వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
** అలాగే తప్పకుండా. మీ సూచనమేరకు ఇంకా మెరుగు పరచుకుందాం.
** హైదరాబాదులో మాసిక వికీ మీటప్ లు మొదలవటానికి సముదాయ సభ్యులకు 2013 లో ఏ.2.కె సహాయ సహకారాలని అందించింది. కొత్తలో ఏ.2.కె ఉద్యోగులు చాలా సమావేశాలకి వెళ్ళినా ఇది సముదాయ సభ్యులైన రాజశేఖర, ప్రణయ్ గార్ల ఆధ్వర్యంలో ముందుకు వెళుతుంది. ఏ.2.కె అవసరమున్నంతలో సహాయ సహకారాలు అందిస్తుంది. ఉదాహరణకు, తెవికీ సమావేశాలకు హాజరయ్యే సభులకు ఉపయుక్తంగా ఉంటుందని యూనివర్సిటీ ద్వారా వై.ఫై. సౌకర్యం ఏర్పరచబడింది. ఇక పోతే ఈ సంవత్సరం మిగతా చిన్న నగారాలు పట్టణాలలో తెవికీ సమూహాల ప్రక్రియ చేపట్టి క్రియాశీలంగా జరిగేటట్లు ఏ.2.కె ఉద్యోగులు సహకారాన్ని అందిస్తారు.
** అక్కడ తెలిపిన శిక్షణ తెవికీ సభ్యులం మనలో మనకి ఒకరికొకరం ఇచ్చుకునేది. ఒక సమూహంలో శిక్షణకు, వ్యక్తిగతంగా స్కైపులో శిక్షణకు చాలా తేడా ఉంది. సమూహానికి శిక్షణ ఇచ్చేప్పుడు సభ్యులలో అతి మేధావులూ ఉంటారు, చర్చ జరుగుతున్న విషయానికి సంబంధించిన ఎలాంటి జ్ఞానం లేని వ్యక్తులూ ఉంటారు. అటు అజ్ఞానికీ ఇటు మహాజ్ఞానికీ కాకుండా మధ్యస్థంగా ఏదయినా నేర్పవలసి ఉంటుంది. ఇది లోకవిదితమే. అలాంటి శిక్షణలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లాభం-జ్ఞానం చేకూరుతుంది. ఎంతో కొంత వెలితి-సమయం వృథా అయింది అన్న అనుభవం మేధావులకూ మిగులుతుంది. అయితే ముఖా ముఖీ ఒక్కొక్కరితో శిక్షణ జరిగేప్పుడు అది ఎల్లపుడూ ఎదుటి వ్యక్తి స్థాయిలోనే జరుగుతుంది, అందువలన ఎక్కువ ఫలప్రదమవుతుంది, ఎదుటి వ్యక్తి మేధావైనా అజ్ఞానైనా. ఇంకొక విషయం ఒక కార్యక్రమం ద్వారా మీకు లబ్ది చేకూరనంతమాత్రాన మిగతా వికీపీడియనులకి అది ఉపకరించలేదనుకోలేము. ఇక ఈ సమస్యకు పరిష్కారం, సమూహ సభ్యులు తామంతట తాముగా వచ్చి [[meta:Talk:India_Access_To_Knowledge/Requests|అభ్యర్థన]] చేసే వరకూ ఏ.2.కె ఉద్యోగి ప్రమేయం ఉండబోదు. సమూహం నుండి అభ్యర్థన వచ్చే వరకూ ఏ.2.కె. ఉద్యోగులు శిక్షణలు చేపట్టలేదు, చేపట్టరు. వికీడేటాకు సంబందించిన కార్యక్రమం వీవెన్ గారి సూచనమేరకే ప్రణాళికలో చేర్చడం జరిగింది. వారే దీనికి సారధ్యం వహిస్తానన్నారు.
** ఇక తెలుగు సాహిత్యం సమగ్రంగా ఒకే వేదిక మీద ఇప్పటి వరకూ తెచ్చే ప్రయత్నం అంతర్జాలంలో లేదా బయటా జరగలేదన్న విషయం వాస్తవమే. తెవికీలో వ్యాసాలుగా ఎంత సమగ్రంగా ఉన్నా ఒక వేదిక గా లేవు. అదే ఆ వాక్యం భావం. ఒక వేదికగా తెలుగు సాహిత్యాన్ని తెవికీలో అభివృద్ధి చెయ్యాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. తద్వారా ఒకరో ఇద్దరో కాకుండా సముదాయ సమిష్టి కృషి అందులో పనికొస్తుంది. ఇది అలాంటి ప్రయత్నానికి తొలి అడుగు. ఇక సోషల్ మీడియా గ్రూపును ఏ.2.కె మొదలు పెట్టినా ముందుకు తీసుకుపోతోంది మన తెవికీ సముదాయ సభ్యులే.
** తప్పకుండా ప్రయత్నిద్దాం.
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".