ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆస్మియం అనునది ఒకరసాయనిక [[మూలకం]].ఇది మూలకాల [[ఆవర్తన పట్టిక]]లో 8 వ సమూహం/సముదాయం(group),d బ్లాకు, 6 వ పిరియాడ్ కు చెందిన ఒక పరివర్తక మూలకం.
==చరిత్ర==
[[ఇంగ్లాండు]] లోని [[లండను]] నగరంలో,1803 లో స్మిత్ సన్ టేన్నట్ (Smithson Tennant)మరియు విలియమ్ హైడ్ వోల్లస్టన్(William Hyde Wollaston)లు ఈ మూలకాన్ని మొదటగా కనుగొన్నారు. ఈ మూలకం యొక్క ఆవిష్కరణ ప్లాటినం సమూహానికి చెందిన మూలకాల ఆవిష్కరణతో ముడివడి యున్నది. ప్లాటినం 17 వ శతాబ్దిలో platina("small silver"),పేరుతొ యూరోపులో ప్రవేశించి నది. రసాయన వేత్తలు, ప్లాటినం సమ్మేళనాలు తయారుచేయుటకు, ప్లాటినంను అక్వారిజియా (నత్రికామ్లం ,మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మిశ్రమం)లో కరగించినపుదుకరగించినపుడు,ఆమ్లంలో కరుగని నల్లని పదార్థం ,శేష పదార్థంగా/అవశిష్టంగా అడుగున మిగిలి ఉండటం గమనించారు. ఆమ్లంలో కరుగని ఈ నల్లని అవశేష పదార్ధం ను జోసెఫ్ లూయిస్ ప్రోస్ట్ (Joseph Louis Proust) గ్రాపైట్ గా పొరపాటు పడినాడు.
 
1803 లో Victor Collet-Descotils, Antoine François, comte de Fourcroy, మరియు Louis Nicolas Vauquelin లు తమ పరిశోధనలలో ఈ నల్లని పదార్థం అవశేషంగా ఏర్పడటం గమనించారు కాని విశ్లేషణకు అవసర పడిన పరిమాణంలో పదార్థాన్ని సేకరించలేక పోయారు. చివరకు 1803 లో స్మిత్ సన్‌టేన్నట్ ఈ నల్లని పదార్థం లోని రెండుమూలకాలను వేరుచెయ్యగలిగాడు. ఆరెండు మూలకాలు [[ఇరీడియం]] మరియు ఆస్మియంలు.ఆస్మియం అను కొత్త మూలకాన్ని గుర్తించినట్లు జూన్ 21,1804 లో ఒక ఉత్తరం ద్వారా రాయల్ సొసైటికి తెలిపాడు.
 
==లభ్యత==
భూమి ఉపరితలంలో అతి తక్కువ పరిమాణంలో దొరుకు మూలకం ఆస్మియం.ఇది 50 ppt(ట్రిలినియంలో 50వ వంతు). ఆస్మియం విడి మూలకంగా అతిఅరుదుగా లభిస్తుంది.సహాజ ప్రకృతి సిద్దమైన మిశ్రమ ధాతువు లలో, ఇరిడియం-ఆస్మియం ముడి ధాతుఖనిజాలలో లభిస్తుంది.ఆస్మియం ఎక్కువ ఉన్న ధాతువును అస్మిరిడియం(osmiridium)ఇరిడియం ఎక్కువ ఉన్న ధాతువును ఇరిడాస్మియం(iridosmium). ఆస్మియం [[నికెలు]], [[రాగి]] ధాతు ఖనిజాలలో లభించును.ఇవి ధాతువులలో సల్ఫయిడుల,టేల్లిరాయిడులు,అంటి మోనిడ్సు,అర్సేనాయిడ్సులరూపంలో కూడ లభ్యమగును. అగ్నిశిల నిక్షేపాలలో,అగ్నిపర్వత జ్వాలముఖి పరిసరాలలో అదిక మొత్తంలో కన్పించును.
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు