మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
రాజకీయ రంగంలో ప్రత్యక్ష కార్యాచరణ, క్రియాశీల రాజకీయం వంటివి మాడపాటి హనుమంతరావు ప్రముఖంగా చేపట్టలేదు. దీనికి ముఖ్యకారణం ఆయన ప్రజాజీవనంలో ప్రవేశించిన 20వ శతాబ్ది తొలి రెండు దశాబ్దాల నాటి హైదరాబాద్ రాజ్య స్థితిగతులే కారణం. అప్పటి పరిస్థితుల్లో హిందువులు నిర్వహించుకునే ప్రతి సభాసమావేశానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ అనుమతుల్లో కూడా రాజకీయాలు చర్చించకూడదన్న షరతు ప్రముఖంగా ఉండేది. అప్పటికి రాజకీయ కార్యకలాపాలపై ఉన్న నిషేధాన్ని ఎదిరించి నిలిచినవారు లేకపోలేదు. కానీ వారంతా అతికొద్ది సమయంలోనే రాజ్యబహిష్కరణ వంటి విధినిషేధాలకు గురయ్యారు. అప్పటి స్థితిగతుల గురించి ఒక్కమాటలో చెప్పాల్సివస్తే ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో రాజకీయాలకు తావుండేది కాదు.<br />
ఈ నేపథ్యంలో మాడపాటి హనుమంతరావు అప్పటి స్థితికి అనుగుణంగా తన ప్రజాసేవా కార్యకలాపాలు మలుచుకున్నారు. అప్పటి ఆయన వ్యహరచన ఇలావుండేది: ''ఆంధ్రోద్యమాన్ని బలోపేతం చేయాలంటే గ్రంథాలయాల స్థాపన జరగాలి, మాతృభాష పట్ల అభిమానం పెరగాలి. ఆంధ్రోద్యమ స్ఫూర్తి పల్లెసీమల ద్వారా వ్యాపించాలి. గ్రామీణ జనావళికి సర్కారీనౌకర్ల వల్ల ఏర్పడే పీడను తొలగించాలి. ఉద్యమంలో రాజకీయ క్రీనీడలు చోటు చేసుకోకుండా చూడాలి. ప్రభుత్వానికి అధికార వర్గానికి ఆంధ్రోద్యమ కార్యకర్తలపై అనుమానాలు ప్రబలకుండా జాగ్రత్తపడాలి.'' ఈ ప్రణాళిక మొత్తం ఆనాటి స్థితిగతుల మూలంగా ఏర్పడింది. నిజానికి ఈ రాజకీయ కార్యకలాపాలకు తావులేని సాంస్కృతికోద్యమమే తదుపరి కాలంలో తెలంగాణాలో వెల్లువెత్తిన అన్నిరకాల ఉద్యమాలకు ముఖ్యభూమికగా నిలిచింది. ఆంధ్రోద్యమ ప్రభావంలో చదువుకున్న వారే తర్వాత నాయకులై ముందుండి నడిపారు.<br />
మాడపాటి హనుమంతరావు తన ప్రజాజీవితంలో ఒకే ఒకసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని శాసనసభకు 1952లో పోటీచేశారు. కాకుంటే ఆయన ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరుగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనూ ఆయనకు స్థానం దక్కింది. ఆ శాసనమండలికి తొలి అధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
 
== విమర్శలు ==
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు