికీపీడియా లక్ష్యాలు సాధించడానికి గాను ఉద్యోగులను తీసుకుంది. అందులో భాగంగా నన్ను ఫిబ్రవరి 2013లో ప్రోగ్రాం డైరెక్టరుగా తీసుకొవడం జరిగింది (అంతకు ముందు వరకు సీ.ఐ.ఎస్. కి నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు). అలాగే వికీమీడియా ఫౌండేషను వారు తాము ఇండియా ప్రోగ్రాంకొరకు తీసుకున్న ఉద్యోగులు ఏ.2.కె. ప్రోగ్రాం లోకి తరలించబడ్డారు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే సీ.ఐ.ఎస్. తాను స్వఛ్ఛందంగా వికీమీడియా ప్రగతికై తన ఇతర గ్రాంటు వనరులనుండి ఎంతో డబ్బు ఖర్చు చేసింది. ఉదాహరణకు ఏ.2.కె ప్రోగ్రాం డైరెక్టరుకు (అంటే నాకు) పోయిన సంవత్సరకాలంలో ఇచ్చిన జీతంలో Rs. 6,80,000/- వరకు సీ.ఐ.ఎస్. తన ఇతర వనరుల నుండి ఇచ్చింది, వచ్చే సంవత్సరంలో కూడా ఇవ్వటానికి కమిట్ అయ్యింది. ఇంకా ఈ ప్రోగ్రాం విజయానికి గాను ఎన్నో indirect expenses భరించింది. నేను చెప్పదలచుకున్నదేంటంటే… ఇప్పుడుంచిన తెవికీ ప్రణాళిక కానివ్వండీ మరే ఇతర ఏ.2.కె. ప్రోగ్రాం ప్రణాళిక కానివ్వండీ లేదా ప్రస్తుత FDC గ్రాంటు అప్లికేషను కానివ్వండీ… వీటివల్ల భారతీయ భాషా వికీ ప్రాజెక్టులు సముదాయలు లాభపొందుతాయి కాని సీ.ఐ.ఎస్ కాదు. ఒక వేళ ఈ సారి FDC గ్రాంటు రాలేదనుకోండి…నాకు తెలిసినంతలో సీ.ఐ.ఎస్.కి ఒరిగే నష్టమంటూ ఏమీలేదు. కాబట్టీ ఈ ప్రణాళిక, FDC గ్రాంటు, ownership మనందరిదీ (అంటే వికీపీడియనులది, ఏ.2.కె ప్రోగ్రాం టీంది) అని మనం గమనించవలసిన అవసరం ఉంది.
* నా-మా-మీ-మేము-మీరు-మనం ఏ.2.కె పనితీరు, కృషి: నేను ఏ.2.కె కి ప్రోగ్రాం డైరెక్టరుగా పని చేపట్టిన తదనంతరం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 2013 వరకు అనేకమంది (తె)వికీపీడియనులను వ్యక్తిగంతంగా కలిసాను. ఒక సీనియర్ వికీపీడియను ఇలా అన్నారు ''నేను గత మూడేండ్లుగా తెవికీలో చాలా చేసానండీ కాని నాకు ఏమంత ఫలితాలు కనిపించలేదు….. తెవికీలో మీరు పెద్దగా చేయదగింది ఏమీ లేదూ''. నేను వారికి చెప్పింది ''ఫరవాలేదు సార్, మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. మీకు వీలున్నంతలో సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి. ఒక మెంటర్ గా మీరు తోడవండీ''. అలానే ఇంకో సీనియర్ వికీపీడియను కలిసినపుడు ''విష్ణుగారు చెప్పండి తెవికీ ప్రగతికి మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం… నేను ఏ విధంగా సహాయపడగలను, నేను వీలున్నంతవరకు సహకారం అందిస్తానూ''. నేను వారికి చెప్పింది "థాంక్యూ సార్… మీలాంటి వారి సహకారం ఉందంటే మనం తప్పకుండా వచ్చే రెండు సంవత్సరాలలో తెవికీ ప్రగతి ఇంకా కృషి చేయగలం''. ఇక్కడ నేను ప్రస్తుతించదలచినది, ఒక వాలంటరీ సముదాయం నడుపుతున్న వీకీ ప్రాజెక్టులో ఏ.2.కె ప్రోగ్రాం కి ఎలాంటి స్పందన లభించింది, ఏ.2.కె ప్రోగ్రాం తన పనితీరుని ఏ విధంగా మలచుకుంది. ఒకరు, మీరు చేయండి అన్నారు. ఇంకొకరు నెను ఏ విధంగా సహాయపడగలను అన్నారు. ఏ.2.కె. ప్రోగ్రాం ఇద్దరితోను '''మనం''' చేద్దాం అని అంది. ఎందుకంటే తెవికీ సముదాయంలో ఎవరు ముందుకు వచ్చినా రాకున్నా తెవికీ సముదాయమంతటితో కలిసి కృషి చేయడమన్న ఫిలాసఫీతో ఏ.2.కె. ప్రోగ్రాంని రూపుదిద్దడం జరిగింది. ఏ.2.కె కూడా (వికీమీడియా ఫౌండేషను వారి ఇండియా ప్రోగ్రాం లా) సముదాయాన్ని పక్కన పెట్టి తనకు తోచిన కార్యక్రమాలు తోచిన విధంగా చేసుకుంటూ పోవచ్చును కూడా. అలా చేసి మేం చేసాం అని చెప్పుకోనూవచ్చు. మా ఎడిటర్లు, ఎడిట్లు, ప్రాజెక్టులు, వ్యాసాలు అంటూ రిపోర్టులు గణాంకాలు పెట్టుకోనూ వచ్చు. కాని ఆ పనితీరుని మనం ఎంచుకోలేదు. ఎందుకంటే ఏ.2.కె ప్రోగ్రాం ఫిలాసఫీ ''సముదాయం ముందు''… అందులో భాగంగా ఏ.2.కె ఒక కాటలిస్ట్ గా మాత్రమే తన పనితీరుని రూపొందించుకొంది. నా దృష్టిలో the magic is to get a fine balance and good mix of volunteer effort and voluntary sector professional time. To achieve this both the volunteers and voluntary sector professionals need to put effort with the sight on the vision of furthering free and open knowledge, with mutual respect, transparency and appreciative inquiry. మిగతా భాషా ప్రణాళికల్లో కన్నా ఈ మ్యాజిక్ తెవికీలో మనం కొంత మెరుగ్గా సాధించగలిగాం అని నా నమ్మకం,దానికి ముఖ్య కారణం మన సముదాయ సభ్యుల సహకారం. ఈ విషయాన్ని ట్రెయిన్-ద-ట్రెయినర్ 2015 కార్యక్రమంలో ఒక ఉదహరణగా కూడా నేను ప్రస్తుతించాను. 2013 నుండి ఇప్పటి వరకు ఏ.2.కె. ప్రోగ్రాం ప్రయత్నమంతా కూడా '''మనం''' అనేమాటతో తెవికీ ప్రగతికై కృషి చేయడమే తప్ప మేము అనే ధోరణిలో ఎప్పూడు వెళ్ళలేదు. దీనికై ఒక ఉదాహరణ మీరు చేపట్టిన డి.ఎల్.ఐ. ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు చేయవచ్చుననే ఆలోచన మీముందుంచింది, దానిని ఒక ఐ.ఇ.జీ ప్రపోజల్ గా మలవటానికి కొంత సహకారం అందించింది ఏ.2.కె. ఉద్యోగులే కదా. బహుశా మీరు చూసే ఉంటారు డి.ఎల్.ఐ. లో ఉన్న పుస్తాకాల జాబితాని తెలుగులో యూనీకోడికరించడం ద్వారా తెవికీకే కాకుండా అంతర్జాలంలో తెలుగు ప్రగతికి బాటలు వేయవచ్చుననే ఆలోచనను [[meta:India_Access_To_Knowledge/Work_plan_April_2013_-_June_2014/Telugu#Making_Telugu_Content_in_Public_Domain_Accessible|2013 తెలుగు ప్రణాళిక]]లోనే ప్రస్తుతించడం జరిగింది. ఏ.2.కె. నే నేరుగా గ్రాంటు డబ్బులతో ఈ పనిని 2013 లోనే చేసి ఉండవచ్చు కదా. కాని ఆ ప్రాజెక్టు మనంగా చేయలనుకున్నాం, నాకు తెలిసి అలాగే చేసాం. అలాగే [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాథ్]] గారు చేపట్టిన ప్రాజెక్టుకు వీలున్నంతవరకు సహకారం అందించడం జరిగింది. ఇవి చేయడం ద్వారా మన తెవికీ పురోగతి చెందుతుంది అనే ఉద్దేశ్యమే తప్ప మరేదీ లేదు అని మీరు గ్రహిస్తారనుకుంటున్నాను. నాకు తెలిసి డి.ఎల్.ఐ. ప్రాజెక్టుకు సహకారం అందించడానికి ముందుకు వచ్చిన సభ్యులు కూడా ''మనం'' అని ఆలోచించారు కాని ఇది నా ప్రాజెక్టు కాదు అని ఆలోచించరు కదా. ఈ మనం అనే ఫిలాసఫీ వికీకి ఒక మూలస్థంభం. దాన్ని ఏ.2.కె. (ఒక పెయిడ్ ప్రోఫెషనల్స్ టీంగా) భంగ పరచదలచుకోలేదు. ఏ.2.కె ఎంచుకున్న పనితీరు అంత తేలికైన విషయం కాదు. ఈ విధంగా ఒక వాలంటరీ మూవ్మెంటులో పని చేయడం కత్తిమీద సాములాంటిది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నాం. ఏ.2.కె. సభ్యులు కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు, నేర్చుకుంటున్నారు. ఒక పెయిడ్ ప్రోఫెషనల్స్ టీంతో ఏ.2.కె తో ఎలా కలిసి పని చేయాలనేది కూడా తెవికీ సముదాయం కొంత నేర్చుకుందని అనుకుంటున్నాను. ఈ పనితీరు వలన ఎప్పటికైనా ఎవరో ఒకరు ఏ.2.కె (నిజమైన కృషి)గా మీరు చేసిన ప్రగతి చూపండీ అంటే ప్రస్పుటంగా చూపలేమనే విషయం ఈ స్ట్రాటజీ structural weakness. బహుశా కొందరి దృష్టిలో ఏ.2.కె తీసుకున్న స్ట్రాటజీ సరైంది కాదేమో. కాని ఏనాడు తనకంటూ ఏ.2.కె. ప్రత్యేకంగా క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో తన పనితీరుని రూపొందించుకోలేదు. ఏం చేసుకుంటాం ఆ క్రెడిట్ తో (నిజమైన కృషి) చెప్పండీ! గత రెండేళ్ళ తెవికీ ప్రగతిలో ఏ.2.కె. నిజమైన కృషి మాటేమోకాని, గుండెలమీద చేయి వేసుకొని అసలు నిజంగా కృషి చేయలేదని అనుకుంటే అందరూ ఇక్కడే చెప్పండీ, ఇప్పుడే మానేద్దాం ఈ తెలుగు ప్రణాళికని.
* కృషికి తగ్గ ఫలితాలు ఎలా చూస్తున్నాం: ఏ.2.కె ఫలితాలను ఎప్పుడూ తెవికీ సముదాయ కృషి ఫలితాలుగానే చూపించింది, చూపిస్తుంది. ఇది ప్రణాళికలో ప్రస్పుటంగా విన్నవించడం జరిగింది. ఏ.2.కె ప్రత్యేకంగా చేపట్టిన ఆంధ్రలయోలా కాళాశాల వంటి ప్రాజెక్టులకు ప్రత్యేకంగా పేజిలు వికీలో ఉంచడం జరిగింది. మరి ''తెవికీ ప్రగతి అంతా ఏ.2.కె చేసిన ప్రగతే అనుకుంటే'' అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చునని అనుమానం వ్యక్తపరిచారు. కొంత పరిణతి ఉన్న ఏ వికీపీడియనైనా, ఏ.2.కె ఒక సగం కన్నా తక్కువ ఉద్యోగితో తెవిలో ప్రగతినంతా సాధించిందంటే నమ్మరు. మరింత లోతైన విశ్లేషణలు చేసి తెవికీ ప్రగతిలో ఏ.2.కె నిజమైన కృషిని తెలుసుకోవాలనుకునే వారికి కొన్ని ప్రశ్నలు. ఏ.2.కె నిర్వహించిన శిక్షణా శిబిరాల ద్వారా కొందరు తెవికీ ప్రాజెక్టులలో కృషి చేసారు. వారి కృషి అంతా ఏ.2.కె కృషిగా జమకట్టవలసిందేనా. వారు మిగతా వాలంటీయరు సభ్యుల లాంటి వారే కదా? ఉదాహరణకు, [[వాడుకరి:Pavan santhosh.s|పవన్]] గారినే తీసుకుందాం. వారికి తెవికీని పరిచయం చేసి కొంత ప్రావిణ్యం కల్పించింది ఏ.2.కె ఉద్యోగులే. వారికి సీనియర్ వికీపీడియనైన రాజశేఖర్ గారికి పరిచయం కూడా చేయించి వారికొక మెంటర్షిప్ లా కూడా చేయడానికి ప్రయత్నం జరిగింది. మరి పవన్ గారు తెవికీలో చేసిన కృషి అంతా ఏ.2.కె కృషిగా చూపించాలా? ఎన్నేళ్ళ వరకు ఇలా చూపించుకోవచ్చు? [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారు వారికి అందించిన సహకారాన్ని ఎలా చూపించాలి. నా దృష్టిలో ఇది వికీ వాలంటియర్ స్ఫూర్తికే వ్యతిరేకం. అలాగే ఇంకో ఉదాహరణ, [[meta:India_Access_To_Knowledge/Events/Train_the_Trainer_Program/2013|ట్రెయిన్-ద-ట్రెయినర్]] లో విశ్వనాధ్ గారిని పాల్గొనే విధంగా పోత్సహించి, [[వికీపీడియా:శిక్షణ_శిబిరం/విజయవాడ/విజయవాడ_3|విజయవాడ]], గుంటూరు మొదలైన చోట్లలో నిర్వహించిన వికీ శిక్షణా శిబిరాలలో వారిని పాల్గొనే విధంగా చూసి ఒక subtle mirrored learning process ని అవలంబిస్తూ వారు మరిన్ని తెవికీ శిక్షణా శిబిరాలు చేసే విధంగా ప్రోత్సహించిన తరువాత రేపు వారు తెవికీ ప్రగతికై చేసే కార్యక్రమాలలో ఏ.2.కె. కృషిని ఎలా ఎంత వరకూ చూపించాలి. ఎవరైనా ఈ విధంగా లోతైన విశ్లేషణలు చేయాలనుకుంటే ఏ.2.కె నుండి వీలైనంత తప్పక సహకారం అందిస్తాం. ప్రస్తుతం తెలుగుపై పనిచేసే ఒక సగం ఉద్యోగితో ఈ లోతైన విశ్లేషణలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వదలచుకోలేదు. ఇప్పటికే ఏ.2.కె ఉద్యోగులు సగటున రోజుకు 12 గంటలపైనే పని చేస్తున్నారు అని గమనించ ప్రార్ధన. ఇప్పటికే మాసిక న్యూస్-లెటర్స్, త్రైమాసిక రిపోర్టులంటూ ఏ.2.కె ఉద్యోగుల సమయం తెవికీ ప్రగతికి కీలకమైన కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ తో పోలిస్తే చాలా సమయం డాక్యుమెంటేషన్ లో పోతుంది . కేవలం రిపోర్టులే ప్రగతిని సాధించలేవుకదా. అలాగని కృషికి తగిన ఫలితం చూడవద్దని ఇక్కడ ఉద్దేశ్యం కాదు.[[meta:Grants:Learning & Evaluation/Global metrics| గ్లోబల్ మెట్ర్కిక్స్]] ని అనుసరించి తెవికీలో ఈ సంవత్సర ప్రగతిని నిరుటి ప్రగతితో పోల్చిచూపడం జరిగింది. ఇక ఏ.2.కె సముదాయంతో కలిసిపని చేయటానికి పూర్వపు ప్రగతితో చూసుకుంటే గత రెండు సంవత్సరాల ప్రగతి చాలా కోణాల నుంచి మెరుగ్గా ఉంది. ఉదాహరణకి 2012 చివరినాటివరకు తెవికీ ప్రగతికి, వైఫల్యాలకు సంబందించిన కొన్ని అంశాలను అర్జునగారు పొందుపరిచారు. ఈ దిగువ పట్టిక ఏ ఏ అంశాలలో మనం మెరుగయ్యామో చూపిస్తుంది. మరొక్కసారి నొక్కి చెప్పడం ఏంటంటే ఇది మనం సాధించిన ప్రగతి.
{| class="wikitable"
|-
! అంశం !! 2012 లో స్థితి ([[:దస్త్రం:Telugu_Wikipedia_-2012_Review.pdf|2012 విశ్లేషణ ప్రదర్శన]] లో అర్జున గారు తెలిపిన విధంగా) !! 2014 నాటికి స్థితి
!! వ్యాఖ్య
|-
| ఈ వారం విశేష కృషి || నిష్ఫలం || ఈ వారం కృషిగా కాకుండా ప్రాజెక్టు స్థాయిలో విశేష కృషి - విశేషమైన ఫలితాలు || వారం వారం కృషికి అందరూ సభ్యులు అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రాధాన్యతలు మారొచ్చు. అదే ప్రాజెక్టు పరంగా కృషి మరింత ప్రభావాన్ని చూపుతుంది.
|-
| వెబ్ ఛాట్ || మొదటి దఫా తరువాత జరగలేదు || ఎప్పటికప్పుడు స్కైప్, ఫేస్బుక్ చాట్, గూగుల్ హ్యాంగౌట్ ద్వారా వికీసభ్యుల చర్చలు || తెవికీ సభ్యుల సంభాషణోపకరణాల వాడుక హెచ్చు అయింది
|-
| ప్రాజెక్టు కృషి || కేవలం ఒకటి - జిల్లాల ప్రాజెక్టు విజయవంతమైనట్టు తెలపడం జరిగింది. || ఎన్నో ప్రాజెక్టులు చేపట్టడం విజయవంతం చేయడం జరిగింది || తెవికీ సభ్యుల సమిష్టి కృషి బాగా పని చేస్తోంది. వీటికి ముఖా ముఖి సమావేశాలు దోహదపడ్డాయి. దీనిని ఇంకా మెరుగు పరచుకోవాలి.
|-
| నగరాలు పట్టణాలలో వికీ శిక్షణ ||2 || హైదరాబాద్, బెంగుళూరు, గుంటూరు, పెద్దకాకాని, విజయవాడ, తాడేపల్లిగూడెం, తిరువూరు, రాజమండ్రి, పిఠాపురం ఇంకా మరిన్ని || వికీ శిక్షణతో పాటు ఆయా నగరాలలో వికీ సమూహాలు ఏర్పాటు చెయ్యాలి. ఆ దిశగా ఈ సంవత్సర ప్రణాళిక కృషిచేయనుంది.
|-
| వికీ టేక్స్ టౌన్స్ || చేపట్టలేదు || పెద్ద ఎత్తున విడిగా కాకుండా చిన్న స్థాయిలో తిరుపతి, గుంటూరు, విజయవాడలలో చేపట్టబడింది. హైదరాబాద్ గురించిన విశేషాలతో ఒక కొత్త సభ్యుడు పని చేస్తున్నాడు || వనరులు, వికీ సభ్యుల అందుబాటుతో ఇంకా కృషి చేయాలి
|-
| సభ్యుల కృషి గుర్తింపు || అర్జున గారు కొందరు సభ్యులకు 25, 100 మార్పుల స్థాయి దాటినపుడు శుభాకాంక్షలు తెలపడం, 500 ఎడిట్లు దాటినపుడు మెడల్ ఇవ్వటం చేసారు, దాదాపు ఒక నెల పాటూ కొనసాగించారు || కొ.ల.రా.వి.పు, ప్రస్తుతం ప్రాజెక్టు స్థాయిలో జరుగుతున్నా పెద్దగా అమలులో లేదు || దీనిని ఇంకా క్రియాశీలకంగా చేయాల్సిన అవసరం ఉంది.
|-
| సమాచార బట్వాడా జట్టు || లేదు || ప్రత్యేకించి లేనప్పటికీ కొందరు సభ్యులు పాఠ్యీకరణ, ఫేస్బుక్ ద్వారా, బ్లాగుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలలో తెవికీ మీడియా కవరేజి పెరిగింది. || ఇంకా మెరుగు పరచుకోవాలి.
|-
| ఫేస్బుక్ వాడకం || పేజీ అంతగా రాణించలేదు || ఫేస్బుక్ పేజీ, సమూహం రెండూ సమర్ధవంతంగా సభ్యుల ద్వారా నడపబడి మంచి పురోగతిని సాధించాయి. కొత్త సభ్యులను వికీకి అందించడంలో దోహద పడ్డాయి || మరింత ప్రభావవంతంగా వాడవచ్చు
|-
| రాష్ట్రస్థాయి సమావేశాలు || జరగలేదు || 3 రాష్ట్ర స్థాయిని మించిన సమావేశాలు || సమావేశాల ప్రభావాన్ని బేరీజు వేస్తూ ఇంకా మెరుగ్గా చేయాలి.
|}
* పవన్ గారు ఇక మీరడిగిన కొన్ని విషయాలకు అదేక్రమంలో క్రింద వివరణలు చూడండి.
** అన్నమయ్య గ్రంధాలయానికి విశ్వనాధ్ గారితో ఏ.2.కె ఉద్యోగులు విజయవాడనుండి కలిసి వెళ్ళింది అక్కడ ఓ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని విశ్వనాధ్ గారు వివరిస్తారనుకున్నాను. బహుశా వారికి వీలుకాకపోవచ్చు. అంతే కాకుండా ఈ కార్యక్రమం జరగటానికి చాల నెలల క్రితం నుండే అన్నమయ్య గ్రంధాలయ కార్యనిర్వాహక వర్గం సభ్యులు ఏ.2.కె ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైగా వారిలో ఒకరు బెంగళూరు వచ్చి దాదాపు ఐదు రోజులు సీ.ఐ.ఎస్-ఏ.2.కె.లో గడిపారు. ఇక వారు యూనీకోడీకరించిన గ్రంధాలయ పుస్తక జాబితా ఏ.2.కె ఉద్యోగుల అభ్యర్ధనమేరకు విశ్వనధ్ గారి ద్వారా తెవికీకి అందించారు. మునుముందు అక్కడ తెవికీ శిక్షణా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా గుంటూరులో తెవికీకి ఒక స్వచ్ఛంద శిక్షణ కేంద్రంగా చేయడానికి ఇతర వనరుల ద్వారా ఒక లాబ్ ఏర్పాటు చేయడానికి ఏ.2.కె ఇప్పటికే ప్రయత్నిస్తోంది. మీరు కూడా ఈ గ్రంధాలయాన్ని సూచించడం ముదావహం.
** ట్రయిన్-ద-టెయినర్ కార్యక్రమంలో సుజాత గారు ఇతర తెవికీపీడియనులతో చర్చలమేరకు ప్రణాళికలో ఈ ప్రాజెక్టు చేర్చడం. మీరన్నట్టుగా దీనిపై ఇంకా స్పష్టత తీసుకురావలసిన అవసరం ఉన్నది. ప్రతిపాదన మెరుగుకై సూచనలు సలహాలు ఇవ్వండి.
** తెవికీ సముదాయం పుష్కరోత్సవాలను జరుపూకోడానికి కృషి చేసే ప్రయత్నంలో, గతంలో ఉగాది పుష్కరోత్సవాలకు, దశాబ్దికి, పదకొండవ వార్షికొత్సవాలకు ఇచ్చిన సహకారం లాగానే సముదాయం అభ్యర్ధించినమేరకు ఏ.2.కె సహాయ సహకారాలని అందిస్తుంది. పదకొండవ వార్షికొత్సవాలకు ఇచ్చిన సహాకారంలో లోటుపాట్లు సరిచేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దానిని పరిగణనలోనికి తీసుకుని ముందుకు పోదాం.
