రాజబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
==స్వభావం==
సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని సత్కరించే వాడు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన [[బాలకృష్ణ]] ను సత్కరించాడు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.[[శివరామకృష్ణయ్య]], [[సూర్యకాంతం]], [[సావిత్రి]], [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేట లో భూమి ఇచ్చాడు. అంతే కాక [[కోరుకొండ]] లో జూనియర్ కాలేజీ కట్టించాడు. దాని పేరుకూడా ఆయన పేరు మీదే "[[రాజబాబు జూనియర్ కళాశాల]]" గా ఉంది.
 
==సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/రాజబాబు" నుండి వెలికితీశారు