మోదడుగు విజయ్ గుప్తా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆయన గుంటూరు జిల్లా, బాపట్ల పట్టణంలో 1939 ఆగష్టు 17 న జన్మించారు. ఎం.ఎస్.సి డిగ్రీ అందుకున్న తరువాత చీరాల కాలేజీలో అధ్యాపకునిగా కొంతకాలం పాటు పనిచేసారు. ఆ తరువాత ఆస్సాం రాష్ట్రం లో ఒక కళాశాలలో "జంతు శాస్త్ర శాఖాధిపతి" గా కూడా పనిచేసారు. ఆ కాలంలో ఆయన పరిశోధనలపై దృష్టి సారించారు. పరిశోధనలు చేస్తూ ఆయన మరింత అభివృద్ధి సాధించడానికి కలకత్తా వెళ్ళి "ఫిషరీస్ రీసెర్చి" లో ప్రవేశించారు.<ref>[http://www.abfindia.org/PeopleECMMVGupta.aspx Agri Biotech Foundation (ABF)]</ref>
==పరిశోధనలు==
ఆయన పరిశోధనలను ముమ్మరంగా సాగించేందుకు, ప్రత్యక్ష్య అధ్యయనం చేసేందుకు స్వయంగా రైతుల చేపల చెరువులకు వెళ్ళి, చెరువు గట్ల పైనే పరిశోధనలు ప్రారంభించారు. రైతుల అవసరాలు, సమస్యలు కూడా అవగాహన చేసుకొని అందుకు అనుగుణంగా తన పరిశోధనలు కొనసాగించారు. అధికోత్పత్తు వలననే చేపల రైతులకు గిట్టుబాటు అవుతుందని గ్రహించి, ఆ దిశగా ప్రయోగాలు చేసి, రెండు రకాల కొత్త రకాల చేపలను "రిబ్బన్ ఫిషెస్" పేరుతో ఉత్పత్తి చేసారు. వీటి పెంపకంతో ఒకటిన్నర నుంచి మూడు, అయిదు టన్నుల స్థాయి వరకు అధిక దిగుబది వచ్చింది.<ref>[http://www.fao.org/docrep/field/003/AC361E/AC361E01.htm Research plans for integrated aquaculture..]</ref>