వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
::* "సమావేశాలలో కలిసిన సభ్యుల వ్యక్తిగత లక్ష్యాలకి తోడ్పాటు అవసరమున్నా లేకపోయినా ప్రధానంగా చేసుకోవడం సరియైన పద్ధతి కాదు."అన్న వ్యాఖ్యని మరింత వివరంగా తెలియచేసిన [[#ప్రతిపాదనల స్పష్టత కావాలి. పూర్వానుభవాల పాఠాలు వాడాలి|పవన్ వ్యాఖ్యలకు]] ఇంతవరకు స్పందనకూడా లేదు. అయినా గతసంవత్సరాల ప్రణాళికలు అమలుగురించి కొన్ని వ్యాఖ్యలు వేరే విభాగాలలో చేరుస్తాను. వాటి గురించి ఆలోచించండి.
::*సంవత్సరాంత విశ్లేషణ వివరాలే సరిగా లేనప్పుడు, ప్రతిమూడు నెలలకు ప్రగతిని విశ్లేషించమని కోరడం వింతగా వుంది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:59, 16 ఏప్రిల్ 2015 (UTC)
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారు కొన్ని వివరణలు మీరడిగిన క్రమంలో పొందుపరుస్తున్నాను
:::* ప్రణాళికా చర్చలలో తెవికీ సభ్యులు మిగతా వికీమీడియా సముదాయాలతో పోల్చితే చురుకుగానే పాల్గొంటున్నారని నా అభిప్రాయం. ఇది గత రెండు సంవత్సరాలలో నేను చూసినంతలో మెరుగవుతూనే ఉంది. వార్షికోత్సవాల చర్చల ఆధారంగా ఈ ముసాయిదా ప్రణాళికలోకి కార్యక్రమాలు చేర్చడం జరిగింది.ఆ సమావేశానికి హాజరైన సభ్యులందరూ దాదాపు చర్చలలో పాల్గొన్నారు. ఇక పోతే ఇక్కడ ఆన్-వికీ చర్చలో పాల్గొనలేకపోవటానికి బహుశా ఈ కారణాలనుకుంటున్నాను. సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలోకి వెళ్ళి విశ్లేషణ చేసే సమయం వెచ్చించలేకపోవచ్చు, ఇతరత్రా సూచనలు లేకపోవచ్చు, ఉత్సుకత లేకపోవచ్చు, ప్రణాళికలపై ఆసక్తి తక్కువ కావచ్చు, ప్రణాళిక ఫరవాలేదని ఉండవచ్చు, వారికి ఈ చర్చలు ప్రాముఖ్యం కాకపోవచ్చు. ఇవి కేవలం తెవికీకే కాదు ప్రతీ వికీ సముదాయినికి వర్తిస్థాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఆంగ్ల వికీపీడియనులు ఉన్నారు వారిలో 30 వేలకు పైనే, కాని proportionate గా చూస్తే చాలా తక్కువమంది పాలసీ చర్చలలో, గ్రాంటు చర్చలలో, ప్రణాళికా చర్చలలో పాల్గొంటున్నారు.
:::* ఈ వ్యాఖ్యకు తగు నేపధ్యం మీరివ్వలేదు. అలానే గణాంకాల విషయంలో మీరు చెప్పిన విషయాలు, సూచనలు చేసినట్టు చేసిన విషయాలు, ఆచరణా పరంగా ఏం చేస్తే బావుంటుందన్న విషయాలు స్పష్టంగా లేవు. ఇది బాగా లేదు అంటున్నారే తప్ప, ఏది బాగాలేదు, దానిని ఎలా మెరుగుపరచాలి, అందుకు సమూహం నేపధ్యం ఏమిటి, సీ.ఐ.ఎస్-ఏ.2.కే ఏం చేయగలదు అన్న విషయాలలో స్పష్టత ఇస్తే మనం తప్పకుండా వాటి అమలుకు ప్రయత్నించవచ్చు.
:::* సమగ్ర పేజి మొదలు పెట్టినందులకు ధన్యవాదాలు. ఏ.2.కె సంబంధిత కార్యకలాపాలన్నీ మెటాలో నిక్షిప్తం చేస్తూనే ఉన్నాం. మెటాలో [[:meta:India_Access_To_Knowledge|ఏ.2.కె]] పేజికి వెళ్లగానే అన్ని ముఖ్యమైన పేజీలకు గాను లంకెలు కనపడతాయి. గత సంవత్సరంలో ఏ.2.కె కార్యకలాపాలకు సంబందించి మేటాలో డాక్యుమెంటేషను గణనీయంగా విస్తృతించడం జరిగింది. ఏ.2.కె. కార్యకలాపాలకు సంబందించి ముఖ్యంగా ఈ [[:meta:India_Access_To_Knowledge/Reports|రిపోర్టు పేజి]], [[:meta:India_Access_To_Knowledge/Events|ఈవెంట్స్ పేజి]], [[:meta:India_Access_To_Knowledge/Requests|రిక్వెస్ట్ పేజి]] లు చూడండి. వీటి మెరుగుకై సూచనలు తెలియజేయగలరు. తెలుగుకి సంబందించిన కార్యకలాపాలు తెవికీలో పెట్టటానికి కృషి చేస్తూనే ఉన్నాం. కాకపోతే మెటాలో ఉన్నంత సమగ్రంగా తెలుగులో ఏ.2.కె సమాచారం పొందుపరచడం జరగలేదు.
