నేతి శ్రీరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
'''నేతి శ్రీరామశర్మ''' ప్రముఖ సంగీత విద్వాంసులు.<ref>[http://vijayanagarfinearts.webs.com/ Vijayanagar Fine Arts]</ref> వీరు [[ఆకాశవాణి]] నిలయ విద్వాంసులుగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అచ్చటనే పదవీ విరమణ పొందారు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/musician-par-excellence/article3405940.ece Tribute Musician and teacher leaves behind a extraordinary legacy.]</ref>
==జీవిత విశేషాలు==
నేతి శ్రీరామశర్మ [[కృష్ణా జిల్లా]] లోని [[వల్లభాపురం]] లో లక్ష్మీనారాయణ, సీతారామమ్మ దంపతులకు [[1928]] [[నవంబరు 14]] న జన్మించారు.<ref>[http://www.saaranimusic.org/musicians/musicians.php?edi=74 biography of Neti Sreerama Sarma]</ref> ఈయన తండ్రి తండ్రి హరికథా భాగవతులైన కారణాన, విజయవాడలో గాయక సార్వభౌమ కీ.శే. [[పారుపల్లి రామకృష్ణయ్య పంతులు]] వద్ద వయొలిన్, గాత్ర సంగీతం, గురుకుల పద్ధతిలో శిక్షణనందుకున్నారు. <ref>[http://archive.andhrabhoomi.net/content/sisalina సిసలైన సంగీత గురువు]</ref> అచట ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి గార్లు ఈయనతో పాటు అచట అభ్యసించినవారే. అచట వయోలిన్ విధ్వాంసునిగా విశేష ప్రతిభకనబరచారు.
 
==ఉద్యోగ జీవితం==
ఆయన 1958 లో ఆల్ ఇండియా రేడియోలో స్ఠాప్ ఆర్టిస్టుగా చేరారు. అచట 1988 వరకు కొనసాగారు. <ref>[https://nsrsarma.wordpress.com/about/ SANGEETHA VIDWAN SRI NETHI SRI RAMA SARMA]</ref> ఉద్యోగ నిర్వహణలోను, ఆకాశవాణి జాతీయ సమ్మేళనాలలోను జాతీయంగా ప్రసిద్ధులైన సంగీత విద్వాంసులందరికీ వయొలిన్ సహకారం అందించి వారి ప్రశంసలందుకున్నారు. ఆయన వందలమంది విద్యార్థులకి గురుకుల పద్ధతిలో సంగీత శిక్షణనందించారు. రేడియో ద్వారా సంగీత పాఠాలు కూడా కొద్దికాలం నిర్వహించారు.ఆయన గురువులైన పారుపల్లి, సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వర్థంతులు, జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన అనేకమంది ప్రజ్యాత సంగీతకారులకూ శిక్షణనిచ్చారు. అందుకే శిష్యులందరూ అత్యంత ఆత్మీయంగా ‘సంగీతానంద’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.
"https://te.wikipedia.org/wiki/నేతి_శ్రీరామశర్మ" నుండి వెలికితీశారు