పండగ చేస్కో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
'''పండగ చేస్కో ''' 2015 మే 29, శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా.
==కథ==
[[పోర్చుగల్‌]]లో ఉన్న కార్తీక్ పోతినేని (రామ్). వీడియో గేమ్స్ అభివృద్ది చేసే పెద్ద సంస్థ పెట్టి, కోట్లు గడిస్తాడు. తల్లితండ్రులు (పవిత్రా లోకేశ్, రావు రమేశ్), చెల్లెలు, బావ ఉంటారు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో అతనికి అనుష్క (సోనాల్ చౌహాన్) అనే మరో పారిశ్రామికవేత్త తారసపడుతుంది. సరైన వయసులోగా భారతీయ సంతతి వ్యక్తిని ఎవరినైనా పెళ్ళిచేసుకోకపోతే, వేల కోట్ల ఆస్తి మొత్తం వేరొకరికి వెళ్ళిపోతుందని ఆమె తండ్రి వీలునామా రాసిన సంగతి ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. ముప్ఫై రోజులే గడువు ఉండడంతో, వరుడి కోసం వెతుకుతున్న ఆమె కార్తీక్‌ను పెళ్ళాడాలనుకుంటుంది.
మరోపక్క, బొబ్బిలిలో ఉండే హీరోయిన్ దివ్య (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె తల్లి, తండ్రి (మిర్చి సంపత్) విడిపోతారు. తల్లి, మేనమామ (సాయికుమార్) దగ్గర పెరుగుతుంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తండ్రికీ, మేనమామకూ మధ్య నలిగిపోతుంటుంది. లాభం లేదని వేరే ఊరికి వచ్చేస్తుంది. కాలుష్యానికి కారణమవుతోందంటూ కార్తీక్ కర్మాగారం మీద కేసు వేసి, మూయించే పరిస్థితి తెస్తుంది. మనదేశంలోని ఈ కర్మాగారం కోసం పోర్చుగల్ నుంచి పెళ్ళి పనులు కూడా పక్కన పడేసి, మరీ వస్తాడు కార్తీక్.
కార్తీక్ ఇక్కడ కొచ్చాక, దివ్యను ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ కార్తీక్ ఎవరు? అతనికీ దివ్య తండ్రికీ ఉన్న బంధం ఏమిటి? దివ్య తండ్రికీ, మేనమామకూ మధ్య వైరానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ
 
==తారాగణం==
{{colbegin}}
"https://te.wikipedia.org/wiki/పండగ_చేస్కో" నుండి వెలికితీశారు