కర్నాటి లక్ష్మీనరసయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
 
ప్రజానాట్యమండలి నటుడు. కర్నాటి లక్ష్మీనరసయ్య కృష్ణా జిల్లా తిరువూరు తాలూకా [[తునికిపాడు]] గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం. రాజమ్మ, వెంకయ్యలు తల్లిదండ్రులు.బాల్యం మధిర తాలూకా దెందులూరులో గడచింది. ఉన్నతవిద్యాభ్యాసం ఖమ్మం హైస్కూలులో ఉర్దూ మీడియంలో . చదువు మధ్యలో ఆగిపోయింది. [[షేక్ నాజర్|పద్మశ్రీ నాజరు]] బుర్రకథ దళంలో చేరారు.నాజర్‌ బృందంలో హాస్యాన్ని, రాజకీయాన్ని కూడా ప్రజలు మెచ్చేలా నిర్వహించారు. ''ముందడుగు'' నాటకంలో [[గరికపాటి రాజారావు|డాక్టరు గరికపాటి రాజారావు]] కథానాయకుడి పాత్రకు లక్ష్మీనరసయ్యను ఎంపికచేశారు. తరువాత లక్ష్మీనరసయ్య, కోడూరు అచ్చయ్య, పెరుమాళ్లు వంటి వారి శిక్షణలో రాటుదేలారు. నటుడిగానే కాక, ప్రయోక్తగా, దర్శకునిగా ఎదిగారు. [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి|మిక్కిలినేని]], [[నాగభూషణం (నటుడు)|రక్తకన్నీరు నాగభూషణం]], [[రామన్న పంతులు]], రామచంద్రకాశ్యప్‌[[రామచంద్ర కాశ్యప్‌]], [[కె.వి.ఎస్‌.శర్మ]] వంటి రంగస్థల, సినిమా నిపుణుల ఆధ్వర్యంలో అనేక ప్రదర్శనలు, పోటీలలో పాల్గొన్నారు.[[ చెక్కభజన]] లు, [[కోలాటం|కోలాటాలు]] , [[గొల్లసుద్దులు|సుద్దులు]] , చిత్ర విచిత్ర వేషాలు వంటివి నేర్చుకొని విరివిగా ప్రదర్శించారు. ''అల్లీముఠా'' నాటకాన్ని ప్రపంచ తెలుగు మహాసభలో ప్రదర్శించారు. ''అంతా పెద్దలే'' అనే రెంటాల నాటకాన్ని తన దర్శకత్వంలో రూపొందించి రాష్ట్రంలో అన్ని ముఖ్యపట్టణాల్లోనూ ప్రదర్శించారు.
[[పుట్టిల్లు]], [[అగ్గిరాముడు (1954 సినిమా)|అగ్గిరాముడు]], [[భలేబావ]], [[లవ్ మ్యారేజ్]], [[నీడ (సినిమా)|నీడ]], [[పూలపల్లకి]], [[ఈ చరిత్ర ఏ సిరాతో]], [[ఇదికాదు ముగింపు]], [[ఈ చదువులు మాకొద్దు]] వంటి సినిమాల్లో లక్ష్మీనరసయ్య నటించారు.విజయవాడలో జానపద కళాకేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆ సంస్థ అధ్యక్షులుగా ఉంటూ నూట ఇరవైమంది కళాకారులను తీర్చిదిద్దారు.విజయవాడ పురప్రముఖులు (1983)లో ప్రజానటుడు బిరుదంతో సత్కరించారు. 1987లో షష్ఠి పూర్తి మహోత్సవం జరిగింది. డాక్టర్‌ నందమూరి తారక రామారావు 1988 ఏప్రిల్‌ పదిహేనో తేదీన కర్నాటి లక్ష్మీనరసయ్యను సత్కరించారు. 2008లో తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డును స్వీకరించారు.