ఇర్బియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==భౌతిక ధర్మాలు==
ఇర్బియం సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద [[వెండి]] లా తెల్లగా ఘనస్థితిలో ఉండు మూలకం. ఈ మూలకం యొక్క [[పరమాణు సంఖ్య]] 68.న్యూట్రానులసంఖ్య 99<ref name=element>{{citeweb|url=http://www.chemicalelements.com/elements/er.html|title=Periodical Table: Erbium|publisher=chemicalelements.com|date=|accessdate=2015-04-20}}</ref>. పరమాణు భారము 167.257 మోల్/గ్రామ్. తటస్థ పరమాణు ఎలక్ట్రాను విన్యాసం [Xe] 4f<sup>12</sup> 6s<sup>2</sup><ref name=webelement/>.ఇర్బియం యొక్క సంకేత అక్షరము Er.ఇర్బియం అరుదైన[[మృత్తికలు|మృత్తిక లోహం]].ఇర్బియం యొక్క [[ద్రవీభవన స్థానం]] 1529°C. మరియు భాష్ఫిభవన స్ధానం 2868°C.గది ఉష్ణోగ్రత వద్ద ఇర్బియం యొక్క [[సాంద్రత]] 19.90 గ్రాములు/సెం.మీ<sup>3</sup><ref name=webelement/>. మూలకం ద్రవస్థితి లో ఉన్నప్పుడు సాంద్రత 18.8 గ్రాములు/సెం.మీ <sup>3</sup>. అణువు స్పటిక నిర్మాణం అరుభుజాల సౌష్టవం కలిగియుండును. ఇర్బియం లోహం యొక్క ఉష్ణ వాహాక తత్త్వం 14.5W /m <sup>-1</sup>.k <sup>-1</sup>.ఇర్బియం యొక్క పింకు రంగు Er<sup>3+</sup> అయానులకున్న ఆప్టికల్ ఫ్లోరోసెంట్ లక్షణాలవలన దీనిని కొన్నిరకాల లేసరు అప్లికేసనులలో ఉపయోగిస్తారు.
 
శుద్ధమైన ఇర్బియం మెత్తని,తీగెలు,రేకులుగా సాగు లక్షణమున్నలోహం.ఇర్బియం మెత్తటి మూలకమైన ప్పటికి [[గాలి]] లో స్థిరంగా ఉంది,తతిమ్మా అరుదైన మృత్తిక లోహాలవలె కాకుండగా ,నెమ్మదిగా ఆక్సీకరణ పొందును.ఈ మూలకం యొక్క లవణాలు [[గులాబీ]] రంగులో ఉండును.ఈ మూలకం మామూలు కాంతిలో,అతినీలలోహిత కాంతిలో,పరాణు కాంతిలో ఒకప్రత్యేక మైన అవశోషణ వర్ణక్రమముబంధనం కలిగి యున్నది.
"https://te.wikipedia.org/wiki/ఇర్బియం" నుండి వెలికితీశారు