అశ్వినీ దేవతలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
:# వేదుడను రాజును శత్రువులు యుద్ధమున బాధించునపుడు ఆతనిని రక్షించిరి.
 
ఈ దృష్టాంతములను బట్టి ఆశ్వినిలుఅశ్వినిలు శరీరధారులైన పూర్వకాలపు దేవజాతి అనబడు నరులలో పుట్టి పేరొందిన వారైనట్లు స్పష్టము.కాని ఈ కార్యములు మొదట అశ్వినిలిరువురే చేసిరని అనజాలము. వారి సంతతి వారందరును కొన్నాళ్ళవరకు అశ్వినులనియే పిలువబడినట్లు గ్రహించినచో కాల వ్యత్యాసము లేకుండపోవును. ఎందువలన అనగా, పైన పేర్కొనిన వారందరును ఒకేకాలపు మానవులనుటకు వీలులేదు.
 
ఈ అశ్వనిలు మొదట కంచర గాడిదలపై ఎక్కి తిరుగుచుండిరట. తరువాత ఋభువు లను వడ్రంగులు వీరికొక రధమును చెక్కి బహూకరింపగా, దానిపై కూర్చొండి తిరుగుచుండిరి. ఈ రధమునకు క్రమముగా ఎడ్లు, గుర్రములు, మొసళ్ళు, కట్టినట్లు కొన్ని ఋక్కులలో కలదు. సముద్రముపై ప్రయాణముచేసి తర్వాత రధమెక్కి ఆకాలపు ప్రజలకు సాయపడుటకై వీరు వచ్చుచున్నట్లు కొన్ని ఋక్కులలో కలదు. అందువలన వీరు పలు దేశములు తిరుగుచుండిరైరి.
"https://te.wikipedia.org/wiki/అశ్వినీ_దేవతలు" నుండి వెలికితీశారు