మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
== ప్రాచుర్యం ==
తెలంగాణలో చైతన్యాన్ని తెచ్చిన తొలి తెలుగు నాయకునిగా మాడపాటి హనుమంతరావు గొప్ప ప్రాచుర్యం, గౌరవం పొందారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కుటీరం పేరిట నిర్మించుకున్న ఆయన ఇంటికి ఆంధ్రోద్యమ కాలంలో నాయకులు, విద్యార్థులు తరచుగా వస్తూండేవారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ పనిమీద వచ్చినప్పుడల్లా విద్యార్థులు, విద్యావంతులు తప్పనిసరిగా గోల్కొండ(ప్రతాపరెడ్డి ఇల్లుకు పెట్టుకున్న పేరు)లో సురవరం ప్రతాపరెడ్డిని, ఆంధ్రకుటీరంలో మాడపాటి వారిని ఒక ఆచారంలా సందర్శించుకునేవారు.<ref name="యాత్రాస్మృతి 52పేజీ">{{cite book|last1=దాశరథి|first1=కృష్ణమాచార్య|title=యాత్రాస్మృతి|page=52}}</ref> ఆ విషయం తెలంగాణ సాయుధ పోరాటం ముందు స్థితిగతులను ప్రతిబింబించేలా వ్రాసిన చారిత్రిక నవల [[చిల్లర దేవుళ్ళు (నవల)|చిల్లర దేవుళ్ళులో]] ప్రస్తావించబడింది. ఆ నవలలో రచయిత దాశరథి రంగాచార్యులు ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావును ఓ పాత్రగా మలిచి వారితో కథానాయకునికి నైజాంలోని తెలుగు దుస్థితి వివరింపజేస్తారు.<ref name="చిల్లర దేవుళ్ళు">{{cite book|last1=దాశరథి|first1=రంగాచార్యులు|title=చిల్లరదేవుళ్ళు|publisher=విశాలాంధ్ర ప్రచురణాలయం|location=హైదరాబాద్}}</ref>
== పురస్కారాలు-గౌరవాలు ==
ఆయన తెలంగాణా రాజకీయరంగంలో వహించిన బాధ్యతలను పురస్కరించుకుని ఆంధ్రపితామహుడన్న బిరుదుతో వ్యవహిరిస్తూంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు