వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 357:
 
తెలుగు వికీపీడియా మార్చి 2015 లో 17 మంది అతిక్రియాశీలక సభ్యులను(నెలకు 100మార్పులు ఆపై చేసేవారు) కలిగివుంది. గత ఐదేళ్లపైగా పరిశీలుస్తున్న నాకు, తెలుగు వికీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. వికీపీడియాకొరకై జట్టుగా చేసే పనులకు, మొదటిపేజీ తీర్చిదిద్దడానికి లేక సహాయపడడానికి కూడా ఎక్కువమంది ముందుకు రావటం లేదు. వికీపీడియా వెలుపలి తెలుగులో సమాచారం పెరుగుతున్నా , మొబైల్ తో వికీపీడియా చూడగలిగే అవకాశం వున్నా. వీక్షణలు ఇంకా మూడు మిలియన్లలోపే వుంటున్నాయి. అందుకని ఇంకో ఐదు సంవత్సరాలలో తెలుగు వికీ ఇప్పటికన్నా బలహీనమవుతుంది. రెండు మూడేళ్లలో మొదటిపేజీశీర్షికల నిర్వహణ ఆగిపోయే అవకాశముంది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:43, 1 జూన్ 2015 (UTC)
 
:@[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] నేను ఆశావాదిని. నా పిచ్చికి కొన్ని హేతువులు కూడా ఉన్నాయి. కేవలం ఒకే ఒక క్రియాశీలక సభ్యుడి నుండి ఇరవైమంది క్రియాశీలక సభ్యులు (సి.ఐ.ఎస్ సహకారం లేకుండానే సుమీ) ఒకే లక్ష్యంతో పనిచెయ్యటం చూసినవాడిని కనుక నాకీ పిచ్చి అనుకుంటా. మిగిలిన వాళ్ళు ఉన్నా, లేకున్నా మరో ఐదేళ్ళ తర్వాత కూడా నేను తప్పకుండా తెలుగు వికీలో పనిచేస్తానని నా నమ్మకం. ఒక్కో వ్యాసం కొద్దికొద్దిగా వ్రాస్తూనే ఉంటాను. నా సోత్కర్ష ఆపి, అసలు విషయానికొస్తే, గత పదేళ్ళలో కంప్యూటర్లో తెలుగులో వ్రాయగలిగే అవకాశాలు చాలా మెరుగయ్యాయి, యూనీకోడు బాగా విస్తరించింది, తదనుగుణంగానే అంతర్జాలంలో తెలుగు కంటెంట్ పెరిగింది. మొబైల్లో వికీపీడియా అందుబాటులో ఉంది. ఒక్క ఓసీయారు తప్ప మిగిలిన ప్రధాన సాంకేతికపరమైన ఆటంకాలన్నీ తొలగిపోయాయి. మొరుగుపడడానికి ఇంకా చాలా అవకాశం ఉందని అంగీకరిస్తూనే, తెలుగు వికీ అవేర్‌నెస్ (సోయి) పెరిగిందని మాత్రం చక్కగా చెప్పుకోవచ్చు (నిదర్శనంగా కొత్త సభ్యులు ఎంతమంది చేరుతున్నారు, పేజీ హిట్స్ చూడవచ్చు). చేరిన వాళ్లందరూ తెవికీలో వ్రాయరు. విజ్ఞానసర్వస్వానికి అనుగుణంగా నిష్పాక్షికంగా వ్యాసాలు వ్రాయగలిగే వాళ్ళ సంఖ్యను స్కేలప్ చేయలేకపోయామన్నది ఒప్పుకోక తప్పదు. సముదాయేతర సంస్థల "చొరవ" లేకుంటే, పదేళ్ళ తర్వాత కూడా తెలుగు వికీ ఇప్పటికంటే నాణ్యంగానే ఉంటుందని నా నమ్మకం. అయితే అభివృద్ధి గణనీయంగా ఉంటుందా, సాధారణంగా ఉంటుందా అనేది వికీ ఇంటా, బయటా ఉద్యమంగా నడిపించగల నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:53, 3 జూన్ 2015 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు