సీతారాం ఏచూరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
1974లో ఎస్‌ఎఫ్‌ఐ నుంచి ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి... సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
 
పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి [[ప్రణబ్‌ ముఖర్జీ]] చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. ఇది [[నరేంద్ర మోడీ]] ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది.
 
అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్‌ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఒబామా రాకను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇస్లాం చాంధసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని ఏచూరి నిందిస్తారు. పశ్చియాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపిస్తారు. అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడుపోసుకుంటోందని, తాజా ఐఎస్‌ఐఎస్‌ సృష్టిస్తున్న మారణకాండయే నిదర్శనమంటారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తానపు ధోరణికి పాల్పడుతోందని ఏచూరి ఆరోపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవటానికే... పెత్తనం కోసం అర్రులు చాస్తోందని విమర్శిస్తారు.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా, వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమంటారు. ఇదే కారణంలోనే పాలస్తీనియన్లకు వారి మాతృభుమిపై చట్టబద్ధమైన హక్కు దక్కుకుండా సైన్యం జోక్యం చేసుకుంటోదన్నది ఏచూరి ఆరోపణ.
"https://te.wikipedia.org/wiki/సీతారాం_ఏచూరి" నుండి వెలికితీశారు