"ప్రతివాది భయంకర శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
ఆయన ఆంధ్ర పదేశ్ నందు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 22]] , 1930 న జన్మించాడు.<ref>[http://www.thehindu.com/features/cinema/veteran-singer-pbs-passes-away/article4617069.ece]</ref> ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు [[పసలపూడి]] గ్రామానికి చెందినవారు.
 
ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి [[తెలుగు]], [[కన్నడం ]] , [[తమిళం]] , [[మళయాళం]] , [[హిందీ]] , [[ఉర్దూ]] , [[ఆంగ్లం]] , [[సంస్కృతం]]. ఆయన అనేక గజళ్ల ను తెలుగు లో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను [[గీతా దత్]], [[షంషాద్ బేగమ్]] మరియు [[జిక్కీ]] లతో కలిసి ఆలపించారు. ఆయన [[ఆర్.నాగేంద్ర రావు]] యొక్క [[జాతక ఫలం]] అనే చిత్రం ద్వారా [[తమిళం]], [[కన్నడం]], [[తెలుగు]] చిత్రాల లో పరిచయమైనాడు<ref>[http://www.hindu.com/fr/2008/09/19/stories/2008091951110200.htm The Hindu : Music cannot thrive without rasikas]</ref>. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లొ ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. [[శాంతినివాసం]] చిత్రం లో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.
 
శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "[[మిస్టర్ సంపత్]]" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"<ref>[http://www.hindu.com/mp/2009/01/03/stories/2009010353731300.htm The Hindu: Harishchandra (1955)]</ref> లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో [[పి.సుశీల]] తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ [[రాజ్ కుమార్]] కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో [[జెమిని గణేశన్]] కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను [[ఎం.జి.రామచంద్రన్]] మరియు [[శివాజీ గణేశన్]] లకు పాడాడు. 1964 లో [[మై భీ లడకీ హూ]] అనే హిందీ చిత్రం లో [[లతా మంగేష్కర్]] తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు [[జెమినీ గణేశన్]], [[ముత్తురామన్]], [[రవిచంద్రన్]], [[జైశంకర్]].
 
"పావా మనిప్పు" అనే చిత్రంలో [[కన్నదాసన్]] వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను [[ఎం.ఎస్.విశ్వనాథన్]] మరియు [[టి.కె.రామమూర్తి]] గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి [[ఆడుతా వీట్టుప్పెన్]] అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన [[పి.సుశీల]] , [[ఎస్.జానకి]], [[పి.భానుమతి]] , [[కె.జమునా రాణి]] , [[ఎల్.ఆర్.ఈశ్వరి]] మరియు [[లతా మంగేష్కర్]] ల సరసన పాడాడు.
 
ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "[[శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్]]" , "[[ముకుంద మాల]]" , "శ్రీ మల్లిఖార్జున స్తోత్రం" , [[పురందరదాసు]] సంకీర్తనలు.
 
[[చైన్నై]] లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయము నందు ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు.<ref>[http://www.hinduonnet.com/2001/06/11/stories/13110464.htm The Hindu : Bit of drive-in nostalgia]</ref>
2,14,105

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1527436" నుండి వెలికితీశారు