వెల్చేరు నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Pavan santhosh.s, పేజీ వేల్చేరు నారాయణరావు ను వెల్చేరు నారాయణరావు కు తరలించారు: సరైన పేరుకు తరలింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వేల్చేరువెల్చేరు నారాయణరావు
| residence =
| other_names =
| image = Velcheru narayana rao.jpg
| caption =వేల్చేరువెల్చేరు నారాయణరావు
| birth_name =
| birth_date = ఫిబ్రవరి 1,1933
పంక్తి 33:
| weight =
}}
'''వేల్చేరువెల్చేరు నారాయణరావు''' ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు మరియు పండితుడు. బ్రిటీష్ యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా [[తెలుగు సాహిత్యం]] పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు.
 
== వృత్తి, వ్యక్తిగత జీవితం ==
ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఎ., ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎం.ఎ. పూర్తిచేసిన అనంతరం వేల్చేరువెల్చేరు నారాయణరావు 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ లో డిప్లొమా అందుకున్నారు. అనంతరం 1971లో అమెరికాలోని విస్కామన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1974లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అంశంపై చేసిన పరిశోధనకు గాను పి.హెచ్.డి. పట్టా అందుకున్నాకా విస్కామన్సిన్ విశ్వవిద్యాలయంలోనే 1975లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 1981లో అసోసియేట్ ప్రొఫెసర్ గా అనంతరం 1987లో ఆచార్యునిగా పదోన్నతి పొందారు. 2009-10 నాటికి యూనివర్శిటీ ఆఫ్ చికాగో, ఎమోర్య్ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
 
== సాహిత్య విమర్శ, పరిశోధన ==
వేల్చేరువెల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంతో తెలుగు విమర్శారంగంలో తనదైన స్థానాన్ని పొందారు.ఆయన తొలి విమర్శా గ్రంథమైన "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం"లో కవిత్వంలోని విప్లవాల గురించి వివరించారు. విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. దీన్నుంచి కొన్ని విప్లవాత్మకమైన ఉపలక్ష్యాలు కూడా వస్తాయి. (అ) కవులు విప్లవాలను తీసుకురారు, (ఆ) తామున్న సమాజ సందర్భాన్ని అర్థం చేసుకున్న కవులు ఆ సందర్భానికి అనుగుణంగా కవిత్వం రాస్తారు, (ఇ) అలాటి వారిలో సమర్థులైన వారు ఆ కవితావిప్లవానికి నాయకులుగా గుర్తింపబడతారు, (ఈ) సమర్థులైనా సందర్భాన్ని అర్థం చేసుకోలేని వారూ, లేదా ఆ సందర్భాన్ని తాము మార్చగలమనుకునే వారూ రాసే కవిత్వం నిలబడటానికి, వారి సమర్థత పాలు సందర్భానికి అనుగుణంగా రాసే వారి కన్నా ఉన్నతమైనదై వుండాలి అనేవి ఈ గ్రంథంలోని అంశాలకు స్థూలమైన సారాంశం.
ఈ గ్రంథంలోని విషయ విస్తరణ 20వ శతాబ్దిలోని కవిత్వ విప్లవాలపై ఎక్కువ ఆధారపడిందన్న ప్రముఖ విమర్శకులు కె.వి.ఎస్.రామారావు తదనంతర పరిశోధనల్లో ఆ లోపం పూరిస్తూ పూర్వసాహిత్యాన్ని నారాయణరావు కొత్త కోణంలో పరామర్శించారు అన్నారు. ఈ కోణంలో నారాయణరావు గ్రంథాలను విశ్లేషిస్తూ కె.వి.ఎస్.రామారావు ''శ్రీనాథుడి గురించిన పరిశోధన, పురాణ దశ నుంచి ప్రబంధ దశకి జరిగిన పరిణామక్రమంలో, ఒక ముఖ్యమైన మజిలీగా గుర్తించటం. చాటుపద్యాల గురించిన పరిశీలనలు, ప్రబంధ దశకి పట్టుగొమ్మలైన పండితబృందాలు కవిత్వాస్వాదనని ఒక అద్భుతమైన వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దాయో, ప్రబంధ కవితా విప్లవాన్ని ఎలా నిలబెట్టాయో చూపిస్తాయి. కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం మీద జరిగిన పరిశోధనలు బహుశా ప్రబంధ విప్లవానికి ఒక ముఖ్య కారణం అప్పటి సమాజంలో ఊపిరిపోసుకుంటున్న “ఆధునికతా” భావనలు కావొచ్చునని ప్రతిపాదిస్తాయి. నాయకరాజుల కాలంనాటి కవిత్వం గురించిన శోధనలు ప్రబంధ సాహిత్యం అంతా ఒకే మూస లోది కాదని, దానిలోనూ అనేక “చిరువిప్లవాలు” ఉండొచ్చునని చూపే ప్రయత్నంగా చూడొచ్చు. ఇలా, స్థూల వర్గీకరణతో ప్రారంభమైన నారా సుదీర్ఘ ప్రయాణం ఒక్కో స్థూలాంశాన్ని దాని సూక్ష్మ విభాగాలుగా విడదీసి ఒక్కో సూక్ష్మాంశానికున్న ప్రత్యేకతల్ని గుర్తిస్తూ, అది దాని స్థూల మాతృకలోని ఇతర సూక్ష్మాంశాలతో ఎలా సంబంధితమైందో వివరించే నిరంతరాయ ప్రయత్నాల సముదాయంగా '' నారాయణరావు సాహిత్యాన్ని అభివర్ణిస్తారు.
ప్రతీ రచనకు నిర్దుష్టమైన రచయిత, ఒకే శుద్ధమైన పాఠం ఉంటుందని భావిస్తూ చేస్తున్న పరిశోధనల మూలాలను నారాయణరావు ప్రశ్నిస్తారు. అటువంటి పరిశోధనలు, వాటికి మూలమైన అవగాహన వలసవాద భావజాలంలో భాగమే తప్ప నిజానికి అవి భారతీయ సాహిత్య క్రమానికి ఉపయోగపడవని ఆయన సిద్ధాంతీకరించారు. ఈ క్రమంలో వలసవాద భావజాల ప్రభావిత విమర్శకులకు కొరుకుడు పడని చాటువులను ఎంచుకుని ప్రామాణిక పరిశోధన వ్యాసాలు, పుస్తకాలు రచించారు. ముఖ్యంగా "పొయెం ఎట్ ద రైట్ మూముంట్" గ్రంథంలో చాటు సాహిత్యంలోని వివిధ అంశాలను సవివరంగా చర్చించారు.
పంక్తి 50:
 
== రచనలు==
వేల్చేరువెల్చేరు నారాయణ రావు తెలుగులో, ఆంగ్లంలో పలు గ్రంథరచన, ఎన్నో ప్రామాణిక పత్రికల్లో వ్యాసరచన, పరిశోధనాత్మక గ్రంథాల్లో వ్యాసరచన ద్వారా భాగస్వామ్యం చేశారు. అంతేకాక తెలుగు కావ్య, నాటక, నవల, కథలను ఆంగ్లంలోకి అనువదించి వాటి విశిష్టత తులనాత్మకంగా అధ్యయనం చేసి ముందుమాటలుగా రాశారు. ఈ అనువాదాలు అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక పత్రికల్లో ప్రచురించి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రచురణలుగా వెలువరించడం వల్ల వాటికి ప్రామాణికత కట్టబెట్టి ప్రపంచ స్థాయిలో తెలుగు సాహిత్యానికి గుర్తింపు దక్కడానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఆయన ముఖ్యమైన రచనల జాబితా ఇలా ఉంది:<ref>http://www.mesas.emory.edu/home/assets/pdf/cv/CV_VNRao_Nov2010.pdf</ref>
 
=== తెలుగు ===
పంక్తి 73:
 
== పత్రికల్లో, ఇతరుల పుస్తకాల్లో ==
వేల్చేరువెల్చేరు నారాయణరావు రాసిన పలు పరిశోధక వ్యాసాలు, ఆంగ్లానువాదాలు వివిధ ప్రామాణిక పత్రికల్లో ప్రచురణ పొందాయి. ఆయన కొన్ని ప్రఖ్యాత పరిశోధన గ్రంథాల్లో వ్యాసాలు రాసి వాటిని మరింత సుసంపన్నం చేశారు.
 
=== పత్రికల్లో ===
''ఇండియన్ లిటరేచర్'', ''జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్'', ''జర్నల్ ఆఫ్ లిటరరీ ట్రాన్స్ లేషన్'', ''జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్'' తదితర ప్రామాణిక చారిత్రిక, సాంస్కృతిక, సాహిత్య పత్రికల్లో ఆయన రచనలు ప్రచురణ పొందాయి.
==== అనువాదాలు ====
ప్రామాణిక పత్రికల్లో తెలుగు సాహిత్యాన్ని వేల్చేరువెల్చేరు నారాయణరావు చేసిన ఆంగ్లానువాదాలు ఇలా ఉన్నాయి.
* విశ్వనాథ సత్యనారాయణ నవల "''హాహాహూహూ''"ను అదే పేరుతో ఆంగ్లానువాదం.
* విశ్వనాథ సత్యనారాయణ నవల "వీరవల్లడు"ను "''వల్లడు ద హీరో''" పేరిట ఆంగ్లానువాదం.