ఇర్బియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఇర్బియం ఒక రసాయనిక [[మూలకం]]. మూలకాల [[ఆవర్తన పట్టిక]] లో ల్యాంథనాయిడుల శ్రేణికి చెందిన,f బ్లాకు కు చెందిన ,6 వపిరియడ్‌కు చెందిన మూలకం. ప్రకృతిలో ఈ మూలకం సాధారణంగా ఇతర మూలకాల[[ఖనిజాలు| ఖనిజాల]] లతో కలిసి భూమిలో లభిస్తుంది.
==చరిత్ర==
ఇర్బియం ను మొదట 1843 లో కార్ల్ గుస్తఫ్ మోసండర్ (Carl Gustaf Mosander)అను స్వేడన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు.గాడో లినైట్ (gadolinite) అనే ఖనిజం నుండి ఇర్బిడియంను మూడు భాగాలుగా వేరుచేసివాటికి ఇట్రియా(yttria),ఇర్బియ (erbia)మరియు టేర్బియా(terbia) అని పేర్లు పెట్టాడు<ref name=education>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele068.html|title=The Element Erbium|publisher=education.jlab.org|date=|accessdate=2015-04-20}}</ref>.ఇర్బియంను మొదట స్విడనులోని ఇట్టర్బి(ytterby) అనుగ్రామంలో లభించిన ఖనిజం నుండి మొదటగా కనుగోనటం వలన ,ఆ గ్రామనామం కలిసివచ్చేలా ఇర్బియం అని నిర్ణయించారు.
 
==లభ్యత==
భూమి ఉపతితల పటలంలో ఇర్బియం 2.8 మి.గ్రాము /కిలో ఉండును.సముద్ర జలంలో 0.9 ng /లీటరు. భూమి ఉపరితల మట్టిలో తగినంత పుష్కలంగా లభించు మూలకాలలో ఇర్బియం 45 వది.మిగతా అరురైన మృత్తిక లవలె ఇదికూడా ప్రకృతిలో విడిగా మూలకం రూపంలో లభ్యం కాదు,కాని ఇది మోనజైట్ (monazite)ఇసుకఖనిజంలో లభించును.గతంలో ముడి ఖనిజాలనుండి అరుదైన మృత్తికలను వేరుచేయ్యడం చాలా కష్ట తరంగా ,అధిక ధనవ్యయంతో కూడుకున్నదై యుండేది. కాని 20 శతాబ్దిలో పరివర్తన వర్ణలేఖన విధానాన్ని(ion-exchangechromatography methods ) అభివృద్ధి పరచిన పిమ్మట ,అరుదైన మృత్తిక మూలాల ను,వాటి సమ్మేళనాలను వేరుచేయ్యటం సులభతరం అయ్యింది.
"https://te.wikipedia.org/wiki/ఇర్బియం" నుండి వెలికితీశారు