రాజ్యసంక్రమణ సిద్ధాంతం: కూర్పుల మధ్య తేడాలు

మొలక ప్రారంభం
 
+చరిత్ర
పంక్తి 1:
'''రాజ్యసంక్రమణ సిద్ధాంతం''' (Doctrine of Lapse) 1848 మరియు 1856కు మధ్య [[ఈస్టిండియా కంపెనీ]]కి గవర్నరు జనరల్ గా పనిచేసిన [[లార్డ్ డల్హౌసీ]] రూపొందించి, అమలుపరచిన రాజ్య ఆక్రమణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతం ప్రకారం, ఈస్టిండియా కంపెనీ యొక్క ఆధిపత్యంలో క్రింద ఉన్న సామంత రాచారిక సంస్థానాలలో పాలకుడు అసమర్ధుడైనా లేదా పుత్రసంతానము లేకుండా మరణించినా, ఆ రాజ్యాలు అప్రమేయంగా ఈస్టిండియా కంపెనీ రాజ్యంలో కలిసిపోతుంది.కలిసిపోతాయి.<ref name="keay">[[John Keay|Keay, John]]. ''India: A History''. Grove Press Books, distributed by Publishers Group West. United States: 2000 ISBN 0-8021-3797-0, p. 433.</ref> ఈ నియమం, తరతరాలుగా పుత్ర సంతానం లేని రాజులు వారసున్ని దత్తతు తెచ్చుకోవటమనే సాంప్రదాయాన్ని తిరగవేసింది. అంతేకాక, కాబోయే పాలకుడు సమర్ధుడా? కాడా? అన్న విషయాన్ని కూడా బ్రిటీషువారే నిర్ణయించేవారు. ఈ సిద్ధాంతము మరియు దీన్నిదీని అమలుపరచటంఅమలు న్యాయబద్ధంకాదని చాలామంది భారతీయులు భావించారు.
 
==చరిత్ర==
ఈ సిద్ధాంతం అమలులోకి వచ్చే సమయానికి, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీకి భారత ఉపఖండంలో విస్తృతమైన భూభాగాలపై అధికారం చెలాయించేది. రాజ్యసంక్రమణ సిద్ధాంతం నిబంధనలను అనుసరించి కంపెనీ [[సతారా]] (1848), [[జైపూర్]] మరియు [[సంబల్పూర్]] ([[ఒడిశా]]) (1849), [[నాగపూర్]] మరియు [[ఝాన్సీ]] (1854), [[తంజావూరు]] మరియు [[ఆర్కాట్]] (1855), [[ఉదయ్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్)]] మరియు [[అవధ్]] (1856) రాజ్యాలను ఆక్రమించుకున్నది. వీటిలో చాలామటుకు స్థానిక పాలకుడు సరిగా పరిపాలించడం లేదని ఆక్రమించుకొన్నవే. ఈ సిద్ధాంతం పర్యవసానంగా కంపెనీ వార్షిక ఆదాయానికి అదనంగా నలభై లక్షల పౌండ్లు (స్టెర్లింగు) జత అయినవి.<ref name=wolpert>[[Stanley Wolpert|Wolpert, Stanley]]. ''A New History of India''; 3rd ed., pp. 226-28. Oxford University Press, 1989.</ref> ఉదయ్‌పూర్ ఒక్క రాజ్యంలో మాత్రం 1860లో బ్రిటీషువారు తిరిగి స్థానిక పాలకున్ని పునరుద్ధరించారు. <ref>[http://www.indianrajputs.com/view/udaipur_mp Rajput Provinces of India - Udaipur (Princely State)]</ref>
 
==మూలాలు==