ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఆస్మియం అనునది ఒకరసాయనిక [[మూలకం]].ఇది మూలకాల [[ఆవర్తన పట్టిక]]లో 8 వ సమూహం/సముదాయం(group),d బ్లాకు, 6 వ పిరియాడ్ కు చెందిన ఒక పరివర్తక మూలకం.
==చరిత్ర==
[[ఇంగ్లాండు]] లోని [[లండను]] నగరంలో,1803 లో స్మిత్ సన్ టేన్నట్ (Smithson Tennant)మరియు విలియమ్ హైడ్ వోల్లస్టన్(William Hyde Wollaston)లు ఈ మూలకాన్ని మొదటగా కనుగొన్నారు. ఈ మూలకం యొక్క ఆవిష్కరణ ప్లాటినం సమూహానికి చెందిన మూలకాల ఆవిష్కరణతో ముడివడి యున్నది. ప్లాటినం 17 వ శతాబ్దిలో platina("small silver"),పేరుతొ యూరోపులో ప్రవేశించి నది. రసాయన వేత్తలు, ప్లాటినం సమ్మేళనాలు తయారుచేయుటకు, ప్లాటినంను అక్వారిజియా ([[నైట్రిక్ ఆమ్లం|నత్రికామ్లం]] ,మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మిశ్రమం)లో కరగించినపుడు,ఆమ్లంలో కరుగని నల్లని పదార్థం ,శేష పదార్థంగా/అవశిష్టంగా అడుగున మిగిలి ఉండటం గమనించారు. ఆమ్లంలో కరుగని ఈ నల్లని అవశేష పదార్ధం ను జోసెఫ్ లూయిస్ ప్రోస్ట్ (Joseph Louis Proust) గ్రాపైట్ గా పొరపాటు పడినాడు.
 
1803 లో Victor Collet-Descotils, Antoine François, comte de Fourcroy, మరియు Louis Nicolas Vauquelin లు తమ పరిశోధనలలో ఈ నల్లని పదార్థం అవశేషంగా ఏర్పడటం గమనించారు కాని విశ్లేషణకు అవసర పడిన పరిమాణంలో పదార్థాన్ని సేకరించలేక పోయారు. చివరకు 1803 లో స్మిత్ సన్‌టేన్నట్ ఈ నల్లని పదార్థం లోని రెండుమూలకాలను వేరుచెయ్యగలిగాడు. ఆరెండు మూలకాలు [[ఇరీడియం]] మరియు ఆస్మియంలు.ఆస్మియం అను కొత్త మూలకాన్ని గుర్తించినట్లు జూన్ 21,1804 లో ఒక ఉత్తరం ద్వారా రాయల్ సొసైటికి తెలిపాడు.
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు