"శుక్రుడు" కూర్పుల మధ్య తేడాలు

5,310 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured)
# దీనికి ఉప గ్రహాలు లేవు.
# ఇది అత్యధిక వేడిని కలిగి ఉండును.
 
 
==వేదాలలో శుక్రుడు==
 
 
వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
 
సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము కలదు. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.
 
అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.
 
చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక కలదు. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.
 
గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.
 
'''శుక్రుడు'''
 
శుక్ల వర్ణము (తెల్లని రంగు)ను బట్టి ఇతడు శుక్రుడు. కావుననే జలమయుడు. తొలిసృష్టిలో పితామహుడు రుద్రుని రోదనము విని నీవు భవుడవగు మని చెప్పెను. ఆరుద్రుని జలమూర్తియగు భృగుకన్యకును, ఊశనకును శుక్రుడు ఉదయించెను. శుక్రుడు శివుని ఆరాధించి ధనపతిత్వము, అమరశరీరమును బడసెను అని పరాశారుడు. ఈకధలో శుక్రుని జలమయత్వము తల్లి చార. అమరశరీరత్వము తండ్రి చార.
 
[[ఋగ్వేదము]] అందలి వేనదేవతయే శుక్రుడని ఆ వేనుడే పడమటివారి Venus.
 
కృత్తిక మృగశిర పుష్య మఘ ఫల్గుణీద్వయము చిత్త స్వాతి విశాఖ పూర్వభాద్రపదులలో శుక్రుడు వృష్టిని కలిగించును. మరియు కృష్ణచతుర్దసి పంచమి అష్టములలో శుక్రోదయము మగునని, శుక్రాస్తమగునేని భూమి జలమయము అగునని సంహితలు చెప్పును.
 
వాయు, మత్స్య, లింగ భాగవత పురానములలో ఇతడు సోమయుడు.
 
ఇతనికి కవి అనియు, కావ్యుడనియు పేర్లున్నవి. [[ఫలజ్యోతిష్యము]] న ఇతనికి శిల్ప కవిత్వాదులతో సంబంధమున్నది. [[బృహస్పతి]] దేవమంత్రి. శుక్రుడు అసురమంత్రి. అందునే బృహస్పతినీతి, శుక్రనీతి అని చెప్పుదురు.
 
 
== ఇవీ చూడండి ==
738

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1513154" నుండి వెలికితీశారు