భువనచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| birth_name = భువనచంద్ర
| birth_date = [[ఆగష్టు 17]]
| birth_place = [[నూజివీడు]] దగ్గర [[గుమ్మపూడి]]
| native_place =
| death_date =
పంక్తి 35:
| weight =
}}
[[భువనచంద్ర]] ఒక ప్రముఖ తెలుసు సినీ గేయ రచయిత. ఈయన పుట్టింది [[నూజివీడు]] దగ్గర గుమ్మపూడిలో[[గుమ్మపూడి]]లో. <ref>మే 3, 2009 ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైన భువన చంద్ర ఇంటర్వ్యూ ఆధారంగా</ref>ఈయనకు ముగ్గురు అన్నలు మరియు నలుగురు అక్కలు. ఈయన తల్లితండ్రులకు ఎనిమిదో సంతానం. ఎనిమిదేళ్ళ నుంచీ నవలలు చదవడం ప్రారంభించాడు. ఈయన నాన్న సుబ్రహ్మణ్య శర్మ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. వీరి కుటుంబం, తరువాత [[చింతలపూడి]] వచ్చేశారు. ఈయన బడిలో చదివే వయసులో చింతలపూడి గ్రంథాలయంలో [[చందమామ]] మొదలైన కథల పుస్తకాలు మొదలుకొని పెద్ద పుస్తకాలను సైతం ఆసక్తిగా చదివే వాడు. రోజూ పాఠశాల నుంచి వచ్చేటపుడు గోడపై సినిమా పోస్టర్ల పై ఉన్న [[ఆరుద్ర]], [[దాశరథి]], [[ఆత్రేయ]], [[శ్రీశ్రీ]] మొదలైన పేర్లను చూసి, వాటిపక్కన సుద్ద ముక్కలతో తనపేరు రాసుకునేవాడు. అలా రచయిత కావాలన్న కోరికకు ఆయనకు చిన్నతనంలోనే బీజం పడిందని చెప్పవచ్చు.
 
చింతలపూడి గ్రామంలో విశ్వనాథాశ్రమం ఉండేది. దానికి స్వామీజీ బోధానందపురి మహరాజ్. అప్పట్లో అక్కడ రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. అందులో భాగంగా అక్కడ [[హరికథ]]లు, దేవీ భాగవతం, యోగావాశిష్టం మొదలైన ఎన్నో కార్యక్రమాలు జరుగుతుండేవి. ఒకసారి ఈయన మిత్రుడు రంగా ప్రసాదం కోసమని బలవంతంగా ఆ దేవాలయానికి ఈడ్చుకునివెళ్ళాడు. అలా కార్యక్రమాలు ఆయన చెవినపడ్డాయి. తరువాత ఇంకా వినాలనిపించింది. తరువాత అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. అలా ఆయన జీవితంలో ఏదో తెలియని మార్పు సంభవించింది. ఆ రోజు నుంచీ, స్కూలు, గ్రంథాలయం, ఆపై ఆశ్రమం ఆయన దినచర్యగా మారింది. స్వామీజీ ప్రసంగాలను నిత్యం వింటూ, మనిషంటే ఏమిటి? దేవుడంటే ఏమిటి? ఇలాంటి తాత్విక చింతనలతో కొద్ది కాలం గడిపేవాడు. చదువు పూర్తయిన తరువాత ఎయిర్‌ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2012-10-11/did-you-know-/34386130_1_pawan-kalyan-iaf-indian-air-force ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన భువన చంద్ర]</ref >
 
1971లో జరిగిన [[ఇండో-పాక్ యుద్ధంలోయుద్ధం]]లో ఆయన పనిచేశాడు. సరిహద్దు గ్రామాల్లోంచి వెళుతున్నపుడు ప్రజలు ఇచ్చే రొట్టెలు, యుద్ధం చేసి తిరిగి వస్తుంటే దారిపొడవునా సెల్యూట్‌లు, పంజాబీ మరియు గుజరాతీ మహిళలు కట్టిన రాఖీలు ఆయనకు అపురూపమైన సగర్వంగా గుర్తుంచుకోగలిఏ జ్ఞాపకాలు. ఎయిర్‌ఫోర్స్ లో ఉండగానే చిన్న చిన్న వ్యాసాలు, కథలు రాసి వివిధ పత్రికలకు పంపేవాడు. ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ పుస్తక పఠనం వదల్లేదు. సర్వీసులో ఉండగా దాదాపు నాలుగువేల పాటలు రాశాడు. ఎయిర్‌ఫోర్స్ లో పద్దెనిమిదేళ్ళు తర్వాత సర్వీసు పూర్తయింది. పన్నెండు వేల జీతంతో ఓఎన్‌జీసీ లో ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ సినీ రచయిత కావాలన్న బలమైన కోరికవల్ల ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి అవకాశాల కోసం మద్రాసు బయలుదేరాడు.
 
అలా మద్రాసు చేరిన ఆయన్ను [[చంద్రమోహన్ ]]మొదట [[జంధ్యాల]] ఇంటికి తీసుకునివెళ్ళారు. ఆయన తీస్తున్న [[పడమటిసంధ్యారాగం]] సినిమాకు అవకాశం ఇస్తామన్నారు కానీ దురదృష్టవశాత్తూ అందులో ఆయన ఒక్కపాటా రాయలేకపోయారు. ఆ తర్వాత [[విజయ బాపినీడు]] ని కలిసి ”నాకూ”[[నాకూ పెళ్ళాం కావాలి”కావాలి]]” అనే సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. [[ఖైదీ నెం. 786]] లో ఆయన రాసిన ”గువ్వా... గోరింకతో...” అనే పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత [[గ్యాంగ్ లీడర్]], [[ఘరానా మొగుడు]], [[పెద్దరికం]] మొదలైన హిట్ సినిమాలకు పాటలు రాశాడు. ఇటీవల [[రజనీకాంత్]] నటించిన [[చంద్రముఖి]] సినిమాలోని ”రారా.. సరసకు రారా..” అనేపాట అత్యంత ప్రేక్షకాధరణ పొందింది.
 
ఆయన భార్య శేషసామ్రాజ్య లక్ష్మి, కొడుకు శ్రీనివాస్. ప్రస్తుతం [[చెన్నై]]లోనే ఉంటున్నారు. [[ఏనిమల్ ప్లానెట్]] ను అమితంగా ఇష్టపడే ఆయన అందులో ప్రకృతిలో మనతో సహజీవనం చేస్తున్న జంతువులు, పక్షుల గురించి తెలుసుకోవడమంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎనిదిన్నరేళ్ళ వయసులో చదివిన ఒక కథ ప్రభావంతో ఆయన అప్పటి నుంచీ మాంసాహారాన్ని పూర్తిగా మానివేశాడు.
"https://te.wikipedia.org/wiki/భువనచంద్ర" నుండి వెలికితీశారు