రెడ్డి హాస్టల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రెడ్డి హాస్టల్‌గా పేరుపొందిన హైదరాబాద్ రెడ్డి విద్యార్థి వసతిగృహం నిజాం పరిపాలనకాలం నాటి తెలంగాణలో విద్యారంగం, సాంస్కృతికరంగాలకు విలువైన సేవ చేసిన సంస్థ. హైదరాబాద్ నగర కొత్వాల్‌గా పనిచేసిన [[వెంకట రాంరెడ్డి|రాజాబహదూర్ వెంకట రాంరెడ్డి]] రెడ్డిహాస్టల్‌ను తన వితరణతో ఏర్పాటుచేశారు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ">{{cite book|last1=గుమ్మన్నగారి|first1=బాలశ్రీనివాసమూర్తి|title=ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ|date=జూన్ 2014|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|isbn=978-93-89652-05-01}}</ref> ఈ సంస్థలో వసతిపొంది విద్యాభ్యాసం చేసిన పలువురు విద్యార్థులు తదనంతర కాలంలో రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, సంగీతాది రంగాల్లో సుప్రసిద్ధులైనారు. కులప్రాతిపదికన కేవలం రెడ్డి కులస్తులైన విద్యార్థులకే ఈ సంస్థ ద్వారా వసతి పొందే వీలుండేది. రెడ్డి హాస్టల్ సాంస్కృతిక కళాకేంద్రంగా కూడా విలసిల్లింది. రెడ్డి హాస్టల్లోనే పలు సాంస్కృతిక సంస్థలు ఊపిరిపోసుకున్నాయి.
== చరిత్ర ==
హైదరాబాద్ నగరానికి కొత్వాల్ (నేటి నగర పోలీస్ కమీషనర్ స్థాయి పదవి)గా పనిచేసిన రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి గొప్ప దాతగా, ప్రజాసంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా ప్రతిష్ట పొందారు. తెలంగాణలోని రెడ్డి కులస్తులైన విద్యార్థులు చదువుకునేందుకు సహకారంగా ఉండాలని, ఆనాటి నైజాం రాష్ట్రంలో విద్యావికాసానికి ఉపకరిస్తుందని భూరివిరాళం ఇచ్చి రెడ్డి హాస్టల్‌ను ఏర్పాటుచేశారు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
 
== కార్యకలాపాలు ==
=== సాంస్కృతిక కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/రెడ్డి_హాస్టల్" నుండి వెలికితీశారు