చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
[[1522]] సంవత్సరములో [[పోర్చుగీసు]] వారు ఇక్కడకు వచ్చారు. వారు క్రైస్తవ గురువైన ''సంత థామస్'' పేరు మీద మరో ఓడరేవును నిర్మించుకొని దానికి సెయింట్ టోమ్ అని పేరు పెట్టారు. థామస్ ఇక్కడ 1552-70 మధ్య సంవత్సరాలలో మత ప్రచారం చేసాడు. ఆ తరువాత పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గింది. [[1612]] లో [[డచ్]] వారి ప్రాబల్యం పెరిగింది. డచ్చివారు డచ్ ఇండియా కంపెనీని చెన్నై నగరానికి ఉత్తరంగా [[పులికాట్]] లో ఏర్పాటు చేసుకొన్నారు. [[1639]] [[ఆగష్టు 22]]వ తారీఖు (దీనినే ''ఫ్రానిన్స్ డే'' అంటారు) బ్రిటీష్ వారు అప్పటి విజయనగర రాజైన పెద వేంకటరాయలు అనుమతితో కోరమాండల్ తీరములో చిన్న భాగాన్ని [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] స్థావరాన్ని పెట్టుకోవడానికి, వర్తకం జరుపుకోవడానికి తీసుకొన్నారు. ఈ ప్రదేశం అప్పట్లో వండవాసి పాలకుడు దామెర్ల వేంకటపతి నాయకుని ఆధ్వర్యములో ఉండేది. ఒక ఏడాది పోయాక సెయింట్ జార్జి కోటను బ్రిటీష్ వారు నిర్మించుకొన్నారు. తరువాత కొన్ని రోజులలో ఈ ప్రదేశము అంతా వారి వలసకు కేంద్ర స్థావరము అయ్యింది. [[1746]] సంవత్సరములో సెయింట్ జార్జి కోటను [[ఫ్రెంచ్]]వారు ''జనరల్ బెర్టండ్ ఫ్రానిన్స్ మహె డి లా బౌర్డన్నాయిస్'' (మారిషస్ గవర్నర్) నేతృత్వంలో ఆక్రమించుకొన్నారు. 1749లో మళ్లీ [[ఆంగ్లేయులు]] ఈ ప్రదేశము మీద తమ పెత్తనాన్ని ''ఐక్స్ లా చాఫెల్ సంధి''తో సంపాదించుకొన్నారు. ఆధిపత్యాన్ని సంపాదించుకొన్నాక ఫ్రెంచ్ వారి ఆక్రమణల నుండి మరియు మైసూర్ సుల్తాన్ [[హైదర్ అలీ]] ఆక్రమణల నుండి రక్షించుకోవడానికి తమ బలగాలను ద్విగుణీకృతము చేసి రక్షణను పటిష్టం చేసుకొన్నారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పటి [[తమిళనాడు]]లోని చాలా భాగం, [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] రాష్ట్రాలలోని కొంత భాగాలతో మద్రాసు ప్రెసిడెంసీని మద్రాసు (చెన్నై) రాజధానిగా ఏర్పాటు చేసుకొన్నారు.[[బ్రిటీష్]] వారి పరిపాలనలో నగరం వృద్ధి చెందింది మరియు ప్రముఖ యుద్ధ నౌకాస్థావరముగా కూడా మారింది. బ్రిటిష్ హయామ్ లో, ఈ నగరం పెద్ద నగరప్రాంత కేంద్రంగానూ మరియు ఓడరేవుల మూలంగానూ మారినది. భారతదేశంలో [[రైల్వేలు]] ప్రవేశపెట్టబడిన తరువాత, ఇది [[ముంబై]] మరియు [[కోల్కతా]] నగరాలతో అనుసంధానం చేయబడినది. ఈ అనుసంధాన వలన, మార్గాలు, కమ్యూనికేషన్లు స్థిరపడ్డాయి. ఈ నగరం [[:en:Madras State|మద్రాసు స్టేట్]] యొక్క రాజధానిగా యేర్పడినది. మద్రాసు రాష్ట్రం పేరును 1969లో తమిళనాడు గా మార్చారు.
