వెన్నం జ్యోతి సురేఖ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆసియా క్రీడలలో పతకం సాధించిన భారతీయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
==జీవిత విశేషాలు==
గుంటూరు జిల్లా [[చెరుకుపల్లి]] మండలం లోని [[నడింపల్లి]] గ్రామానికి చెందిన శ్రీ వెన్నం సురేంద్ర కుమార్ ఒక కబడ్డీ క్రీదాకారుడు. వీరి సతీమణి శ్రీదేవి బి.ఇ.డి. చేసినారు. ఈ దంపతులు తమ కుమార్తె అయిన వెన్నం జ్యోతి సురేఖ భవిష్యత్తు కోసం, వియయవాడలో స్థిరపడినారు. చిన్నప్పటినుండి తమ చిన్నారికి ఈతలో శిక్షణ ఇప్పించినారు. జ్యోతి తన నాలుగు సంవత్సరాల వయసులోనే తన ఈత విన్యాసాలతో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నది. 5 కి.మీ. దూరంలో కృష్ణానదిని మూడు గంటల ఇరవై నిమిషాల ఎనిమిది సెకండ్లలో ఈది, "పిట్ట కొంచెం కూత ఘనం" అనిపించుకున్నది. తరువాత ఈమె విలువిద్యపై గురిపెట్టినది. కొద్దికాలంలోనే ఆ క్రీడపై తనదైన ముద్రవేసినది. 13 సంవత్సరాల వయసులో తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై మెరిసిన జ్యోతి, ఇక వెనుదిరిగి చూడలేదు. 2009 లో టైజునా లో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో, అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకం గెల్చుకున్నది. అదే వేదికపై మరో మూడు రజత పతకాలనూ మరియూ ఒక కాంస్య పతకాన్నీ గూడా స్వంతం చేసుకుని తన ప్రతిభ ప్రదర్శించినది. 2011 లో టెహరానులో జరిగిన ఆసియా ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో మహిళా కాంపౌండ్ టీం సభ్యురాలిగా కాంస్య పతకం గెల్చుకున్నది. 2013 లో చైనాలోని "వుక్సి" వేదికగా సాగిన ప్రపంచ యూత్ ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో కాంపౌండ్ జూనియర్ ఉమన్ మరియూ కాంపౌండ్ మిక్సెడ్ డబుల్స్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించినది. తాజాగా ఈమె 2014 సెప్టెంబరులో, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుచున్న ఆసియా క్రీడలలో భారత ఆర్చెరీ మహిళా జట్టు సభ్యురాలిగా కాంస్య పతకం స్వంతం చేసుకున్నది.
 
ఈమె 2015,మే-21 నుండి 24 వరకు, పాటియాలాలో, పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొని, ప్రథమ స్థానం సంపాదించినది. ముగ్గురు సభ్యుల బృందంలో ప్రథమ స్థానం సంపాదించి, ఈమె, ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్యా పోటీలకు ఎంపికైనది. త్వరలో ఈమె, దక్షిణ కొరియా దేశంలో నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయల విలువిద్య ఫోటీలలో పాల్గొంటుంది. [1]
 
==మూలాలు==
Line 52 ⟶ 54:
== బయటి లింకులు ==
*[http://www.archery.org/results/archer_update.asp?id=11348&action=&onyuz= Archery.org profile]
[1] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-28; 8వపేజీ.
 
{{Persondata
Line 59 ⟶ 62:
| DATE OF BIRTH = 3 July 1996
| PLACE OF BIRTH = [[Vijayawada]], [[Andhra Pradesh]]
| DATE OF DEATH =
| PLACE OF DEATH =
}}