కొప్పుల హేమాద్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వృక్ష శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
==జీవిత విశేషాలు==
కొప్పుల హేమాద్రి [[తూర్పు గోదావరి జిల్లా]] , [[గొల్లప్రోలు]] గ్రామంలో [[సెప్టెంబర్ 19]], [[1938]] న జన్మించారు <ref>[http://www.exoticindiaart.com/book/details/dravyaguna-vijnana-NAC031/ ద్రవ్యగుణ విజ్ఞాన]</ref>. ఈయన [[అనకాపల్లి]] లోని ఎ.ఎం.ఎ.ఎల్. కాలేజీ నుంచి బి.ఎస్.సి (కెమిస్ట్రీ) పట్టాను 1959 లో పుచ్చుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ బోంబే లో బి.ఎస్.సి ఆనర్స్ పూర్తి చేసారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (వెస్టర్న్ సర్కిల్) పూనాలో పరిశోధకులుగా ఉద్యోగిగా చేరారు. మొక్కలు వాటి జాతులు, వైవిధ్యాలు గురించి గాఢ అధ్యయనం చేస్తూ పరిశోధనలు ప్రారంభించారు. ఎం.ఎస్.సి అభ్యసిస్తూ పరిశోధనా పత్రాలు సమర్పించేంసుకు "ఫ్లోరా ఆఫ్ జన్నర్" ప్రాంతాలలో మొక్కల జాతులు మీద విశేష పరిశోధనలు చేసారు.<ref>{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2011|publisher=శ్రీ వాసవ్య|page=38|edition=కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ}}</ref>
==పరిశోధనలు==
 
సహ్యాద్రి కొండల నడుమ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమే ఫ్లోరా ఆఫ్ జన్నర్. ఆ ప్రాంతాన్ని అణువణువునా పరిశోధించి 14 కొత్త మొక్కలను కనిపెట్టారు.<ref>[http://www.exoticindiaart.com/book/details/dravyaguna-vijnana-NAC031/ ఆయన రచించిన పుస్తక వివరాలు "ద్రవ్యగుణ విజ్ఞాన]</ref> శతాబ్దాల నుండి పరిశోధకులకు కానరాని, తెలియని ఆ మొక్కల వినియోగం, ప్రయోజనాలను గురించి ప్రాచీన గ్రంథాలను సంప్రదించారు. తన పరిశోధన సారాంశాన్ని "బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా" సంస్థ డైరక్టరుకు పరిశీలన నిమిత్తం పంపగా, దానిని పి.హెచ్.డి కి పంపించవలసినదిగా సలహా యిచ్చారు. దానిని ప్రపంచ ప్రఖ్యాత సంస్స్థ "రిజ్క్ హెర్బేరియం" (పోలండ్ దేశం) కు పంపించారు. అక్కడి డైరక్టరు ఆయన పరిశోధనా గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, చిన్న, చిన్న సవరణలు చేసి పి.హె.డికి బదులుగా డి.ఎస్.సి పట్టాను అందించారు. ఈయన పరిశోధనలతో 40 కొత్తరకాల మొక్కలు వైద్యరంగంలో ప్రవేశించాయి. ఆయన కేంద్రీయ ప్రభుత్వ ఆయుర్వేద సంస్థలో సర్వే అధికారిగా ఔషథ మొక్కలను పరిశోధనలు జరిపేందుకు నియమితులయ్యారు. అప్పటి వరకు ఉన్న ఆయుర్వేద గ్రంథాలళో , నిఘంటువులలో ఉన్న మందుల మొక్కల పేర్చు దాదాపుగా అన్ని తప్పులుగా ఉండేవి. అన్ని తప్పులను సవరించి, వర్గీకరణలు చేసి, అసలు సిసలైన నామకరణం చేసారు.చరిత్ర గర్భంలో మాటు మణిగిన 24 రకాల మొక్కలను కొత్తగా పరిచయం చేసారు. హిమాలయాలలో మాత్రమే లభ్యమవుతుందనుకొనే " గోమూత శిలాజిత్" ను ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నట్లు కనుగొన్నారు.<ref>[http://www.ancientscienceoflife.org/article.asp?issn=0257-7941;year=1987;volume=7;issue=2;spage=104;epage=104;aulast=Hemadri;type=0 "Discovery of Gomutra Silajit from south India"]</ref> ఈ "గోమూత్ర శిలాజిత్" కడప లోని వెంపల్లి కొండల మీద "రక్తమండలం" పేరుతోనూ, అనంతపురం జిల్లా మడకసిరి గ్రామ ప్రాంతాలలోని బంగారు నాయకుని కొండమీద "మునిరెట్ట" పేరుతోనూ, మహబూబ్ నగర్ జిల్లాలో "కొండముచ్చు మూత్రం" గానూ పిలివబడుతుంది.
 
==కొప్పులవారి కతలూ…కబుర్లూ==
"https://te.wikipedia.org/wiki/కొప్పుల_హేమాద్రి" నుండి వెలికితీశారు