== నగర రవాణా వ్యవస్థ ==
చెన్నైని దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా పిలుస్తారు. చెన్నై నగరం దేశందేశ నలుమూలలతోనూ మరియు అంతర్జాతీయ స్థానాలకు కలపడుతోందికలపబడుతోంది. చెన్నై నుండి ఐదు జాతీయ రహదారులు [[కలకత్తా]], [[బెంగుళూరు]], [[తిరుచినాపల్లి]], [[తిరువళ్ళూరు]] మరియు [[పుదుచ్చేరి]].<ref name=transport>{{cite web | title= GIS database for Chennai city roads and strategies for improvement | work=Geospace Work Portal | url=http://www.gisdevelopment.net/application/Utility/transport/utilitytr0001.htm| accessmonthday=August 4|accessyear=2005}}</ref> కి బయలు దేరుతాయి. కోయంబేడు లోని చెన్నై ముఫసిల్మఫిసిల్ బస్ టర్మినస్ (సి.యం.బి.టి.) నుండి తమిళనాడు బస్సు సర్వీసులు మరియు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బయలు దేరుతాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏడు రవాణా సంస్థలు నగరంతో పాటూ, తమిళనాడు రాష్ట్రంలోనూ, అంతర్-రాష్ట్ర బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు కాకుండా అనేక ప్రైవేటు రవాణా సంస్థలు కూడా ఉన్నాయి.
ఈ నగరంలో విస్తారమైన లోకల్ రైలు వ్యవస్థ కలదు. ఉత్తరాన ఆంధ్రలోని సూళ్ళూరుపేట మొదలు దక్షిణాన చెంగల్పట్టు వఱకును తూరుపున చెన్నై బీచ్ మొదలు పశ్చిమాన అరక్కోణం వఱకు ఈ వ్యవస్థ విస్తరించియున్నది. ముఖ్యముగా చెన్నై బీచ్- తాంబరం నడుమ రైలు సేవల సాంద్రత అత్యధికము. రద్దీ వేళల్లో 4-5 నిముషాలకు ఒక రైలు నడచును. ఈ మార్గములో లోచల్ ఎలెక్ట్రిక్ రైళ్ళు ఆంగ్లేయుల కాలములో ప్రారంభింపబడెను. ప్రస్తుతము కొన్ని సర్వీసులు చెంగల్పట్టు వఱకును కంచి వఱకును నడుచుచున్నవి.
ఈ నగరమునందలి మీనంబాకములో విమానాశ్రయము కలదు. కామరాజర్ దేశీయ టర్మినల్ మఱియు అణ్ణా అంతర్జాతీయ టర్మినల్ అను రెండు టర్మినళ్ళు గలవు. ఊరి మధ్యలోనే విమానాశ్రయము ఉండుట నగరవాసులకును సందర్శకులకును ఎంతో వెసులుబాటుగానుండును.
దక్షిణాదిన ఆంగ్లేయులు కాలు మోపిన ఓడరేవు ఇచటనే గలదు.
 
==చెన్నైలో తెలుగు వారు==
* ఆరోజుల్లో మదరాసులొ అన్ని రంగాలలో ప్రాముఖ్యత వహించిన వారు తెలుగు వారే. వారిలో ......... మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన వారు ముగ్గురు తెలువారె. వారు.... సింగరాజు సుబ్బారాయుడు / కావలి వేంకట పతి,/ జయంతి కామేశం /. 1925-29 మద్య కాలంలో శ్రీకాళహస్తి జమీందారు పానగల్ రాజా సర్ పానగంటి రామారాయనంగారు [[జస్టీస్ పార్టీ]] అధ్యక్షులుగాను తరువాత మద్రాసు ముఖ్య మంత్రి గాను వున్నారు. వారి హయాంలోనే త్యాగరాయనగర్ రూపు దిద్దుకున్నది. అక్కడ మామిడితోటలు విస్తారంగా వుండేవి. అందుకే త్యాగరాయ నగర్ కు మాంబళం అని పేరు. మాంబళం అనగా మామిడి పండు అని అర్థం. రాజావారు త్యాగరాయ నగర్లో ఒక పార్కుకు స్థలాన్నిచ్చారు. ఆ పార్కు పేరు [[పానగల్ పార్క్]]. ఈ పార్కులో రాజా వారి విగ్రహం ఈనాటికి వున్నది. 1932-36 మధ్యకాలంలో [[బొబ్బిలి రాజా]] వారు శ్రీ [[రాజారావు రామకృష్ణ రంగారావు]] మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వున్నారు. ఆతర్వాత రావు బహద్దర్ కూర్మా వెంకట రెడ్డి గారు మద్రాసు గవార్నర్ గా వుండే వారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు శ్రీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వుండేవారు.
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు