మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
మాడపాటి హనుమంతరావు దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో దక్షత వంటివి కలిగిన వ్యక్తి. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం వల్ల ఆయన అజాతశత్రువుగా నిలిచారు. దేశసేవ చేసే ఉత్సాహంలో ఉద్రేకం పొందకూడదన్నది ఆయన అభిప్రాయం. వృత్తిరీత్యా తనను సంప్రదించవచ్చే క్లయింట్లు, రాజకీయరీత్యా సహచరులు మొదలుకొని అందరితోనూ ఆత్మీయంగా వ్యవహరించేవారు. ఈ లక్షణాలకు తోడు నాటి హైదరాబాద్ రాష్ట్రపు స్థితిగతుల్లోని అజ్ఞానాంధకారాన్ని చైతన్యంతో తొలగించే తొలి ప్రయత్నం చేసినవారు కావడంతో తన జీవితకాలంలో అపరిమితమైన గౌరవాన్ని పొందారు. రాజకీయాల్లో ఆయన మితవాది, అయినా ఆయన రాజకీయాదర్శాలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా వారిని ఎంతగానో గౌరవించేవారంటే వారి వ్యక్తిత్వం వెల్లడవుతోంది.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
== ప్రాచుర్యం ==
తెలంగాణలో చైతన్యాన్ని తెచ్చిన తొలి తెలుగు నాయకునిగా మాడపాటి హనుమంతరావు గొప్ప ప్రాచుర్యం, గౌరవం పొందారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కుటీరం పేరిట నిర్మించుకున్న ఆయన ఇంటికి ఆంధ్రోద్యమ కాలంలో నాయకులు, విద్యార్థులు తరచుగా వస్తూండేవారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ పనిమీద వచ్చినప్పుడల్లా విద్యార్థులు, విద్యావంతులు తప్పనిసరిగా గోల్కొండ(ప్రతాపరెడ్డి ఇల్లుకు పెట్టుకున్న పేరు)లో సురవరం ప్రతాపరెడ్డిని, ఆంధ్రకుటీరంలో మాడపాటి వారిని ఒక ఆచారంలా సందర్శించుకునేవారు.<ref name="యాత్రాస్మృతి 52పేజీ">{{cite book|last1=దాశరథి|first1=కృష్ణమాచార్య|title=యాత్రాస్మృతి|page=52}}</ref>
తెలంగాణలో చైతన్యాన్ని తెచ్చిన తొలి తెలుగు నాయకునిగా మాడపాటి హనుమంతరావు గొప్ప ప్రాచుర్యం, గౌరవం పొందారు.
 
==రచనారంగం==
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు