మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
రాజకీయ రంగంలో మాడపాటి వారిది మితవాదధోరణి. ఆయన తోటి ప్రజాసేవకులతో పాటు ఆయనను గురించి కూడా తెలియజేస్తూ వినతిపత్రాలు సమర్పించడం, వాదించడం, నచ్చజెప్పడం వంటివే వారి రాజకీయ పరికరాలని, వారి ప్రజానాయకత్వంలో ఆందోళనలు, ఉద్యమాలు, వ్యతిరేకించడం వంటివి లేవని తర్వాతి తరం నేతలు పేర్కొన్నారు. అయితే కొందరు చరిత్రకారులు వారి పాత్రను గురించి తెలియజేస్తూ తర్వాతి తరం వారు అతివాదులై తీవ్రకృషిచేయడానికి వీరి మితవాద నాయకత్వమే పునాది అని, 1920ల్లో వీరు చేసిన కృషిని తర్వాతి వారు మితవాదమన్నా అప్పటికి అదే అతివాదమని వివరించారు. మాడపాటి హనుమంతరావును భిన్న రాజకీయ దృక్పథాలు, వేర్వేరు సిద్ధాంత ప్రాతిపాదికలు ఉన్నవారు కూడా గౌరవించేవారు. తెలంగాణలో చైతన్యానికి ఆయన చేసిన తొలియత్నాలే కారణం కావడమే వారి పట్ల ఆ గౌరవానికి కారణం. ఆయన ఆంధ్రమహాసభకు పెద్దదిక్కువలె వ్యవహరించేవారు. నిజాం ప్రభుత్వ విధానాల కారణంగా తెలంగాణలో తెలుగుభాష దెబ్బతింటున్నప్పుడు ఆయన తెలుగుభాష, తెలుగు సంస్కృతి వికాసానికి ఎనలేని కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కృషిని గురించి ప్రస్తావిస్తూ రావి నారాయణరెడ్డి "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." అన్నారు.<ref name="నా జీవితపథంలో">{{cite book|last1=రావి|first1=నారాయణరెడ్డి|title=నా జీవితపథంలో}}</ref><br />
ఆంధ్రోద్యమాన్ని ఆరంభ దశ నుంచి ఓ మహోద్యమంగా మలిచేవరకూ సాగిన ఆయన జీవనపథంలో పలువురు తర్వాతి తరం మహానాయకుల్లో రాజకీయ నేతృత్వాన్ని ఆయనే మొదట ప్రోత్సహించారు. ఆంధ్రోద్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి, వారికి తగిన బాధ్యతలు అప్పగించారు. వారి చేతిలో తర్వాతి తరం తెలంగాణా పోరాట నాయకత్వం రూపుదిద్దుకున్నది అన్నా అతిశయోక్తికాదు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ">{{cite book|last1=గుమ్మన్నగారి|first1=బాలశ్రీనివాసమూర్తి|title=ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ|date=జూన్ 2014|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|isbn=978-93-89652-05-01}}</ref>
== వ్యక్తిత్వం ==
మాడపాటి హనుమంతరావు దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో దక్షత వంటివి కలిగిన వ్యక్తి.
 
==రచనారంగం==
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు