శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
 
=== ఆలయవిశేషాలు===
ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి 'నంబెరుమాళ్‌' అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీరంగనాధుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు చేర్చారు. ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్టించారు. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని 'తిరువరంగ మాళిగైయార్‌' అని యందురుఅంటారు.
 
=== వివరణ ===
పిళ్లైలోకాచార్యుల వారు తమ "ముముక్షుప్పడి" గ్రంథములో సర్వేశ్వరుని కళ్యాణగుణములను విశదీకరించి "ఇవై యెల్లామ్‌ నమక్కు నంబెరుమాళ్‌ పక్కలిలే కాణలామ్" (ఈ తిరుకల్యాణ గుణము లన్నియు మనకు నంబెరుమాళ్ విషయములో కనుపించును) అని ప్రస్తుతించుటచే ఉత్సవమూర్తికి "నంబెరుమాళ్" అని పేరు వచ్చినది. వారు శ్రీరంగనాథుని సౌందర్యమును ఇట్లు అభివర్ణించిరి. తిరుక్కైయిలే పిడిత్త-దివ్యాయుధజ్గళుమ్; వైత్తు అ-లెన్నకైయుమ్; కవిత్త ముడియుమ్; ముగముమ్;మురువలుమ్; ఆసన పద్మత్తిలే అళుత్తిన తిరువడిగళుమాయ్ నిఱ్కిర నిలయే నమక్కు త్తన్జమ్".
64,874

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1526025" నుండి వెలికితీశారు