"సాక్షి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
=== చిత్రీకరణ ===
పులిదిండి గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు తీసిన తొలి చిత్రం [[సాక్షి (సినిమా)|సాక్షి]] చిత్రీకరణ సాగింది. బాపురమణల మిత్రులు రామచంద్రరాజు స్వగ్రామం పులిదిండి కావడం సినిమా షూటింగ్ కోసం గ్రామాన్ని ఎంపికచేసుకోవడానికి గల కారణాల్లో ఒకటి. సినిమాకు అవసరమైన కొన్ని సెట్లు ప్రముఖ రచయిత, బాపురమణల మిత్రులు [[బి.వి.ఎస్.రామారావు]] వేశారు. ఈ సెట్ ఎంత సహజంగా కుదిరేలా ప్రయత్నించారంటే సినిమాలో కథానాయకుడి గుడిసె సెట్ వేసినప్పుడు, దాన్ని పాతబడిన ఇల్లుగా చూపేందుకు గ్రామంలోని పాతబడిపోయిన పాడైన గుమ్మం ఆ ఇంటివారిని అడిగి తీసుకుని వినియోగించారు. అలానే ఆ గుమ్మాన్నిచ్చిన వారికి కొత్త గుమ్మాన్ని ఏర్పాటుచేశారు. ఈ సినిమా చిత్రీకరించేందుకు ముందు బాపుకు సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవమేదీ లేదు. కేవలం సినిమా విద్యార్థిగా, ఔత్సాహికునిగా ప్రారంభమై ఎవరి వద్దా అసిస్టెంటుగా పనిచేయకుండానే సినిమాల్లో అడుగుపెట్టారు.<ref name="మా సినిమాలు-బాపు">{{cite web|first1=బాపు|title=మా సినిమాలు|url=http://navatarangam.com/2014/02/our-films-bapu-1/|website=నవతరంగం|accessdate=18 April 2015}}</ref>
 
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1487118" నుండి వెలికితీశారు