:::* ఆ వ్యాఖ్యలో ఏ.2.కె ఉద్యోగులపై తెలిపిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది.అంతర్గతంగా చర్చ చేయడం జరిగింది, ఆ పాఠాలనుండి మెరుగు చేసుకోవడానికి ఏ.2.కె ఉద్యోగులు కృషి చేస్తారు.
:::* తెవికీ లో సముదాయ నిర్ణయం ప్రకారం గ్రామ్య వ్యాసాలు మొలకల కింద లెక్కచెయ్యకూడదని చర్చ జరిగిన విషయం మీకు తెలిసిందే. ఇక వాసి పరంగా మొలకల శాతం తగ్గించడానికి ప్రస్తుతం వాడుతున్న నెలవారీ ఎవరి మొలకల బాధ్యత వారిది అన్న కృషి మిశ్రమ ఫలితాలనిచ్చింది. దానిని ఇంకా మెరుగు పరచుకోవాలి. అలాగే ఎ.2.కె నిర్వహించిన శిక్షణా శిబిరాలలో కొత్తవాడుకరులకు నాణ్యతపై ఎక్కువ అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేసాం.ఒక మోడల్ వ్యాసంలో ఉండాల్సిన నిడివి, కనీసం రెండు మూలాలు, దస్త్రాలు ఉంచడం, పరిశోధన-రిసోర్సెస్ ఆవశ్యకత ఇవన్నీ కూడా ఎ.2.కె ఇచ్చే శిక్షణలో కొత్త వాడుకరులకు తెలియజేయటం జరుగుతుంది. అలాగే తెవికీ లో వున్న భౌతిక శాస్త్రం, సాంఖ్యాశాస్త్రము, వృక్ష శాస్త్రాలలో ఉన్న వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే విధంగా ఆంధ్రా లయోలా కళాశాల విద్యార్థులతో ఒక స్టడీని రూపొందించాము. వాటి ఫలితాలను త్వరలోనె తెవికీలో ఉంచి వాటి నాణ్యతను పెంచే దిశగా పనిచేయడానికి అందిరి సూచనలతో ముందుకు వెళ్దాం. ఇక గ్రామ వ్యాసాల నాణ్యతాపరమైన అభివృద్ధికి కూడా ప్రభుత్వం వారి వద్దనున్న డేటా ద్వారా నాణ్యతా పరంగా అభివృద్ధికి ఈ ప్రణాళిక కృషిచేస్తుంది. మరిన్ని సూచనలు ఉంటే ఇవ్వగలరు.
:::* లేదండీ, అలా దాటవేయలనే విధంగా ఏ.2.కె ఎప్పుడూ పని చేయలేదు. It's not our work ethics. Please assume good faith that everyone in the A2K team has a serious and committed intent to serve and contribute to the Wikimedia movement. Just because we are paid professionals you cannot question our work ethics. పైన మీరిచ్చిన ఇచ్చిన మూడు సూచనలకు దయచేసి ఆచరణాత్మకంగా ఏం చేయాలో తెలుపగలరు. ఈ విధంగా ఒక కార్యక్రమం/ప్రాజెక్టు చేపడదాం, దానికి ఇలా పని చేద్దాం, సముదాయ సభ్యులు ఎలాంటి కృషి చేయాలి, ఏ.2.కె నుండి ఎలాంటి సహకారం కావాలి, ఇతర అవసరాలు ఉంటే వాటిని ఎలా చేపట్టాలి అని స్పష్టంగా తెలియజేస్తే, వాటిని ప్రణాళికలో చేర్చవచ్చు.
:::* క్రింద పవన్ వ్యాఖ్యలకు విపులంగా వివరణ ఇవ్వడం జరిగింది.
:::* క్రింద పవన్ కి ఇచ్చిన వివరణలో దీనిపై స్పందించడం జరిగింది. ఇప్పుడిచ్చిన విశ్లేషణ వివరాలు ఏ విధంగా సరిగా లేవో తెలుపగలరు. ఫలానా వివరాలు లేవు, ఫలానా వివరాలు తప్పుగా ఉన్నాయి అని తెలియపరిస్తే స్పష్టత వస్తుంది.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 07:28, 18 ఏప్రిల్ 2015 (UTC)
 
== ప్రతిపాదనల స్పష్టత కావాలి. పూర్వానుభవాల పాఠాలు వాడాలి ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".