కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
 
== నేపధ్యగాయకుడుగా ==
సంగీత దర్శకుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, అనువాద కళాకారుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు శ్రీ. 'చక్రం' సినిమాలో 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది' అనే గీతాన్ని, 'అనగనగా ఒక రోజు', 'గాయం', 'అమ్మోరు', 'సింధూరం' తదితర చిత్రాల్లోనూ పాటలు ఆలపించారు. సంగీత దర్శకుడిగా శ్రీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ చిత్రంలోనూ ఒక్క పాటైనా ప్రాచుర్యం పొందేది. శ్రోతలు పదేపదే పాడుకునేలా ఆ పాటలు ఉంటాయి. 'అనగనగా ఒక రోజు' చిత్రలో 'మా ఫ్రెండు చెల్లెల్ని కొందరు ఏడిపించారు..' అనే పాట శ్రీ శైలిని చాటి చెబుతుంది. మామూలు మాటల్ని సైతం పాటగా ఎలా చేయొచ్చో ఆ పాటతో చూపించారు శ్రీ.
 
== అనువాద కళాకారుడిగా ==