** అలాగే తప్పకుండా. మీ సూచనమేరకు ఇంకా మెరుగు పరచుకుందాం.
** హైదరాబాదులో మాసిక వికీ మీటప్ లు మొదలవటానికి సముదాయ సభ్యులకు 2013 లో ఏ.2.కె సహాయ సహకారాలని అందించింది. కొత్తలో ఏ.2.కె ఉద్యోగులు చాలా సమావేశాలకి వెళ్ళినా ఇది సముదాయ సభ్యులైన రాజశేఖర, ప్రణయ్ గార్ల ఆధ్వర్యంలో ముందుకు వెళుతుంది. ఏ.2.కె అవసరమున్నంతలో సహాయ సహకారాలు అందిస్తుంది. ఉదాహరణకు, తెవికీ సమావేశాలకు హాజరయ్యే సభులకు ఉపయుక్తంగా ఉంటుందని యూనివర్సిటీ ద్వారా వై.ఫై. సౌకర్యం ఏర్పరచబడింది. ఇక పోతే ఈ సంవత్సరం మిగతా చిన్న నగారాలు పట్టణాలలో తెవికీ సమూహాల ప్రక్రియ చేపట్టి క్రియాశీలంగా జరిగేటట్లు ఏ.2.కె ఉద్యోగులు సహకారాన్ని అందిస్తారు.
** అక్కడ తెలిపిన శిక్షణ తెవికీ సభ్యులం మనలో మనకి ఒకరికొకరం ఇచ్చుకునేది. ఒక సమూహంలో శిక్షణకు, వ్యక్తిగతంగా స్కైపులో శిక్షణకు చాలా తేడా ఉంది. సమూహానికి శిక్షణ ఇచ్చేప్పుడు సభ్యులలో అతి మేధావులూ ఉంటారు, చర్చ జరుగుతున్న విషయానికి సంబంధించిన ఎలాంటి జ్ఞానం లేని వ్యక్తులూ ఉంటారు. అటు అజ్ఞానికీ ఇటు మహాజ్ఞానికీ కాకుండా మధ్యస్థంగా ఏదయినా నేర్పవలసి ఉంటుంది. ఇది లోకవిదితమే. అలాంటి శిక్షణలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లాభం-జ్ఞానం చేకూరుతుంది. ఎంతో కొంత వెలితి-సమయం వృథా అయింది అన్న అనుభవం మేధావులకూ మిగులుతుంది. అయితే ముఖా ముఖీ ఒక్కొక్కరితో శిక్షణ జరిగేప్పుడు అది ఎల్లపుడూ ఎదుటి వ్యక్తి స్థాయిలోనే జరుగుతుంది, అందువలన ఎక్కువ ఫలప్రదమవుతుంది, ఎదుటి వ్యక్తి మేధావైనా అజ్ఞానైనా. ఇంకొక విషయం ఒక కార్యక్రమం ద్వారా మీకు లబ్ది చేకూరనంతమాత్రాన మిగతా వికీపీడియనులకి అది ఉపకరించలేదనుకోలేము. ఇక ఈ సమస్యకు పరిష్కారం, సమూహ సభ్యులు తామంతట తాముగా వచ్చి [[meta:Talk:India_Access_To_Knowledge/Requests|అభ్యర్థన]] చేసే వరకూ ఏ.2.కె ఉద్యోగి ప్రమేయం ఉండబోదు. సమూహం నుండి అభ్యర్థన వచ్చే వరకూ ఏ.2.కె. ఉద్యోగులు శిక్షణలు చేపట్టలేదు, చేపట్టరు.
** ఇక తెలుగు సాహిత్యం సమగ్రంగా ఒకే వేదిక మీద ఇప్పటి వరకూ తెచ్చే ప్రయత్నం అంతర్జాలంలో లేదా బయటా జరగలేదన్న విషయం వాస్తవమే. తెవికీలో వ్యాసాలుగా ఎంత సమగ్రంగా ఉన్నా ఒక వేదిక గా లేవు. అదే ఆ వాక్యం భావం. ఒక వేదికగా తెలుగు సాహిత్యాన్ని తెవికీలో అభివృద్ధి చెయ్యాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. తద్వారా ఒకరో ఇద్దరో కాకుండా సముదాయ సమిష్టి కృషి అందులో పనికొస్తుంది. ఇది అలాంటి ప్రయత్నానికి తొలి అడుగు. ఇక సోషల్ మీడియా గ్రూపును ఏ.2.కె మొదలు పెట్టినా ముందుకు తీసుకుపోతోంది మన తెవికీ సముదాయ సభ్యులే.
** తప్పకుండా ప్రయత్నిద్దాం.
** అలాగే :)
--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 07:31, 17 ఏప్రిల్ 2015 (UTC)
 
== ప్రణాళికపై నా వ్యాఖ్యలు ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".