ఆపరేషన్ మైత్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
భారీ భూకంపతో కుదేలైన పొరుగు దేశం [[నేపాల్‌]]ను ఆదుకోవడానికి '''ఆపరేషన్ మైత్రి ''' పేరుతో సహాయక కార్యక్రమాలను భారత్ ముమ్మరంగా చేపట్టింది. 2015 ఏప్రిల్ 26 ఆదివారం రెండు డజన్లకు పైగా విమానాలు, చాపర్లను కఠ్మాండుకు పంపింది. వాటితో పాటు సుశిక్షితులైన 1,000 మంది సిబ్బందిని తరలించింది. అక్కడ చిక్కుకున్న పర్యాటకులను రోడ్డు మార్గం ద్వారా త్వరగా తరలించేందుకు అంబులెన్స్‌లు, బస్సులు ఏర్పాటు చేశారు. 2015 ఏప్రిల్ 25 శనివారం నుంచి 1000 మందిని విమానాల ద్వారా తరలించారు.
 
మొదటి విడత సహాయంగా పది టన్నుల దుప్పట్లు, 50 టన్నుల నీళ్లు, 22 టన్నుల ఆహార పదార్థాలు, 2 టన్నుల మందులు [[కాఠ్మండు]]కు పంపడం జరిగింది. ఆర్మీ, సివిల్ డాక్టర్లను, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సును తరలించారు. భారత ప్రభుత్వం నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) ద్వారా భారీ ఎత్తున సహాయక వస్తు సామాగ్రి ని చేరవేయడమే కాకుండా అక్కడ ప్రమాదంలో ఉన్న 500 మందికి పైగా భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చింది <ref>{{cite web | url= http://timesofindia.indiatimes.com/india/Nepal-earthquake-Operation-Maitri-reaches-relief-to-epicentre/articleshow/47075972.cms |title=Nepal earthquake: Operation Maitri reaches relief to epicentre|date=28 April 2015 | work = http://timesofindia.indiatimes.com| accessdate = 29 April 2015 }}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_మైత్రి" నుండి వెలికితీశారు