హౌరా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
'''హౌరా''' (''Howrah'') ([[బెంగాలీ]]: হাওড়া ) [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని ఒక పారిశ్రామిక నగరము. హౌరా నగరము మరియు దాని పరిసర ప్రాంతాలు హౌరా జిల్లాలో ఉన్నవి. [[హుగ్లీ నది]]కి పశ్చిమపు ఒడ్డున ఉన్న హౌరా మరియు నదికి అవతలి ఒడ్డున ఉన్న [[కలకత్తా]] జంట నగరాలు. హౌరా పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని రెండవ పెద్ద నగరం. కలకత్తాను, హౌరాను కలుపుతూ నదిపై ప్రసిద్ధ [[హౌరా వంతెన]] (రబీంద్ర సేతు)తో పాటు విద్యాసాగర్ సేతు (రెండవ హౌరా వంతెన) మరియు వివేకానంద సేతు వంతెనలు ఉన్నాయి. హౌరాలో కలకత్తా మరియు హౌరా నగరాలకు సేవలందిస్తున్న, దేశములో ప్రధానమైన హౌరా రైల్వే స్టేషను ఉన్నది.
[[File:Rly.Stn. Haurah.JPG|thumb|left|హౌరా రైల్వే స్టేషన్]]
 
బెంగాలీ భాషలో "హావర్" అంటే నీరు, మట్టి బయటికు వెళ్ళే దారి (తూము). 500 సంవత్సరాల క్రితం వేనీషియన్ యాత్రికుడు [[:en:Ceasare Federici|సీసరె ఫెడరిసి]] 1578లో తన జర్నల్‌లో "బాటర్" (Bator) అనే స్థలం గురించి వ్రాశాడు. ప్రస్తుత హఌరా నగరం పరిసరాలలో అదే పేరుగల స్థలం ఉంది. [[ఔరంగజేబు]] మనుమడైన [[ఫరూఖ్ సియార్]] రాజ్యం అధిష్టించినాక 1713లో [[ఈస్టిండియా కంపెనీ]] వారు అతనితో హుగ్లీ నది పశ్చిమాన ఉన్న గ్రామాలు (సలికియా, హౌరా, కసుండియా, రామకృష్ణపూర్) గురించి ఒక సెటిల్‌మెంట్ ఒప్పందం చేసుకొన్నారు. తరువాత తమ సముద్రయానం రాకపోకలకు కంపెనీవారు హౌరాను స్థావరంగా మార్చుకొన్నారు. అప్పటినుండి ఆధునిక హౌరా నగరం వృద్ధి చెందింది. ఆ గ్రామాలలో పెద్దదైన హౌరా పేరు మొత్తం నగరానికి వర్తించసాగింది. 1714 కంపెనీ రికార్డులలో "హౌరా" అనే పేరు మొట్టమొదటిసారి కనిపించింది.
 
"https://te.wikipedia.org/wiki/హౌరా" నుండి వెలికితీశారు