క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
అరుదైన మృత్తిక లోహాలను కనుగొన్న శాస్త్ర వేత్త గడోలిన్ జ్ఞాపకార్థం అంతకు మునుపు కనుగొన్న ల్యాంథానాయిడుల సముదాయానికిచెందిన మూలకానికి [[గాడోలీనియం]] అనిపేరు పెట్టారు,అదే విధంగా నూతనం గా కనుగొన్న మూలకానికి మూలకాల అణుధార్మికత పై విశేష పరిశోధనలు చేసిన మ్యారీ,మరియు ఆమె భర్త పియరీక్యురీ జ్ఞాపకార్థం క్యూరియం అని నామకరణం చేసారు.
==చరిత్ర==
[[File:Glenn Seaborg - 1964.jpg|thumb|left|upright|Glenn T. Seaborg]]
 
1944 కు ముందు కుడా [[పరమాణు]] పరిశోధన ప్రయోగాలలో క్యూరియం ఉత్పత్తి చెయ్యబడి నప్పటికీ,మొదటిగా క్యూరియంను ఉత్పత్తి చెయ్యాలనే ఆలోచనతో, గ్లెన్ టి .బోర్గ్,రాల్ప్ ఏ.జేమ్సు , మరియు ఆల్బర్ట్ ఘిర్సోలు, బర్కిలీలోని [[కాలిఫోర్నియా]] విశ్వవిద్యాలయంలో 1944 న ప్రయోగం నిర్వహించి ఉత్పత్తి చెయ్యడం జరిగినది. ఈ పరిశోధన ప్రయోగంలో 150 సెం.మీ పొడవున్న సైక్లోట్రోన్ గొట్టాన్ని ఉపయోగించడం జరిగి నది.ఉత్పత్తి చేసిన క్యూరియంను [[చికాగో]] విశ్వవిద్యాలయం లోని అర్గోన్నే నేషనల్ ప్రయోగశాలలో రసాయనికంగా పరిశోధించి నిర్ధారించడమైనది. ఆక్టినాయుడు శ్రేణిలో 4 వ ట్రాన్సుయురేనియం మూలకమైనప్పటికి, కనుగొన్న 3 వ ట్రాన్సు యురేనియం మూలకం క్యూరియం. అప్పటికి ఇంకా [[అమెరీషియం]] మూలకాన్ని కనుగొనలేదు.
 
==లభ్యత==
ఎక్కువ దీర్ఘకాలిక మనుగడ ఉన్న <sup>247</sup>Cm ఐసోటోపు అర్ధజీవిత కాలము 15.6మిలియను సంవత్సరాలు. కనుక భూమి ఏర్పడు సమయంలో ఉన్నక్యూరియం ఇప్పటికే పూర్తిగా క్షయించి పోయిఉండును. అందుచే పరిశోధన అవసరార్థం తక్కువ ప్రమాణంలో పరిశోధన శాలలో కృత్తిమంగా క్యూరియంను ఉత్పత్తి చేయుచున్నారు. అణు విద్యుత్తు కేంద్రాల పరమాణు ఇంధనాలలో లభిస్తుంది. ప్రస్తుతం క్యూరియం ప్రకృతిలో వాతావరణంలో 1945 మరియు 1980లలో పరమాణు పరీక్షలు నిర్వహించిన ప్రాంతాలలో ఉంటుంది. [[అమెరికా]]లో [[నవంబరు]] 1,1952 లో ప్రయోగాత్మకం గా అమెరికాలో హైడ్రోజన్ పరమాణు బాంబును పరిక్షించిన పరిసరాలలో ఐన్‌స్టీనియం, [[ఫెర్మియం]] , [[ప్లూటోనియం]],మరియు [[అమెరీషియం]], [[బెర్కీలియం]], మరియు [[కాలిఫోర్నియం]]లతోపాటు క్యూరియం యొక్కఐసోటోపులు <sup>245</sup>Cm, <sup>246</sup>Cm,లను మరియు తక్కువ పరిమాణంలో <sup>247</sup>Cm, <sup>248</sup>Cmమరియు <sup>249</sup>Cm ఐసోటోపులను గుర్తించుట జరిగినది. సైనిక పాటవసమాచారం కానుక, మొదట రహాస్యంగా ఉంచి,1956 లో బహిరంగపరచారు.
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు