కొప్పుల హేమాద్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
సహ్యాద్రి కొండల నడుమ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమే ఫ్లోరా ఆఫ్ జన్నర్. ఆ ప్రాంతాన్ని అణువణువునా పరిశోధించి 14 కొత్త మొక్కలను కనిపెట్టారు.<ref>[http://www.exoticindiaart.com/book/details/dravyaguna-vijnana-NAC031/ ఆయన రచించిన పుస్తక వివరాలు "ద్రవ్యగుణ విజ్ఞాన]</ref> శతాబ్దాల నుండి పరిశోధకులకు కానరాని, తెలియని ఆ మొక్కల వినియోగం, ప్రయోజనాలను గురించి ప్రాచీన గ్రంథాలను సంప్రదించారు. తన పరిశోధన సారాంశాన్ని "బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా" సంస్థ డైరక్టరుకు పరిశీలన నిమిత్తం పంపగా, దానిని పి.హెచ్.డి కి పంపించవలసినదిగా సలహా యిచ్చారు. దానిని ప్రపంచ ప్రఖ్యాత సంస్స్థ "రిజ్క్ హెర్బేరియం" (పోలండ్ దేశం) కు పంపించారు. అక్కడి డైరక్టరు ఆయన పరిశోధనా గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, చిన్న, చిన్న సవరణలు చేసి పి.హె.డికి బదులుగా డి.ఎస్.సి పట్టాను అందించారు. ఈయన పరిశోధనలతో 40 కొత్తరకాల మొక్కలు వైద్యరంగంలో ప్రవేశించాయి. ఆయన కేంద్రీయ ప్రభుత్వ ఆయుర్వేద సంస్థలో సర్వే అధికారిగా ఔషథ మొక్కలను పరిశోధనలు జరిపేందుకు నియమితులయ్యారు. అప్పటి వరకు ఉన్న ఆయుర్వేద గ్రంథాలళో , నిఘంటువులలో ఉన్న మందుల మొక్కల పేర్చు దాదాపుగా అన్ని తప్పులుగా ఉండేవి. అన్ని తప్పులను సవరించి, వర్గీకరణలు చేసి, అసలు సిసలైన నామకరణం చేసారు.చరిత్ర గర్భంలో మాటు మణిగిన 24 రకాల మొక్కలను కొత్తగా పరిచయం చేసారు. హిమాలయాలలో మాత్రమే లభ్యమవుతుందనుకొనే " గోమూత శిలాజిత్" ను ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నట్లు కనుగొన్నారు.<ref>[http://www.ancientscienceoflife.org/article.asp?issn=0257-7941;year=1987;volume=7;issue=2;spage=104;epage=104;aulast=Hemadri;type=0 "Discovery of Gomutra Silajit from south India"]</ref> ఈ "గోమూత్ర శిలాజిత్" కడప లోని వెంపల్లి కొండల మీద "రక్తమండలం" పేరుతోనూ, అనంతపురం జిల్లా మడకసిరి గ్రామ ప్రాంతాలలోని బంగారు నాయకుని కొండమీద "మునిరెట్ట" పేరుతోనూ, మహబూబ్ నగర్ జిల్లాలో "కొండముచ్చు మూత్రం" గానూ పిలివబడుతుంది.
==వైద్య గ్రంథ రచనలు==
ఆయన 2005 వరకు 15 వైద్య గ్రంథ రచనలను వెలువరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో మందు మొక్కలు, ఔషథీ వృక్ష శాస్త్రము, లను తెలుగు అకాడమీ వారు ప్రచురించి బి.ఎస్.సి (ఆయుర్వేద) విద్యార్థులకు పాఠ్య గ్రంథాలుగా రూపొందించారు. ఈయన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ జిల్లాల్లో లభ్యమవుతున్న ఔషథీ మొక్కలను పరిచయం చేస్తూ వాటి వినియోగ విధానాలను వివరిస్తూ పలు గ్రంధ రచనలు చేసారు. "గిరిజన మూలికా వైద్యం" గ్రంథం ప్రసిద్ధి పొందింది.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-bookreview/indigenous-herbal-remedies/article1446224.ece Indigenous herbal remedies]</ref> ఆయుర్వేద నిఘంటువులను అక్షర క్రమంలో నామీకరణ ద్వారా సరిదిద్దారు.
 
==కొప్పులవారి కతలూ…కబుర్లూ==
"https://te.wikipedia.org/wiki/కొప్పుల_హేమాద్రి" నుండి వెలికితీశారు