గాలివాన (కథ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
ప్రముఖ కథారచయిత, సినీరచయిత పాలగుమ్మి పద్మరాజు రచించిన కథ '''గాలివాన'''. ధనికుడు, సంఘంలో పేరుప్రతిష్టలు ఉన్నవారు అయిన రావుగారికీ, దొంగ, బిచ్చగత్తె అయిన ఓ స్త్రీకి నడుమ గాలివానతో రైల్వేస్టేషనులో చిక్కుకుపోయిన రాత్రిని గాలివానలో చిత్రీకరించారు. ఈ కథకు పద్మరాజు చేసిన అనువాదం ''ద రెయిన్''కు 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. అలా ప్రపంచస్థాయిలో తెలుగు కథని నిలిపినదిగా గాలివాన తెలుగు సాహిత్యరంగంలో సుప్రఖ్యాతమైంది.
== కథా నేపథ్యం ==
గాలివాన కథని పాలగుమ్మి పద్మరాజు ప్రముఖ రష్యన్ రచయిత ''[[మాక్సిం గోర్కీ|గోర్కీ]]'' రాసిన ''ద ఆటమ్ నైట్'' కథ నుంచి స్వీకరించారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ కథలో లేని దృక్పథాల వైరుధ్యం, మార్పు వంటివి చేరుస్తూ కథను అద్భుతంగా మలిచారని భావించారు.<ref name="గాలివానపై ప్రభావాలు ఖదీర్" /> కథలోని గాలివాన చిత్రణ, గాలివాన రాత్రి ప్రధాన పాత్ర పొందిన వేదన, భయం వంటివాటి చిత్రణను స్వయంగా తన జీవితం నుంచే స్వీకరించివుండొచ్చని సాహిత్యకారుడు, పాత్రికేయుడు [[నరిశెట్టి ఇన్నయ్య]] పేర్కొన్నారు.
 
== ఇతివృత్తం ==
కథలోని ప్రధాన పాత్రల్లో ఒకటి రావుగారి పాత్ర. ఆయన సంఘంలో గౌరవమర్యాదలు, పేరుప్రతిష్టలు కలిగినవారు. వకీలుగా పనిచేసి కొడుకు వకీలు పరీక్షలు నెగ్గాకా తన ప్రాక్టీసును అతనికి అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నవారు ఆయన. ఆయన జీవితంలో ప్రతీ విషయంపైనా ఒక నియమాన్ని ఏర్పరుచుకుని అందుకు అనుగుణంగా జీవిస్తూంటారు. కుటుంబంలోని ప్రతివారినీ తన క్రమశిక్షణకు అనుగుణంగా నడుపుతూంటారు, చివరకు కూతుళ్ళ తలకట్టు ఎలావుండాలో కూడా రావుగారే నిర్ణయించేది. తత్త్వవేత్తగా తనను తాను భావించుకునే రావుగారికి ఉపన్యాసాలపై ఆసక్తి ఎక్కువ. దానితో వివిధ సంస్థల ఆహ్వానాల మేరకు "సత్వము-తత్త్వము", "ప్రకృతి-పరిష్కృతి" లాంటి పేర్లతో ఉపన్యాసాలు ఇస్తూంటారు.(అయితే శీర్షికలను విషయాన్ని బట్టి కాకుండా శబ్దాలంకారాలపై మోజుతో నిర్ణయించుకుంటూంటారని వారి స్నేహితుల వేళాకోళం) కథ ప్రారంభమయ్యే సమయానికి ఆయన ఆస్తిక సమాజం వారి ఆహ్వానం మేరకు "సామ్యవాదము-రమ్య రసామోదము" అన్న అంశంపై ప్రసంగించేందుకు రైలు ప్రయాణంలో ఉంటారు. వారున్న బెర్తుల వద్దకు అడుక్కునేందుకు వచ్చిన బిచ్చగత్తెను అసహ్యించుంటారు. అయితే ఆ రాత్రి మెల్లగా ప్రారంభమైన వాన అత్యంత తీవ్రమైపోతుంది. తాను దిగాల్సిన స్టేషన్లో బెడ్డింగు, సామాన్లతో సహా రావుగారు దిగుతారు. అయితే ఆ తీవ్రమైన గాలివానలో, రైల్వేస్టేషన్లో తాను అసహ్యించుకున్న బిచ్చగత్తెతో పాటుగా చిక్కుకుంటారు.<br />
"https://te.wikipedia.org/wiki/గాలివాన_(కథ)" నుండి వెలికితీశారు