రోహిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
1995లో [[పాలగుమ్మి పద్మరాజు]] "పడవప్రయాణం" కథ ఆధారంగా మలయాళ దర్శకుడు [[కె.ఎస్.సేతుమాధవన్]] నిర్మించిన [[స్త్రీ (1995 సినిమా)|స్త్రీ]] సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది. రోహిణి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం "స్త్రీ" లో ఈమె ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి నంది బహుమతితో సత్కరించింది. ఈ చిత్రం విడుదలకు నోచుకోక పోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే నేషనల్ అవార్డు కూడా ఈమెను వరించింది. వీటితో పాటు "వీరుమండి", "తామరైభరణి", "ఒంబదు రూబాయ్ నోట్టు" అనే తమిళ చిత్రాలలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.
 
ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలు మరియు టీవీ కార్యక్రమాలలో నిమగ్నమైనది. చాలా వ్యవధి తర్వాత [[కమల్ హాసన్]] సినిమా [[పోతురాజు]] (తమిళంలో విరుమాండి)లో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది. [[అలా మొదలైంది]] సినిమాలో [[నాని]] కి తల్లిగా నటించారు.
 
సినీరంగంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే బుల్లితెరలో ప్రవేశించింది. వివిధ సీరియల్ కథలకు స్క్రిప్టులు రాశారు. "వీరుక్కు నీర్" అనే టెలీ ఫిల్మ్‌ కోసం అమెకు 2005లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వరించింది.<ref>[http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/0802/13/1080213016_1.htm నటి రోహిణి సృజనకు ప్రతిరూపం "సైలెంట్ హ్యూస్" - వెబ్ దునియా 14 ఫిబ్రవరి 2008]</ref>
"https://te.wikipedia.org/wiki/రోహిణి_(నటి)" నుండి వెలికితీశారు