"గ్రీన్ టీ" కూర్పుల మధ్య తేడాలు

6 bytes added ,  6 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమ కాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్‌ టీ (తేయాకు). ఈ మధ్యకాలంలో ఈ తరహా టీ కనీసం పట్టణాలు, నగర ప్రాంతాలలో విస్తృత ఆదరణను పొందుతోంది. జీవన సరళి తాలూకు కనీస ఆహారపు అలవాట్లను మనం నేర్చుకోవచ్చు. ఈ ఆరోగ్యకర ఆహార అలవాట్లలో మనం సులువుగ చేర్చుకో గలిగింది గ్రీన్‌ టీ తాగే అలవాటు. జపాన్‌, చైనా వంటి దేశాలలో గ్రీన్‌ టీ ఇప్పటికే విస్తృత వినియోగంలో వుంది. అసలు గ్రీన్‌ టీ ని కనుగొన్నది షెన్‌నంగ్‌ అనే ఒక మహాచక్రవర్తి. ఆయన సేవించేందుకు కాగబెడుతోన్న నీటిలో యాదృచ్ఛికంగా వచ్చిపడిన గ్రీన్‌ టీ ఆకులు ఆ తరువాత కొన్ని దేశాలకు దేశాలలోనే ఆహారపు అలవాట్లను మార్చివేశాయి. జపాన్‌ వంటి దేశాలలో గ్రీన్‌ టీ తాగే అల వాటు మెండు.
గ్రీన్‌టీలో మెం డుగా వున్న రెస్‌పెరట్రాల్‌ అనే పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో వుంచుతుందట. దీనితో, రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్‌ వలన రక్తం గడ్డకట్టిపోదు. తద్వారా గుండెపోట్ల వంటివి నివారించబడతాయి. బహుశా, ఈ కారణంచేతనే దేశం లోని పౌరులలో, 75 శాతం మంది సిగరెట్లు తాగేవారే అయినా జపాన్‌లో హృద్రోగాలు స్వల్పం. గ్రీన్‌ టీ ఎంతగా మనలను కాపాడినా పొగతాగడం తాలూకు ప్రభావం మనపై ఎంతోకొంత తప్పనిసరి గా వుంటుంది. టీ అన్నింటిలో గ్రీన్ టీ మాత్రమే అత్యంత శక్తివంతమైనది. అందుకే సంప్రదాయ వైద్యంలో ఈ టీ వాడకం భారత్, చైనా దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఇందులోని ''ఇజీసీజి '' ," కాటెచిన్స్ " అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్ తగ్గినట్లు చైనా పరిశోధనలు చెపుతున్నాయి. దీనికున్న యాంటీ ఆక్సిడేటివ్, యాంటి ప్రొలిఫరేటివ్ గుణాలే ఇందుకు కారణం. గ్రీన్ టీ హెచ్ఐవీలోని కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలతో కలవనీయవని జపాన్ పరిశోధకులు చెపుతున్నారు. అంతేకాదు గ్రీన్ టీ తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఆయుష్షును పెంచే గుణం గ్రీన్ టీకి ఉన్నదంటున్నారు. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి హృద్రోగాలను దూరం చేస్తుంది. హృద్రోగాలు వచ్చినవారిలో కూడా గండె కణాలను బాగు చేస్తుంది. ఆనియన్స్, గ్రీన్‌టీలతో ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని సదరన్ క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గ్రీన్ టీ, ఆనియన్స్‌‌ను రోజువారీగా తీసుకోవడం ద్వారా బరువు పెరగడాన్ని నియంత్రించడంతో పాటు, ఒబిసిటీకి సంబంధించిన రోగాలు, హృద్రోగ సమస్యలు, డయాబెటిస్‌లకు చెక్ పెట్టవచ్చునని క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ లిండ్సే బ్రౌన్ తెలిపారు. ఆనియన్స్, గ్రీన్‌ టీ గుండె పనితీరును సక్రమం చేస్తుంది.... ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు గ్రీన్ టీలో ఉన్నాయని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించవచ్చునని ఆ అధ్యయనం తేల్చింది. బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనాన్ని డెయిలీ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. ఈ అధ్యయనం లో రోజూ గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా శరీరంలోని అనవసరమైన క్రొవ్వు పదార్థాల స్థాయిని తగ్గిస్తుందని తెలియవచ్చింది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థాలను గ్రీన్ టీ సేవనం ద్వారా కాపాడుకోవచ్చునని యూనియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు. 14 ర్యాండమ్ ట్రయల్స్‌లో గ్రీన్ టీ సేవనం ద్వారా 7.2 మి.గ్రాముల కొలెస్ట్రాల్ తగ్గిందని తెలిసింది. గ్రీన్ టీలో కెఫ్ఫిన్ ఉంటుంది. అందువలన గర్భవతులు ఒక రోజు రెండు కప్పుల కన్నా ఎక్కువగా తాగితే మంచిది కాదు. ఇంకా ఎక్కువగా తాగితే కెఫ్ఫిన్ జరాయువు దాటుకొని వెళ్ళి శిశువు పైన ప్రభావము చూపించే ప్రమాదము ఉన్నది.<ref>[http://www.momjunction.com/articles/is-it-safe-to-drink-green-tea-during-pregnancy_0079274/ "Is It Safe To Drink Green Tea During Pregnancy"]</ref>గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుకుంటున్నారా..? అయితే పప్పులో కాలేసినట్లే. గ్రీన్ టీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని కొత్త అధ్యయనంలో తేలింది. అందుచేత ఇక గ్రీన్ టీల కోసం భారీగా ఖర్చు చేయడాన్ని తగ్గించుకోండని వైద్యులు సూచిస్తున్నారు. తాజా అధ్యయనంలో బ్లాక్ టీలో కాసింత వేడిపాలును కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు గుండె జబ్బులను దూరం చేస్తుందని టీ అడ్వైజరీ ప్యానెల్ తెలిపింది. గ్రీన్ హెల్త్ ప్రాపర్టీస్, బ్లాక్ టీ ప్రాపర్టీస్‌పై జరిగిన పరిశోధనలో గ్రీన్ కంటే బ్లాక్ టీ ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. దీనిపై ఫ్రీలాన్స్ డైటీషియన్ డాక్టర్ క్యారీ రక్స్‌టన్ మాట్లాడుతూ.. గ్రీన్ టీ కంటే.. బ్లాక్ టీని సేవించడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, డయాబెటీస్, నోటి సమస్యలు వంటివి తగ్గుతాయన్నారు. అయితే తమ అధ్యయనం రెండు రకాల టీలపై సాగినట్టు చెప్పారు. ఇందులో ఒకే తరహా ప్రతిఫలాలు ఉన్నట్టు తేలిందన్నారు. బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగే వారిలో ఎక్కువగా గుండెపోటులు చాలా వరకు తగ్గినట్టు ఆయన తెలిపారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1520729" నుండి వెలికితీశారు