కేదార్‌నాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
 
==కేదార్‌నాథ్ గుడి==
కేదార్‌నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్టితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. [[గౌరికుండ్]] నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. [[కేదార్‌నాథ్ ]]గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. [[ఉత్తరాఖండ్]] లోని చార్‌ధామ్‌లలో[[చార్‌ధామ్‌]]లలో ఇది ఒకటి. [[గంగోత్రి]], [[యమునోత్రి]], [[బద్రీనాథ్]] మరియు కేదార్‌నాధ్ లను చార్ [[ఉత్తరాఖండ్]] ధామ్‌లుగా వ్యవహరిస్తారు.<br />
ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, [[పంచ పాండవులు]], శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం [[నేపాల్]] లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.
 
==ప్రత్యేకత==
"https://te.wikipedia.org/wiki/కేదార్‌నాథ్" నుండి వెలికితీశారు