ఆదాయం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ' == ఆదాయము == ఈ వ్యాసం ప్రధమంగా ఆదాయాన్ని...'
(తేడా లేదు)

10:13, 17 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

 == ఆదాయము ==

ఈ వ్యాసం ప్రధమంగా ఆదాయాన్ని సూత్రీకరించడానికి లేదా కొన్ని ప్రమాణీకలను అనుసరించి సిద్దాంత పరంగా నిర్వచించడానికి ఉద్దేశించబడింది . ఒక నిర్దిష్ఠ కాల పరిమితిలో ఒక పరిధి (అంటే వ్యక్తి / వ్యవస్థ /సంస్థ ) చేసే వ్యయము & పొదుపు యొక్క నిరంతర పక్రియ పేరు ఆదాయము . సహజంగా అది డబ్బు రూపేణ వ్యక్తీకరించబడుతుంది . గృహస్తులకు లేక వ్యక్తిగత వ్యక్తులకు పైన పేర్కొన్న నిర్వచనములో కొంచం మార్పు అవసరము. వారికి ఆదాయము అనగా  : ఒక నిర్దిష్ట కాల పరిమితి లో ( సామాన్యంగా ఒక నెల సంవత్సరము ) వారి వేతనాల , జీతాల , లాభాల(వ్యాపారవేత్తలకు), వడ్డీ ద్వారా ఆదాయము బాడుగలు ఇంకా ఏదిని రూపేణ వారికి లభించు మొత్తం రాబడి . ప్రజా ఆర్ధిక వ్యవస్థలో , కూడబెట్టబడ్డ లేక అభివృద్ధి చెందిన ద్రవ్య లేక ఆద్రవ్య ఖర్చు సామర్థ్యము ఆదాయము అనెడి భావనను సూచిస్తుంది, మొత్తంగా చూసినట్లైతే ద్రవ్య ఖర్చు సామర్థ్యము మాత్రమే మొత్తం రాబడికి కొలమానంగా లేక సూచక చిహ్ననంగా వాడడము ఆనవాయతి .

ఆదాయములో హెచ్చుదల :

దాదాపుగా అన్నీ దేశాల్లో తలసరి ఆదాయము స్థిరంగా పెరుగుతుంధి . విద్య యొక్క ప్రపంచీకరణ తో వెసులుపడే ఆధిక రాబడి , ఆర్ధిక స్వాతంత్రము, శాంతి వంటి అనుకూల లేక ఉపయుక్తమైన రాజీకియా పరిస్థితులే తలసరి ఆదాయములో పెరుగుదలకు ఆనేక పరిణామ కారణాలుగా మనం చెప్పవచ్చు . ఆదాయములో పెరుగదల వల్ల ప్రజలు తక్కువ పనిగంటలు ఎంచుకొనుటకు దారితీస్తుంది అభివృద్ధి చెందిన దేశాలలో (ఏవైతే ఆర్ధికాభివృద్ధి కల్గిన దేశాలని నిర్వచించబడుతున్నావో )   అధిక రాబడులు వుంటాయి. దీనికి పూర్తి వ్యతిరేఖంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ రాబడులు వుంటాయి

ఆర్ధిక నిర్వచనాలు :

ఆర్ధ శాస్త్రములో ఆదాయము అంటే ఉత్పత్తికి కారణమైనందున ఒక వ్యక్తికి లేక ఒక దేశానికి లభించే మొత్తం రాబడి . అనగా అద్దె ఆదాయము , కార్మికులు ఉత్పత్తి చేసే వేతనాలు. పెట్టుబడి సృష్టించిన ఆదాయము, వ్యవస్థాపక వ్యాపారా వేత్తలు లేక వ్యాపారాలు ఆర్జించిన లాభాలు , కార్మిక సేవల ద్వారా , భూమి మరియు పెట్టుబడి పైన యాజమాన్యము ద్వారా లభించే ఆదాయములు అన్న మాట . వినియోగదారు సిద్దాంతములో ఆయవ్యయపట్టిక కడ్డాయముకు మరో పేరు ఆదాయము.A &B అనే వస్తువులును x &y అనే పరిమాణాలలో Px & Py అనే ధరలకు విక్రయించడానికి కావల్సిన మొత్తం సొమ్ము Y . అప్పుడు ప్రాథమిక సమీకరణం


           ఆదాయం వృద్ధి అసమానత , ధనికులు మరింత ధనికులగా మారుట

ఈ సమీకరణ రెండు అంశాలను సూచిస్తుంది . మొదటిది A యొక్క ఒక పరిమాణ ఆధిక కొనుగోలు, B యొక్క Px/Py అను పరిమానముల తక్కువ కొనుగోలును సూచిస్తుంది.కావున Px/Py అనేది A యొక్క ఒక పరిమాణ పెరుగుదలకు B త్యాగము చేయవలసిన పరిమానాల సంఖ్యకు ఆధారమైన సంబంధిత ధర. ఒక వేల స్థిరమైన Y కి A యొక్క ధర తగ్గితే సంబంధిత ధర కూడా పతనము చూస్తుంది.సాధారణ పరికల్పన ప్రకారము A యొక్క తక్కువ ధర దాని గిరాకీని పెంచుతుంది.ఇదే గిరాకీ యొక్క సూత్రము/సాధారణీకరణ. రెండు సరుకుల కంటే ఎక్కువ వాటికి చేసిన ఈ సాధారణీకరణ "B" ను మిశ్రమ వస్తువు గా చిత్రీకరించింది. ఒకటి అంత కంటే ఎక్కువ కాలం పరిమితికి అనువర్తించు ఈ సైద్ధాంతిక సాధారణీకరణ ఒకబహుళ కాలపు ఆదాయమును & ఆదాయ కడ్డాయమునకు సూచిక . ఉదాహరణకు ఒక వ్యక్తి ఆధిక రాబడి ఆర్జించడానికి అతను మరిన్ని ఉత్పాదక నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఆస్తులు కొనుగులుకు తన ఆదాయ సంపాదనను ఫలవంతమైనదిగా మార్చుకోవచ్చు.బహుళ కాల ఆదాయ సందర్భంలో , ఆదాయ , ప్రవాహాన్ని తగ్గించేందుకు ( లేదా పెంచడానికి ) వ్యక్తిగత నియంత్రణను దాటి ఏదో వ్యవస్థ సంభవిస్తుంది. కొలిచిన ఆదాయాన్ని (డాక్యుమెంటేషన్ ఆదాయం) మరియు వినియోగంతో దాని సంబంధాన్ని కాలక్రమేణా మార్చడం శాశ్వత ఆదాయం పరికల్పనకు , తదనుగుణంగా రూపకల్పన జరిగింది. .



.

   ==== హైగ్ సిమన్స ఆదాయము: ====

పూర్తి ఆదాయము అనునది ఒక వ్యక్తి లేదా గృహస్థుని క్రోడీకరించిన ద్రవ్య మరియు ఆద్రవ్య కొనుగోలు సామర్థ్యమును సూచిస్తుంది . ఆర్థికవేత్త నికోలస్ బార్ అత్యుత్తమ స్థాయి గల నిర్వచనాన్ని 1938 లో హైగ్ సీమన్స్సూత్రీకరించారు. ఆదాయాన్ని రెండు రకాలుగా నిర్వచించవచ్చు.1) వినియోగములో ఉపయోగించబడ్డ హక్కుల మార్కెట్ విలువ యొక్క మొత్తమును ఆదాయముగా పరిగణించవచ్చు. 2) నిల్వవుంచుకున్న లేక సంపాదించిన ఆస్తి హక్కుల విలువలో మార్పును కూడా మనము ఆదాయంగా పరిగణించవచ్చు. విశ్రాంతి లాంటి ఆద్రవ్య వస్తువుల వినియోగ సామర్థ్యం కొలవలేము కాబట్టి ద్రవ్య ఖర్చు సామర్థ్యము మాత్రమే మొత్తం రాబడికి కొలమానంగా లేక సూచక చిహ్ననంగా వాడడము ఆనవాయతి . కానీ దాని అవిశ్వసనీయత కారణంగా అది విమర్శలు ఎదుర్కొంటున్నది. ఏదేని కర్త/ప్రతినిధి యొక్క వినియోగ అవకాశాలాను ఖచ్చితత్వంతో ప్రతిబింబించడంలో అది విఫలమైంది . అది ఒక వ్యక్తి యొక్క అద్రవ్య ఆదాయమును మొత్తంగా తృణీకరిస్తుంది అంతే కాక స్థూల ఆర్థిక వ్యవస్థలో సామాజిక సంక్షేమము వైపు వకాల్తా అందుకోవడములో అది విఫలమైంది. " బార్" ప్రకారము " ఆచరణలో డబ్బు ఆదాయము మొత్తం ఆదాయము యొక్క నిష్పత్తి రూపేణ వుంటుంది . అది విస్తృతంగా మరియు ప్రామాణిక ప్రక్రియకు వ్యతిరేకంగా మారుతుంది . పూర్తి ఆదాయము యొక్క వనరులను విస్మరించడము వల్ల ఒక వ్యక్తి కి వున్న అవకాశాల సమూహముపై పూర్తి స్థాయిలో నివేదన అవరోధంగా వున్నది . అంటే(తె)? కాకుండా డబ్బు-ఆదాయము యొక్క ఆసంభద్దమైన కొలబద్ద అయిన ఈ వ్యవస్థను బలవంతంగా ఉపయోగించవలసి రావడము పెద్ద వైఫల్యం. స్థూల ఆర్థిక స్థాయిలో వినియోగ కార్యకలాపాల వల్ల పెరుగుతున్నట్లు కనిపించే జాతీయ తలసరి ఆదాయం ఎన్నో సామాజిక ఆరోగ్య అంశాల విస్మరణ వల్ల కలుగు ఆ పెరుగుదల సమాజహితమునకు అతి పెద్ద హాని.

 === ఆదాయ అసమానత === 

ఆదాయ అసమానత అనునది అసంబద్దమైన రీతిలో పంపిణీ చేయబడ్డ ఆదాయ క్రమమును సూచిస్తుంది. సమాజములో ఆదాయమును లోరెంజ్ వక్రరేఖ మరియు గిని గుణకం వంటి అనేక పద్దతులలో గుణించవచ్చు. ఆర్ధికవేత్తలు కూడా సామాన్యంగా సాధారణ రీతిలో వున్న ఆర్ధిక అసమానతలను అంగీకరిచడమే కాకుండా వాటి ఆవ్యశాకతను ప్రభలంగా నమ్ముతున్నారు కానీ అధిక స్తాయిలో వున్న ఆర్ధిక అసమానతలు ఉత్పాదక సమస్యలకు మరియు సామాజిక అన్యాయముకు దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తుల , సంస్థల , మరియు ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయాన్ని నెట్ నేషనల్ ఇన్ కమ్(NNI) వంటి గణాంకాల ద్వారా కొలుస్తారు . దీని సహాయముతో జాతీయ ఆదాయమును కూడా లెక్కిస్తారు .

  === తత్వము , నైతికత  -  ఆదాయము === 

ఎంతో మంది చరిత్రకారులు నైతికత మరియు సమాజం పై ఆదాయం యొక్క ప్రభావం గురించి చాలా విపులంగా వ్రాసారు. బైబిల్ గ్రంధములో ఆపోస్టులుడైన పౌలు " ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ....." ( 1 తిమోతి 6:10) అని రాస్తూ జీవిత సారమును చక్కగా వివరించాడు. కొందరు పండితులు ఉత్పాదక పురోగతి మరియు సిరి సంపదలు వ్యక్తిగత మరియు జాతీయ స్థాయిలో నిరంతర ఆదాయ వృద్ధికి సంకేతాలు అని నిర్ధారణకు వచ్చారు. ఈ భావన ఏదిని నైతికతను (అంటే అసలు నైతికతకు ప్రాముఖ్యము చాలా అల్పము ) అనివార్యము చేస్తున్నది . ఈ వాదనను తన" థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్స్" అను పుస్తక రచనలో చాలా స్పష్టంగా ఆడం స్మిత్ నొక్కి వక్కాణించారు. ఇటీవల కాలములో ఈ భావనను హార్వర్డ్ ఆర్ధికవేత్త అయిన బెంజమిన్ ఫ్రైడ్మాన్ తన పుస్తకమైన "ది మోరల్ కాన్సిక్వాన్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ " లో చాలా విపులంగా అభివృద్ధి చేశారు.

                                             గణకశాస్త్రము 

అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు ( IASB ) క్రింది నిర్వచనం ఉపయోగిస్తుంది . " ఆదాయము అనునది ఒక నిర్దిష్ఠ కాలములో ( ఆర్ధిక సంవత్సరము లాగా ) ధన ప్రవాహ రూపంలో , ఆస్తుల విస్తరణ ద్వారా,ఈక్విటీలో పాల్గొనే ఔత్సాహికుల ప్రోద్బలము కాకుండా ఈక్విటీ పెరుగుదల ఫలితంగా తగ్గు బాధ్యతల వల్ల , కలుగు ఆర్థిక ప్రయోజనాల పెరుగుదల. "

"https://te.wikipedia.org/w/index.php?title=ఆదాయం&oldid=1486127" నుండి వెలికితీశారు