సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==సీసము భౌతిక ధర్మాలు==
సీసము ఒక లోహ మూలకం. ఇది మృదువుగా ఉండి, సాగకొట్టిన సులభంగా కావలసిన రూపంలోకి సాగును. అంతే కాకుండా బలమైన పరివర్తకోత్తర లోహ మూలకము (post-transition metal). తాజా సీసము నీలిచాయతో తెల్లగా ఉండును. కాని గాలితో సంపర్కము వలన పాలిపోయిన బూడిదరంగుకు మార్పు చెందును. సీసమును కరిగించినప్పుడు [[క్రోమియం]]-[[వెండి]] ల వన్నెకలిగి మెరుస్తుంది.ఇది అతి భారమైన రేడియో ధార్మికగుణ రహితమైన మూలకము. ఇది స్థిరమైన మూలకాలలో ఎక్కువ పరమాణు సంఖ్య కలిగి ఉన్న మూలకం. సాధారణ గదిఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో సీసముయొక్క సాంద్రత 11.34 గ్రాము/సెం.మీ <sup>3</sup>. ద్రవ స్థితిలో(ద్రవీభవ ఉష్ణోగ్రత వద్ద)సాంద్రత 10.66 గ్రాములు /సెం.మీ<sup>3</sup>. పరమాణు ద్రవ్యరాశి 207.21 , అణువు స్పటికం కేంద్రికృతఘనాకృతి. సీసము యొక్క ద్రవీభవ స్థానము 327.46°C. సీసము యొక్క మరుగు స్థానం 1749°C. ఎక్కువ [[సాంద్రత]] కలిగిన లోహ మూలకం సీసము.
 
మూలకం తక్కువ విద్యుత్తు వాహకతత్వమును ప్రదర్శించును. కాని ఎక్కువ క్షయికరణను తట్టుకునే గుణం, మరియు ఆర్గానిక్ రసాయనాలలో చర్యజరిపే గుణాన్ని కలిగిఉన్నది. ఇతర లోహాలను సీసములో అంశి భూతం గా కలపడం వలన సీసము యొక్క ధర్మాలలో గుణాత్మకమైన మార్పులు ఏర్పడును. ఈ మూలకంలో రాగి లేదా అంటిమోనిలను కలుపుట వలన సీసలోహం యొక్క దృఢత్వము పెరగడమే కాకుండ దానికి సల్ప్యురిక్ ఆమ్లం వలన కలిగే లోహ క్షయికరణను నిరోధించే గుణం పెరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు